తెలుగు360 సర్వే : ప.గో జిల్లాలో వైసీపీకీ ఈ సారీ షాకే..!

జిల్లాల వారీగా తెలుగు360 పకడ్బందీగా ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించి .. విశ్లేషించి ఇస్తున్న సర్వేల్లో భాగంగా.. ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లా ఫలితాలను చూద్దాం…!. 2014 ఎన్నికల్లో జిల్లా నుంచి పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 15 అసెంబ్లీ స్థానాలుంటే.. ఒకటి బీజేపీ, 14 టీడీపీ గెలుచుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు.. ఇలా ఎలాంటి ఎన్నికలు జరిగినా.. అక్కడ టీడీపీనే హవా కొనసాగిస్తోంది. అధికార వ్యతిరేకత, ఎమ్మెల్యేలపై జనాగ్రహం లాంటివి కనిపిస్తున్నా.. వైసీపీ మాత్రం పుంజకోలేదు. ఇక్కడ ఆ పార్టీకి చెందిన ఓటు బ్యాంక్ కొంత ప్రధానంగా జనసేన వైపు వెళ్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. సంప్రదాయంగా.. అండగా ఉండే సామాజికవర్గాలు.. ఈ జిల్లాలో పెద్దగా లేకపోవడం.. ఉన్న వర్గాలు జనసేన వైపు చీలిపోవడంతో… వైసీపీ ఇక్కడ ఈ సారి కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని సర్వేలో తేలింది. నియోజకవర్గాల వారీగా.. ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం..!

ప.గో జిల్లాలో.. గత ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా బీజేపీకి ఇచ్చిన ఒకే ఒక్క సీటు తాడేపల్లిగూడెం. అప్పటి వరకూ.. బీజేపీకి ఉనికి పెద్దగా లేదు. అయినప్పటికీ.. టీడీపీ మద్దతుతో విజయం సాధించగలిగారు. ఈ సారి బీజేపీ ఉనికి లేదు. మాణిక్యాలరావు కూడా నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. దాంతో ప్రధాన పోటీ టీడీపీకి అభ్యర్థి ఈలి నాని, వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మధ్య పోరాటం నెలకొంది. టిక్కెట్ ఆశించిన టీడీపీ నేత ముళ్లపూడి బాపిరాజు.. కుల సమీకరణాల కారణంగా అవకాశం దక్కించుకోలేకపోవడంతో.. అసంతృప్తికి గురయ్యారు. కానీ.. ఈలి నాని విజయానికి పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొన్నా… అభ్యర్థులకు మద్దతిచ్చే సామాజికవర్గాల్లో చీలక కనిపిస్తోంది. ఫలితంగా.. టీడీపీ అభ్యర్థి ఈలి నాని బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉంగుటూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి పుప్పాల శ్రీనివాసు గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని ఉండటంతో టిక్కెట్ కేటాయించారు. జనసేన నుంచి నవుడు వెంకటరమణ పోటీకి సై అంటున్నారు. సంక్షేమ పథకాలు… ప్రతీ కుటుంబానికి అందేలా గన్ని వీరాంజనేయలు.. ప్రత్యేక శ్రద్ధ చూపించారు. వైసీపీకి మద్దతుగా ఉండే కొన్ని సామాజికవర్గాలు.. ఈ సారి జనసేనకు మద్దతు పలుకుతున్నయి. దీంతో ఓట్ల చీలిక అనివార్యం అయింది. గన్ని వీరాంజనేయులు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.

తణుకులో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ కంఫర్టబుల్ పొజిషన్‌లో ఉన్నారు. ఆయనకు ముస్లిం వర్గాల నుంచి కూడా సంపూర్ణ మద్దతు లభిస్తోంది. గత ఎన్నికల్లో 35వేలకుపైగా మెజార్టీ సాధించారు. ఉన్నత విద్యావంతుడు.. అందర్నీ కలుపుకుని వెళ్లడం, సంప్రదాయంగా.. టీడీపీకి మద్దతిచ్చే వర్గాలు ఎక్కువగా ఉండటంతో.. రాధాకృష్ణ ప్రత్యర్థుల కంటే చాలా ముందు ఉన్నారు. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, జనసేన అభ్యర్థిగా పసుపులేటి రామారావు పోటీ చేస్తున్నారు. జనసేన అభ్యర్థి ఎవరి ఓట్లు ఎక్కువ చీలుస్తారో వారు నష్టపోతారు. అయితే ఈ ప్రమాదం… వైసీపీ అభ్యర్థికే ఎక్కువగా ఉంది. పోలవరం నియోజకవర్గంలో టీడీపీలో గ్రూపు తగాదాలు ఎక్కువగా ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చి తో బొరగం శ్రీనివాసరావుకి టిక్కెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ మాత్రం ముందుగానే అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని ప్రారంభించింది. తెల్లం బాలరాజు వైసీపీ టికెట్‌పై పోటీలో ఉన్నారు. గతంతో పోల్చితే వైసీపీ ఈ నియోజకవర్గంలో పుంజుకుంది. కాపులు, గిరిజనుల ఓట్లు ఎక్కువగా ఉండటం వలన రెండు సామాజికవర్గాలపైనే గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ వైసీపీ అభ్యర్థికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి.

