బాహుబలి ఇడ్లీ, వడ, దోస…!!

అది భీమవరంలోని శ్రీ విజయలక్ష్మీ సినీ కాంప్లెక్స్ . అక్కడ డి.జె.ఫుడ్ పబ్ వారు ఒక ఆసక్తికరమైన ఫ్లెక్సీ పెట్టారు. ఇప్పడు మీరోసారి ఫోటో చూడండి. అర్థమైంది కదా, అదీ సంగతి. బాహుబలి సినిమా అంటే అంత క్రేజ్ అన్నమాట. శివుడు (ప్రభాస్) క్రింద వెజ్ ప్యాక్ రూ. 200అనీ, అలాగే, మరోవైపు భల్లాలదేవ (రానా) ఫోటో క్రింద నాన్ వెజ్ ప్యాక్ రూ. 300అని ఉందికదా. నోరూరించే వంటకాలకు కూడా బాహుబలి సినిమాతో సంబంధంఉన్నవారి పేర్లే పెట్టారు. ఈ ఫుడ్ ప్యాక్ లో ఎస్ఎస్ రాజమౌళి డ్రై ఐటమ్, ప్రభాస్ నాన్, అనుష్క కర్రీ, రానా రైస్ , తమన్నాడ్రింక్స్ సర్వ్ చేస్తారు.
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రభంజనాలు వీస్తున్నాయి. ఒకటి బాహుబలి సంచలన ప్రభంజనం. రెండోది మహాపుష్కర ప్రభంజనం. ఈ రెండు తప్ప మరో టాపిక్ జనం మాట్లాడుకోవడంలేదు.
ఈ మధ్యనే ఈ రచయిత పుష్కరయాత్రకు వెళుతుంటే, అనేక పల్లెల్లో బాహుబలి ఫ్లెక్సీలు కనబడ్డాయి. లోకల్ యూత్ అసోసియేషన్, లేదా ప్రభాస్, రానా అభిమాన సంఘాలు, కాకుంటే రాజమౌళి ఫ్యాన్స్ అంటూ పెద్దపెద్ద ఫ్లెక్సీలు వెలిశాయి.
బాహుబలిమీద ఉన్న అభిమానంతో ఫుడ్ పబ్ లే కాదు, ఇక ముందు అంతే ఉత్సాహంతో పెద్దపెద్ద హోటల్స్ ఇంకా ఇతర వ్యాపారాలు కూడా రావచ్చు.
ప్రస్తుతానికి మనం బాహుబలి హోటల్ పెడితే, అందులో మెనూ ఎలా ఉంటుందో చూద్దాం…
1.
బాహుబలి ఇడ్లీ : మామూలు ఇడ్లీలకంటే కాస్తంత పెద్దసైజులో ఉంటూ పున్నమి చంద్రుడిలా అందంగా ఉండాలన్నమాట.

2.
భల్లాలదేవ వడ: ఎప్పుడైనా సరే ఈ ఐటెమ్ ని వేడివేడిగానే వడ్డించాలి సుమా. ఎందుకంటే, భల్లాలదేవ (రానా)ను ముట్టుకుంటే షాక్ కొట్టినట్టు, వేడి సెగలు ముఖానికి తగలాలన్నమాట.

3.
అవంతిక దోస :
పలచగా, దోరగా వేసిన దోసలనే వడ్డించాలి. అవంతిక దోసెలను నాజుకుగా మునివేళ్లతో తుంచుకుంటూ చెట్నీలో నంచుకుంటూ తింటుంటే బాహుబలి సినిమాలోని అందాలరాశి తమన్నా గుర్తుకురావాలన్నమాట.

4.
దేవసేన దిల్ పసంద్ : పైకి చూడటానికి బన్ లా కనపడినా, మధ్యలో తియ్యటి రుచి దీని ప్రత్యేకత. బాహుబలి ది బిగెనింగ్ లో దేవసేన (అనుష్క) ముసలి రూపంలో కనిపించినా, రెండో పార్ట్ లో ఆమె అందచందాలు దిల్ పసంద్ గా ఉండబోతున్నాయి కనుక ఇలా దేవసేన దిల్ పసంద్ ఐటెమ్ పెట్టేయవచ్చు.

