మోదీ ఈ కాలానికితగ్గ నాయకుడేనా?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా మంచి పనులు చేస్తున్నట్లు పైకి కనిపించవచ్చు. ప్రపంచం వేనోళ్లతో కీర్తించవచ్చు. అయితే ప్రస్తుతకాలానికి తగ్గట్టుగా మోడర్న్ గా ఆయన బిహేవ్ చేస్తున్నారా? లేక, పాతచింతకాయ పచ్చడిలాగా కుళ్లు రాజకీయాల ఊబిలోనే కొట్టుమిట్టాడుతున్నారా ?

మోదీ ఈమధ్యనే ప్రపంచంలోని మొదటి పదిశక్తిమంతుల్లో తనకంటూ ఓ స్థానం దక్కించుకున్నారు. జనం తప్పట్లు కొట్టారు. ఫోర్బ్స్ పత్రిక 2015కుగాను తాజాగా ప్రకటించిన అత్యంత శక్తిమంతమైన ప్రముఖ వ్యక్తుల్లో నరేంద్ర మోదీని 9వ స్థానంలో నిలిపింది. మోదీ సాధించిన ఈ ఘనత మీడియాల్లో మారుమ్రోగింది.

నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పటి నుంచి ప్రపంచదేశాలను చుట్టుముడుతున్నారు. భారత్ మహా దొడ్డదేశమంటూ చాలా గట్టిగానే ప్రచారంచేస్తున్నారు. విశేషంగా పెట్టుబడులు రాబట్టే ప్రయత్నాలు ముమ్మరంచేశారు. జాతీయ స్థూల ఆదాయాన్ని పెంచేందుకు తీవ్రస్థాయిలో కృషిచేస్తున్నారు. ఆర్థిక సంస్కరణలకోసం అహర్నిశలు కృషిచేస్తున్నారు. `ఇండియా అంటే మోదీ’ అన్న స్థాయికి ఎదిగారు. భారతీయులంతా సంతోషించారు. చాలాకాలం తర్వాత ఒక శక్తివంతమైన నాయకుడు దొరికారని ఆనందపడిపోయారు. అయితే, నిజంగానే మోదీ ప్రస్తుత కాలానికి తగ్గ నాయకుడేనా ? ఈ ప్రశ్నకు సమధానం చెప్పేముందు జాగ్రత్తగా ఆలోచించాలి. తొందరపాటు పనికిరాదు.

ఆర్గ్యారాయ్ చౌదరీ అనే సీనియర్ జర్నలిస్ట్ ఒక వ్యాసంలో ప్రధాని మోదీ గురించి చెబ్తూ, కెనడా ప్రధాని Justin Trudeau నుంచి ఆయన చాలానే నేర్చుకోవాలని రాశారు. కెనడాలో తాజాగా జరిగిన ఎన్నికల్లో జస్టిన్ విజయం సాధించి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కేబినెట్ ని కూడా ఏర్పాటుచేసుకున్నారు. ఈ మంత్రివర్గం ప్రత్యేకత ఏమంటే, అది విభిన్న సంస్కృతుల మేలికలయికగా ఉండటం. మంత్రివర్గంలో స్త్రీపురుషుల నిష్పత్తి సమంగాఉంది. సమాజంలోని అన్ని వర్గాల వారికీ అవకాశం కల్పించారు. ఇందులో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ , మతపరంగా మైనార్టీవర్గాల వారు కూడా స్థానం దక్కించుకున్నారు. కెనడాలోని మిలటరీ ఆఫీసర్ హర్జిత్ సజ్జన్ మంత్రివర్గంలోచేరి రక్షణమంత్రిగా పదవీబాధ్యతలు అందుకోవడం మరో విశేషం. ఎలాంటి వివక్ష లేకుండా నిష్పక్షపాతంగా మంత్రిమండలిని ఏర్పాటుచేసి జస్టిన్ అందర్నీ ఆశ్చర్యచికితుల్ని చేశారు. `ఇలా ఎలా చేయగలిగారు?’అని ఒక జర్నలిస్ట్ అడిగితే, చాలా సింపుల్ గా జస్టిన్ , `ఎందుకంటే, ఇది 2015 కనుక..’ అంటూ శక్తిమంతమైన సమాధానమిచ్చారు.

కాలానికి తగ్గట్టుగా నాయకుడన్నవాడు ఉండాలన్న సూత్రం ఈ క్లుప్త సమాధానంలో ఇమిడిఉంది. సరే, కెనడాలో విషయాలు మనకెందుకని చాలా తేలిగ్గా తీసేయవచ్చు. కానీ అక్కడి ప్రధానమంత్రి ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఘనకీర్తి భుజాలకెక్కించుకున్న మోదీ అలా ఎందుకని లేరన్నది అసలు ప్రశ్న.

