ఉట్టిపడిన తెలుగుదనం – ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ప్రారంభోత్సవం

తెలంగాణ ఏర్పాటుకోసం ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో చాలా ఎక్కువగానూ విమర్శనాత్మకంగానూ చర్చల్లో పాల్గొన్నవారిలో నేనొకణ్ణి. అప్పట్లో ఉద్రేకాల గురించి ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే తెలుగు ప్రజల మధ్య వైరుధ్యాలు ఎప్పటికీ వైషమ్యాలు కావని చాలా నమ్మకంగా చెబుతుండేవాణ్ణి. తాత్కాలికంగా ఆవేశాలు వ్యక్తమైనా కాలం సర్దుబాటు చేస్తుందని నమ్మేవాణ్ణి. నిజంగానే ఎంతమంది నాయకులు ఎలాటి ప్రసంగాలు ప్రహసనాలకు కారకులైనా సరే ప్రజలు ప్రశాంతత కోల్పోలేదు.

ఇటీవల జిహెచ్‌ఎంసి ఎన్నికల సమయంలోనూ ఆ విధమైన వాదనలు తీసుకొచ్చిన వారినీ చాలా ఖచ్చితంగానే ఖండించాను.ఇది తెలుగు ప్రజల మీద, చరిత్ర మీద, చైతన్యం మీద వున్న నమ్మకం, అభిమానం తప్ప మరొకటి కాదు. మొన్న ఒక సభలో ఎన్టీఆర్‌పై ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రశంసలు 360 లో రాశాను. తాజాగా గౌతమీ పుత్ర శాతకర్ణి షూటింగు ప్రారంభంలో అభినందన ప్రసంగంలో కెసిఆర్‌ ఎన్టీఆర్‌ను ఏకోన్ముఖంగా ప్రశంసించడమే గాక తెలుగు జాతి తెలుగు ప్రజల చరిత్ర, మద్రాసీలనుంచి గుర్తింపు తేవడం వంటి పదాలతో సాగడం యాదృచ్చికమేమీ కాదు.

కేవలం రెండు పాలక పార్టీల కలయికగానో సర్దుబాటుగానో మాత్రమే దీన్ని చూడటం పాక్షికతే అవుతుంది. చరిత్ర అన్నది నిరంతర ప్రవాహం లాటిది తప్ప స్థిరబిందువు ఎన్నటికీ కాదు. ఆయా సందర్బాలను అవసరాలను బట్టి ఎవరు ఏమి మాట్లాడినా అంతిమంగా గత వారసత్వాలను, చారిత్రిక అనుబంధాలను ఎవరూ విస్మరించజాలరు.

నిజానికి కెసిఆర్‌ సినిమా రంగంలో కోస్తా జిల్లాలకు భౌగోళికంగా కలిగిన సదుపాయాన్ని సూటిగానే ప్రస్తావిస్తుంటారు. అలాగే మొన్న నీటి ప్రాజెక్టుల చర్చలో రాయలసీమకు నీళ్లు ఇవ్వడం గురించి కూడా మాట్లాడారు. వ్యూహ ప్రతివ్యూహాలు రాజకీయ సంవాదాలు సంఘర్షణలు సాగాల్సిందే గాని సానుకూల సంకేతాలను సంకుచితంగా చూడాల్సిన అవసరం లేదు. ఇతరత్రా కూడా తెలుగురాష్ట్రాల సుహృద్భాం పెరగడానికి, ప్రజలకు మేలు జరగడానికి ఇవి దోహదపడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో అప్పులకు తగ్గట్లుగా సంపద పెరుగుతోందా..!?

ఆంధ్రప్రదే్శ్ సర్కార్ పరిమితికి మించి అప్పులు చేస్తోంది. ఈ విషయాన్ని కాగ్ స్పష్టంగా చెప్పింది. అప్పులు చేయడం తప్పు కాదు. కానీ ఆ అప్పులకు తగ్గట్లుగా ఆస్తులను క్రియేట్ చేసినప్పుడు మాత్రమే... తిరిగి...

స్టీల్ ప్లాంట్ మద్దతు బంద్‌కు వైసీసీ సపోర్ట్ లేనట్లే..!

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న ఉద్యమం బంద్ దశలోకి వచ్చింది. ఐదో తేదీన ఏపీ వ్యాప్తంగా బంద్ పాటించాలని నిర్ణయించారు. ఈ మేరకు వామపక్షాలు లీడ్ తీసుకుని రంగంలోకి దిగి...

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిదే దేశద్రోహం కాదు..! మరి రక్షణ దేశంలో ఉందా..!?

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన దేశ ద్రోహం కిందకు రాదని సుప్రీం కోర్టు తేల్చేసింది. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై దాఖలైన కేసులో కోర్టు ఈ మేరకు కీలక తీర్పు చెప్పింది....

ఏపీలో పోర్టులన్నీ ఆదాని పరం..!

ఆంధ్రప్రదేశ్ ప్లస్ పాయింట్ సుదీర్ఘ తీరమని.. పోర్టులతో తట్టుకోలేనంత అభివృద్ధి చేస్తామని గత ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం కూడా.. చాలా చాలా మాటలు చెబుతూ ఉంటాయి. కానీ.. వాస్తవానికి కొత్త...

HOT NEWS

[X] Close
[X] Close