5.
కాలకేయ మసాలా దోస : ఇది ఆర్డర్ ఇస్తే, బాగా రోస్ట్ చేసి అంటే, నల్లవాగు వచ్చేదాకా పెనంమీద ఉంచితీశాక ప్లెట్ లో పెట్టి కస్టమర్ కి సర్వ్ చేయాలి. అది చూడగానే కాలకేయడు గుర్తుకురావాల్సిందే మరి.

6.
శివగామి మిక్స్ డ్ వెజిటబుల్ సూప్ : బాగా వేడివేడిగా వడ్డిస్తారు. ఆవురావురని తాగేస్తే నోరుకాలడం ఖాయం. నిదానంగా ఆస్వాదిస్తుంటే మమతల తల్లి గుర్తుకు వస్తుంది మరి.

7.
రాజమౌళీ కాంప్లిమెంట్ స్వీట్ : హోటల్ కి వచ్చిన అతిథులకు ముందుగా అందించే స్వీట్ ఇది. వేడివేడి జిలేబీ లాంటిదన్నమాట.

8
కీరవాణి ఐస్ క్రీమ్ : చల్లటి ఐస్ క్రీమ్ తింటుంటే చక్కటి సంగీతం గుర్తుకురావాలి. అందుకే ఈ స్పెషల్ ఐస్ క్రీమ్.
ఇంకా ఇలాంటి ఐటెమ్స్ మీకు తడితే కామెంట్స్ లో రాయండి. అలాగే ఎవరైనా ఈ ఐటెమ్స్ తో హోటల్ తెరిస్తే ప్రారంభోత్సవానికి నన్ను పిలవండి.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వెట్రిమార‌న్‌తో సినిమా చేయాల‌ని ఉంది: ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌తో సినిమా చేయ‌డానికి పెద్ద పెద్ద క‌మ‌ర్షియ‌ల్ ద‌ర్శ‌కులు ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ మ‌న‌సులో మాత్రం.. ఓ దర్శ‌కుడు ప్ర‌త్యేక స్థానాన్ని ఆక్ర‌మించుకొన్నాడు. త‌న‌తో సినిమా చేయాల‌ని ఎన్టీఆర్ ఆస‌క్తి చూపిస్తున్నాడు....

సీఎంఆర్ఎఫ్‌కే మేకపాటి విరాళం – జగన్ ఊరుకుంటారా ?

సీఆర్ఆర్ఎఫ్‌కు ఎవరూ విరాళాలు ఇవ్వవద్దని వైసీపీ నేతలు .. తమ వారు అందరికీ సమాచారం పంపారు. అందుకే కొంత మంది చెక్కులు తెచ్చి జగన్ కే ఇచ్చారు. అయితే జగన్ మాటను లెక్క...

నెక్ట్స్ వివేకా కేసులో గీత దాటిన వైపీఎస్‌లే !

ఐపీఎస్‌లు అనే పదానికి అర్థం మార్చేసి వైపీఎస్‌ల తరహాలో చెలరేగిపోయిన అధికారులకు ఇప్పుడు తాము ఎంత తప్పు చేశామో తెలిసే సమయం వచ్చింది. ప్రభుత్వం మారగానే వారు చేసిన తప్పులన్నీ మీద పడిపోతున్నాయి....

కాంగ్రెస్ లో కొత్త షార్ట్ కట్… వర్కింగ్ టు కింగ్.. !

తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల గోల ఎప్పుడూ ఉండేదే.. ఇప్పుడూ అదే జరుగుతోంది. ఒకప్పుడు ఇస్తే పీసీసీ ఇవ్వండి..అంతేకాని ప్రాధాన్యత లేని వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ అక్కర్లేదు అంటూ పెదవి విరిచిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close