తెలంగాణలో పెరిగిన ‘సైకిల్’ స్పీడు

ఓటుకు నోటు వ్యవహారంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని కొన్ని రోజుల పాటు హడలిపోయిన తెలుగు దేశం నాయకులు, ఇప్పుడు దూకుడు పెంచారు. సైకిల్ గుర్తుపై గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్ రాజీనామా చేయకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం ఎలా చేశారంటూ టీడీపీ మొదటినుంచీ ధ్వజమెత్తుతోంది. ఆయన్ని బర్తరఫ్ చేయాలని గవర్నర్ ను చాలా సార్లు కోరింది. చివరకు రాష్ట్రపతికి వినతి పత్రం ఇచ్చింది.

ఇప్పుడు టీడీపీ తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైనట్టు కనిపిస్తోంది. మంగళవారం మరోసారి గవర్నర్ కు ఫిర్యాదు చేయడానికి రాజ్ భవన్ వెళ్లిన టీడీపీ నేతలు, అక్కడే ధర్నాకు దిగడం కలకలం రేపింది. గవర్నర్ నే టార్గెట్ చేస్తూ నిరసన ప్రదర్శన చేశారు. రెవంత్ రెడ్డికి బెయిల్ రావడం, చంద్రబాబుకు నోటీసు వ్యవహారంపై చడీ చప్పుడు లేకపోవడం వంటి కారణాలతో టీడీపీ స్వరం పెంచినట్టు కనిపిస్తోంది.

టీడీపీ రోజూ ఆందోళనలకు దిగితే అప్పుడు కేసీఆర్ స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. ధిక్కారమున్ సైతునా అనేది కేసీఆర్ వైఖరి. నేను దయతలచి ఇస్తానే తప్ప డిమాండ్ చేయకూడదని ఇటీవల కొన్ని సమ్మెల విషయంలో ఆయన వైఖరి స్పష్టమైంది. అలాంటిది, టీడీపీ పదే పదే ఆందోళనలతో తనను విమర్శిస్తుంటే అది ప్రజాస్వామ్యంలో సాధారణం అని ఊరుకుంటారా లేక కఠినంగా వ్యవహరించాలని పోలీసులు ఆదేశిస్తారా అనేది చూడాలి. ఒకవేళ కేసీఆర్ కఠిన వైఖరి అవలంబిస్తే అప్పుడు టీడీపీ ఎలా ప్రతిస్పందిస్తుంది అనేది కీలకం.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ బలపడటానికి గట్టిప్రయత్నం చేస్తోంది. కాబట్టి తెరాస ప్రభుత్వం కఠిన వైఖరి పెరిగే కొద్దీ హైదరాబాద్ లో తమకు ప్రజల సానుభూతి పెరుగుతుందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. సీమాంధ్ర ప్రజల్లో టీడీపీయేతరులను కూడా ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇటీవలి పరిణామాలతో ఈ ప్రయత్నాలు కొంత వరకు సఫలం అయ్యాయని టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇప్పుడు టీడీపీ మీద తెరాస ప్రభుత్వం కరకు వైఖరి అవలంబిస్తే గనక గ్రేటర్ ఎన్నికల్లో తమకే లాభిస్తుందనే టీడీపీ లెక్కలు నిజమవుతాయా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ రెడ్డి కొంపకు నిప్పెట్టుకుని ఏడాది !

"పిచ్చోడా.. నీ గొయ్యి నువ్వు తవ్వుకున్నావు" అని జగన్ రెడ్డిపై ఆప్యాయత చూపే ఉండవల్లి అరుణ్ కుమార్ నుంచి... తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ వరకూ...

మంత్రులు నాడు డమ్మీలు – నేడు పనిమంతులు !

ప్రజాస్వామ్యంలో సీఎం ఒక్కరే పాలకుడుకాదు. ఆయన నేతృత్వంలో అందరూ పని చేయాల్సిందే. కానీ కొంత మంది మాత్రం.. తప్పనిసరిగా పదవుల్ని ఇతరులకు పంచినా అధికారాన్ని ఇచ్చేందుకు మాత్రం నిరాకరిస్తూ ఉంటారు....

పడవలు.. వీడని ప్రశ్నలు!

ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనక నిజంగానే కుట్రకోణం ఉందా? ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయలనే పడవలను గాలికి వదిలేశారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అవును.. ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు...

హైడ్రా.. అస్త్రసన్యాసమా?

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల అంతు తేల్చేందుకు తీసుకొచ్చిన హైడ్రా సంచలనం రేపింది. ఎప్పుడు.. ఎక్కడ.. ఏ ఆక్రమణలను నేలమట్టం చేస్తుందోనని అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టించింది. ఫిర్యాదులు రావడమే ఆలస్యం డాక్యుమెంట్ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close