ఫోర్బ్స్ పత్రికలో మన మోదీగారు 9వ స్థానంలో ఉంటే ఉండవచ్చు. కానీ, దేశంలో సహనశీలత ఎందుకని చప్పబడిపోతుందో ఆయన సహనస్వభావంతో శాంతంగా సమాధానం చెప్పలేకపోతున్నారెందుకని? ఎవరైనా తన ప్రభుత్వాన్ని శంకించినా, సూటిగా ప్రశ్నించినా మోదీ తట్టుకోలేకపోతున్నారు. అసహనం, అసమానత్వం, అశాంతి అన్న పదాలు వినడానికి కూడా ఆయనగారు సిద్దంగాలేరు. కాంగ్రెస్, వామపక్షాలు కాదంటే మేధావులు చేస్తున్న విమర్శలను త్రిప్పికొట్టే తీరులో చాలా పరుషంగా మాట్లాడుతున్నారు. 1984 అల్లర్ల వంటి సంఘటనలు లాక్కొచ్చి ఎదుటివాడిలోని తప్పును భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. గురవింద గింజ తననలుపు ఎరుగనట్లు బిహేవ్ చేస్తున్నారు. అసహనానికి అసహనమే మందన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వ్యక్తి ప్రపంచ స్థాయిలో ప్రభావితం చూపే 9వ అత్యంత శక్తిమంతుడిగా గుర్తింపుపొందారు. అన్ని మతాలవారినీ కలుపుకోవాలనీ, అన్ని సామాజిక వర్గాలను అక్కునచేర్చుకోవాలన్న స్పృహ మోదీకి కరవైంది. ఒకవేళ ఆ స్పృహ ఉండిఉంటే , దేశమంతటా అసహన పవనాలు వీచేవి కావేమో..

గాంధీని ఆదర్శంగా తీసుకున్న మోదీ మనస్సు గాంధీ సిద్ధాంతాలను జీర్ణించుకునే స్థాయికి ఎదగలేదు. శాంతి, సహనం పాటించలేని వ్యక్తి ప్రధానమంత్రి హోదాలో కూర్చుని దేశ ప్రజలందరికీ సమన్యాయం, సమభావం కల్పిస్తారని ఆశించలేము.

అంతటా, అసహం రాజ్యమేలుతుందనీ, అసమానతలు పెరిగిపోయాయని విపక్షాలు అనవసరంగా నానారాద్దాంతం చేస్తుందని అంటున్నారేకానీ, మోదీ తన తప్పుతాను తెలుసుకోలేకపోతున్నారు. టీ కొట్టు నడిపిన వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగినా, చక్కటి విజనున్న నేతగా పేరుబడినప్పటికీ దురదృష్టమేమంటే, ఇప్పటికీ రాజకీయబురద గుంటలోపడిదొర్లుతూ తనలోని మేధావి తనాన్ని, శక్తిని నిర్వీర్యం చేసుకోవడం. ఇప్పటికైనా మోదీ కాలానికి తగ్గ ప్రధానిగా ఎదగాలి. అప్పుడే జ్ఞాననేత్రాలు తెరుచుకుంటాయి. అలా జరగకపోతే ఎవరు ఎన్ని సార్లు ఆయన్ని అత్యంత ప్రభావశీలునిగానో, శక్తిమంతుడిగానో కీర్తించినా దేశానికి ఒరిగేది ఏమీ ఉండదు. చిన్నపిల్లాడైతే చెప్పొచ్చు. కానీ మోదీ ఇప్పుడు ప్రపంచ స్థాయికి ఎదిగిన నాయకుడు. తనకంతా తెలుసని అనుకుంటున్నారు. ఇదో దురదృష్టకర పరిస్థితి.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాలికో న్యాయం .. జగన్‌కో న్యాయమా ?

గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసులు, జనార్దన్ రెడ్డి తీరు , విచారణ ఆలస్యం అవుతున్న వైనం ఇలా అన్ని విషయాల్లోనూ సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణను ఫాలో అవుతున్న వారికి...

ఇక టీఆర్ఎస్ పార్టీ లేనట్లేనా !?

కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ రాజకీయాలు చేయలేరు. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ కోసమే ఆ పార్టీపెట్టారు. ఇప్పుడు భారతీయ సెంటిమెంట్‌తో భారతీయ రాష్ట్ర సమితి...

ఫ్యాక్ట్ చెక్ ఏపీ.. నిజాలు చెప్పలేక తంటాలు !

ఏపీ పోలీసులు ఫ్యాక్ట్ చెక్ చేస్తామంటూ ప్రత్యేకంగా ఫ్యాక్ట్ చెక్ ఏపీ అంటూ కొత్త విభాగాన్ని చాలా కాలం కిందట ప్రారంభించారు. ఇందులో సామాన్యులు తప్పుడు సమాచారం వల్ల నష్టపోయే...

కొత్త పార్టీ..కొత్త విమానం.. కొత్త హుషారు.. కేసీఆర్ స్టైలే వేరు !

కేసీఆర్ మౌనం వెనుక ఓ సునామీ ఉంటుంది. జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకున్న తర్వాత కసరత్తు కోసం ఆయన కొంత కాలం మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన సునామీలా విరుచుకుపడనున్నారు. దసరా రోజు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close