రిలీజ్‌కి సిద్ధంగా ఉన్న సినిమాలేంటి?

చిత్ర‌సీమ ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్న శుభ ఘ‌డియ ఇది. థియేట‌ర్ల‌కు మోక్షం ఎప్పుడు వ‌స్తుందో, తాళాలు ఎప్పుడు తెరుస్తారో.. అన్న నిరీక్ష‌ణ‌కు తెర దించుతూ – ప్ర‌భుత్వం ప‌చ్చ‌జెండా ఊపేసింది. ఇక ఏ క్ష‌ణంలో అయినా, థియేట‌ర్లు తెర‌చుకోవొచ్చు. కొత్త నిబంధ‌న‌ల్ని దృష్టిలో ఉంచుకుని… నిర్మాత‌లు అడుగులు వేయాల్సివుందిప్పుడు. 50 శాతం ఆక్యుపెన్సీ మిన‌హాయిస్తే – మిగిలిన నిబంధ‌న‌లేం స‌మ‌స్య కాదు. కాక‌పోతే.. ఇప్ప‌టికిప్పుడు రెడీగా ఉన్న సినిమాలేంటి? అన్న‌ది ఆసక్తిగా మారింది. మ‌రీ పెద్ద సినిమాలు ఇప్ప‌టి కిప్పుడు రాక‌పోవ‌చ్చు. కానీ, చిన్నా, మీడియం రేంజు సినిమాలు మాత్రం విడుద‌ల చేసుకోవ‌డానికి మార్గం సుగ‌మం అయిన‌ట్టే.

వైష్ణ‌వ్ తేజ్ సినిమా `ఉప్పెన‌` విడుద‌ల‌కు రెడీగా ఉందిప్పుడు. ఇప్ప‌టికే మూడు పాట‌లు కూడా బ‌య‌ట‌కు వచ్చేశాయి. ప్ర‌మోష‌న్ ప‌రంగా `ఉప్పెన‌` టీమ్ ఎవ‌ర్ రెడీగా ఉన్న‌ట్టే. టీజ‌ర్‌, ట్రైల‌ర్ బ‌య‌ట‌కు వ‌స్తే… ఇక రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌డ‌మే త‌రువాయి అవుతుంది. `సోలో బ‌తుకే సో బెట‌రు` కూడా డిసెంబ‌రులోనే వ‌స్తుంది. ఇప్ప‌టికే చిత్ర‌బృందం ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది. క్రిస్మ‌స్‌కి ఈ సినిమా రావొచ్చు. అఖిల్ సినిమా `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌` సంక్రాంతికి రావాలి. ప‌రిస్థితులు అనుకూలిస్తే.. ఆ సినిమాని కాస్త ముందుగా విడుద‌ల చేయొచ్చు. ప్ర‌దీప్ `30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా` కూడా.. రిలీజ్ డేట్ కోసం చూస్తోంది. ఇప్ప‌టికే ఓటీటీలో విడుద‌లైన ఆకాశ‌మే నీ హ‌ద్దురా, క‌ల‌ర్‌ఫొటో, మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాల్ని… ఇప్పుడు థియేట‌ర్ల‌లో విడుద‌ల చేసే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో “గుర్తు”ను కోల్పోయిన జనసేన..!

జనసేన పార్టీకి.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు ఏదీ కలసి రావడం లేదు. బీజేపీతో స్నేహం కోసం గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంతో తెలంగాణలో జనసేన పార్టీ తన...

మోడీ ఎడాపెడా అడిగేస్తున్న జగన్..!

టీకా ఉత్సవ్ అంటూ.. ఉత్సవాలు చేస్తున్నారు కానీ.. టీకాలు మాత్రం కావాల్సినన్ని పంపడం లేదని కేంద్రం వైఫల్యాన్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళిక ప్రకారం ప్రజల ముందు పెడుతున్నారు. గత...

కొర‌టాల ద‌గ్గ‌ర క‌థే లేదా?

త్రివిక్ర‌మ్ - ఎన్టీఆర్ సినిమా వాయిదా ప‌డ‌డంతో, ఎన్టీఆర్ - కొర‌టాల శివ సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిన‌ట్టైంది. ఆఘ‌మేఘాల మీద‌... ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. `ఆర్‌.ఆర్‌.ఆర్‌` త‌ర‌వాత‌.. ఎన్టీఆర్...

నాడు మర్కజ్ – నేడు కుంభమేళా ..!

గత ఏడాది కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో అందరూ మర్కజ్ వైపే వేళ్లు చూపించారు. అక్కడ విదేశాల నుంచి వచ్చిన ముస్లింలు సామూహికంగా ప్రార్థనలు చేయడం వల్లనే కరోనా వ్యాప్తి చెందిందని... అక్కడ...

HOT NEWS

[X] Close
[X] Close