మహేష్ బాబు అభిమానులకు ఇది షేకింగ్ వార్త. ‘వారణాసి’లో మహేష్ బాబుని రాజమౌళి 5 అవతారాల్లో చూపించబోతున్నట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్. మహేష్ రాముడిగా, రుద్రగా కనిపించబోతున్నట్టు చిత్రబృందం ఇది వరకే ప్రకటించింది. రుద్ర లుక్ కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు మరో సర్ప్రైజింగ్. ఇందులో మరో మూడు గెటప్పులు ఉన్నాయట. అంటే.. మొత్తం 5 రూపాలన్నమాట. ఆ గెటప్పులేమిటి? మహేష్ తో రాజమౌళి ఏం చేయిస్తున్నాడు అనే విషయాలు తెలియాలంటే మాత్రం ఇంకొంత కాలం ఆగాల్సిందే.
మహేష్ బాబు ఇన్నేళ్ల కెరీర్లో ఇప్పటి వరకూ డ్యూయల్ రోల్ చేసిందే లేదు. అలాంటిది ఏకంగా 5 అవతారాల్లో అంటే… ఫ్యాన్స్‌కు పండగే. రాముడి గెటప్ కి సంబంధించిన చిత్రీకరణ ఇది వరకే పూర్తయ్యింది. రామాయణానికి సంబంధించిన ఎపిసోడ్ దాదాపు అరగంట ఉండబోతోందట. ఆ 30 నిమిషాలూ అభిమానులకు పూనకాలే. మిగిలిన గెటప్పుల్లో ఒక దానికి సంబంధించిన షూట్ కూడా అయిపోయిందట. అంటే.. మరో రెండు గెటప్పులు బాకీ. అవన్నీ చిత్రబృందం ఇప్పుడే రివీల్ చేసే అవకాశం లేదు. బహుశా.. ఇవన్నీ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోసం రాజమౌళి అట్టిపెట్టే అవకాశం ఉంది. మహేష్ ఇన్ని గెటప్పుల్లో కనిపిస్తాడన్న విషయాన్ని కూడా చిత్రబృందం చివరి వరకూ గోప్యంగా ఉంచే ఛాన్సులే ఎక్కువ. ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి విషయాన్నీ రాజమౌళి బయటకు చెప్పడానికి ఇష్టపడడం లేదు. సోషల్ మీడియాలో వార్తలు వచ్చినా టీమ్ పట్టించుకోవడం లేదు. మహేష్ రాముడిగా కనిపించబోతున్నాడన్న విషయం ఇది వరకే లీక్ అయ్యింది. అప్పుడు కూడా టీమ్ మౌనంగానే ఉంది. ఇప్పుడు కూడా అదే జరగొచ్చు.