తెలుగమ్మాయి అక్కడ ఫుల్ ఫాంలో ఉంది..!

తెలుగులో బాలీవుడ్ స్టార్స్, ముంబై మోడల్స్ మాత్రమే హీరోయిన్స్ గా తీసుకుంటారు.. తెలుగు వాళ్లకు అవకాశం ఇవ్వరు అన్న భావన కొద్దిమందిలో ఉంది. అంతేకాదు తెలుగు అమ్మాయిలు కూడా హీరోయిన్ అవ్వడానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. అయితే వచ్చిన కొద్దిమంది హీరోయిన్స్ కూడా ఇక్కడ అవకాశాలు లేక వేరే పరిశ్రమలకు వెళ్లి అక్కడ సక్సెస్ అవుతున్నారు. తెలుగమాయీల్లో బింధు మాధవి, ఆనంది ఇలాంటి కోవకి చెందిన వారే.. అయితే వీరందరికన్నా కోలీవుడ్లో ఎక్కువ క్రేజ్ సంపాధించిన తెలుగమ్మాయి శ్రీ దివ్య.

రవిబాబు ‘మనసారా’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన అమ్మడు తన క్యూట్ లుక్స్ తో తెలుగు ఆడియెన్స్ ని బుట్టలో వేసుకున్నా.. సరైన అవకాశాలు రాక కోలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. అక్కడ మాత్రం శ్రీ దివ్యకు పట్టం కట్టారు తమిళ తంబీలు. చిన్న సినిమాలు చేస్తూ భారీ విజయాలను అందుకుంటున్న ఈ భామ అక్కడ స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం కార్తి హీరోగా ‘కాస్మోరా’ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న శ్రీ దివ్య, విశాల్ హీరోగా చేస్తున్న సినిమాలో కూడా చాన్స్ కొట్టేసిందట.

కొంబన్ సినిమా దర్శకుడు ముత్తయ్య దర్శకత్వంలో విశాల్ ఓ సినిమా కమిట్ అయ్యాడు. సినిమాకు ముందు ఎవరెవరినో హీరోయిన్ గా అనుకున్నా ఫైనల్ గా శ్రీ దివ్యకు ఆ చాన్స్ వచ్చిందట. నడిఘర్ ఎలక్షన్స్ వేడి వల్ల కోలీవుడ్లో మునపటి మార్కెట్ కన్నా విశాల్ రేంజ్ బాగా పెరిగింది మరి అలాంటి స్టార్ హీరో సినిమాలో చాన్స్ కొట్టేసిన శ్రీదివ్య చూస్తుంటే చెన్నై బ్యూటీలకే చెమటలు పట్టించేలా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

ఖ‌మ్మం పంచాయితీ మ‌ళ్లీ షురూ… ఈసారి కాంగ్రెస్ లో!

ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాలు అంటేనే ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ న‌డుస్తూనే ఉంటుంది. అధికార పార్టీలో నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య చాలా క‌ష్టం. మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో తుమ్మ‌ల‌,...

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close