పాలకొల్లు నియోజకవర్గంలో… త్రిముఖ పోటీ నెలకొంది. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి పార్టీలో చేరిన ఒక్క రోజులోనే టిక్కెట్ దక్కించుకున్న డాక్టర్ బాబ్జి బరిలోకి దిగారు. చివరి వరకూ.. వైసీపీ ఇన్చార్జిగా ఉండి.. టిక్కెట్ ఇక ఆయనకే అని చెప్పుకున్న గుణ్ణం నాగబాబుకు.. జగన్ హ్యాండివ్వడంతో.. ఆయన జనసేనలో చేరి… ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఆయనకు సానుభూతి కనిపిస్తోంది. నిమ్మల రామానాయుడు.. కొన్ని వర్గాల మద్దతు పూర్తి స్థాయిలో పొందలేకపోయారని భావిస్తున్నారు. ఇక్కడ ముక్కోణపు పోటీలో గుణ్ణం నాగబాబుపై సానుభూతి పవనాలు, పవన్ క్రేజ్‌తో.. జనసేనకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక టీడీపీకి కంచుకోట లాంటి నిడదవోలు నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పోటీ చేస్తున్నారు. టిక్కెట్ కోసం చాలా మంది ప్రయత్నించినప్పటికీ.. శేషారావు వైపే హైకమాండ్ నిలిచింది. అయితే అందరూ సర్దుకుని ఆయన విజయానికి ప్రయత్నిస్తున్నారు. వైసీపీ తరపున జి. శ్రీనివాస్‌ నాయుడుకు టికెట్ ఖరారయింది. నియోజకవర్గంలో కాపు కులస్తులపై ఈయనకు పట్టు ఉంది. ఇదే తనకు అనుకూలాంశంగా మారుతుందని ఆయన ఆశిస్తున్నారు. జనసేన అభ్యర్తిగా అటికల రమ్యశ్రీ పోటీలో ఉన్నారు. ఈమె చీల్చుకునే ఓట్లు ప్రధానంగా వైసీపీ అభ్యర్థి ఆశిస్తున్నవే కావడంతో… టీడీపీ అభ్యర్థి విజయం సునాయాసం కానుంది.

నరసాపురం టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుకే అవకాశం కల్పించారు. వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు టికెట్ ఖరారయింది. టీడీపీ టిక్కెట్ ఆశించిన కొత్తపల్లి సుబ్బారాయుడు.. రాకపోవడంతో.. మళ్లీ వైసీపీలో చేరిపోయారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున కొత్తపల్లి సుబ్బారాయుడే పోటీ చేశారు. ఓడిపోయారు. ఈ సారి ఆయన వైసీపీకి మద్దతిస్తున్నారు. ఇక్కడ జనసేన తరపున బొమ్మిడి నాయకర్ పోటీలో ఉన్నారు. పవన్ క్రేజ్‌ను బట్టి.. ఆయన చీల్చుకునే ఓట్లను బట్టి… అభ్యర్థుల జాతకాలు ఆధారపడి ఉన్నాయి. పోటీ హోరాహోరీగా ఉన్న టీడీపీకే విజయావకాశాలు ఉన్నాయి. కొవ్వూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వేషన్ చేసినప్పటికీ ఒక బలమైన సామాజికవర్గం పరిపాలన కొనసాగిస్తోంది. ఓ సారి ఎమ్మెల్యే అయిన ఎవర్నీ రెండో సారి కొనసాగించడానికి ఇష్టపడరు. ఈ సారి కూడా జవహర్‌ను మార్చే వరకూ ఆందోళనలు చేశారు. చివరికి పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు కొవ్వూరు టికెట్‌ను కేటాయించారు. సంప్రదాయకంగా .. టీడీపీకి బలమైన స్థానం కావడంతో.. అక్కడ విజయం సునాయాసం కానుంది.

గోపాలపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో 11వేల మెజార్టీతో వైసీపీ అభ్యర్థిపై గెలుపొందారు. వైసీపీ అభ్యర్థిగా తలారి వెంకట్రావు మళ్లీ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయనే వైసీపీ నుంచి పోటీ చేసి ముప్పిడి వెంకటేశ్వరరావుపై ఓటమిపాలయ్యారు. ఈసారి జనం తనను ఆదరిస్తారని తలారి నమ్ముతున్నారు. అందరికీ అందుబాటులో ఉండటం.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటికి చేరడంతో టీడీపీ అభ్యర్థి ఎక్కువ ధీమాగా ఉన్నారు. ఏలూరులో బిగ్ ఫైట్ జరగుతోంది. టీడీపీ నుంచి బడేటి కోట రామారావు తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా మళ్లీ పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి ఆళ్ల నాని పోటీ చేస్తున్నారు. జనసేన నుంచి రెడ్డి అప్పలనాయుడు బరిలో ఉన్నారు. ప్రధానంగా వైసీపీ, టీడీపీ, జనసేన మధ్యే పోరు ఉంది. జనసేన అభ్యర్థి చీల్చే ఓట్లతో.. టీడీపీకి నష్టం జరిగే అవకాశాలున్నాయి. దీంతో.. వైసీపీ అభ్యర్థికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున కొఠారు అబ్బయ్యచౌదరి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్ధులు ఇద్దరిదీ పెదవేగి మండలమే. పవన్ కల్యాణ్ చింతమనేనిని ఓడించాలనే లక్ష్యంతో జనసేన అభ్యర్థిగా ఘంటసాల వెంకట లక్ష్మిి ని బరిలోకి దించారు. మాస్ లీడర్ గా పేరున్న చింతమనేని… వివాదాస్పద వ్యవహారశైలిపై బయట ఎంత నెగెటివ్ ప్రచారం జరిగినా..ఆయన ప్రజలకు మేలు చేస్తాడని అక్కడి జనం నమ్ముతున్నారు. ఈ సారి కూడా చింతమనేని వైపే ప్రజల మొగ్గు ఉంది. చింతలపూడి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన పీతల సుజాతకు ఈ సారి టికెట్‌ను టీడీపీ కేటాయించలేదు. ఆమెకు బదులుగా కర్రా రాజారావును టీడీపీ బరిలోకి దించింది. వైసీపీ అభ్యర్థిగా వీఆర్ ఎలీషా, ఇక జనసేన తరపున మేకల ఈశ్వరయ్య బరిలోకి దిగుతున్నారు. అభ్యర్థిని మార్చడంతో… టీడీపీకి కలసి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆచంట నియోజకవర్గంలో…మంత్రి పితాని సత్యనారాణ.. బలంగా ఉన్నారు. ఆయన అయితేనే గెలుస్తారన్న ఉద్దేశంతో.. ఆయనకు కుటుంబానికి రెండు టిక్కెట్లు ఆఫర్ చేసి..వైసీపీలో చేర్చుకోవాలని జగన్ ప్రయత్నించారు. మైండ్ గేమ్ ఆడారు. కానీ సాధ్యం కాలేదు. చెరుకువాడ శ్రీరంగనాథ రాజును వైసీపీ బరిలోకి దించింది. జనసేన తరపున జవ్వాది వెంకట జయరామ్ పోటీ చేస్తున్నారు. మంత్రిగా పితాని.. వ్యతిరేకత పెంచుకోలేదు. అందర్నీ కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో.. ఆయనకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే శివరామరాజును పార్లమెంట్ బరిలో నిలిపిన చంద్రబాబు… రామరాజుని అభ్యర్థిగా ప్రకటించారు. నియోజకవర్గంపై పట్టు ఉన్న శివరామరాజు…రామరాజుకి పూర్తి మద్ధతు ఇవ్వడం ప్లస్ కానుంది. ఉండి నియోజకవర్గం లో ఇక్కడ టీడీపీ క్యాడర్ బలంగా ఉంది. అభ్యర్థిని మార్చడం.. మరింతగా ప్లస్ అయింది. వైసీపీ అభ్యర్థి నరసింహరాజు నియోజకవర్గంలోని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జనసేన చీల్చే ఓట్లు ఎవరివి అన్నవే ఫలితాలపై ప్రభావం చూపనుంది. టీడీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న భీమవరం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌ కూడా హోరా హోరీ తలపడుతున్నారు. టీడీపీలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. వైసీపీకి మద్దతుగా ఉండే వర్గాలు జనసేనకు అండగా నిలుస్తున్నాయి. దీంతో.. పవన్ కల్యాణ్‌ భీమవరం నుంచి గెలుపు దిశగా ఉన్నారని చెప్పుకోవచ్చు.

AreaParty
కొవ్వూరు (ఎస్సీ) టీడీపీ
నిడదవోలు టీడీపీ
ఆచంట టీడీపీ
పాలకొల్లు జనసేన
నర్సాపురం టీడీపీ
భీమవరం జనసేన
ఉండి టీడీపీ
తణుకు టీడీపీ
తాడేపల్లిగూడెం టీడీపీ
ఉంగుటూరు టీడీపీ
దెందులూరు టీడీపీ
ఏలూరు వైసీపీ
గోపాలపురం (ఎస్సీ) టీడీపీ
పోలవరం (ఎస్టీ) వైసీపీ
చింతలపూడి (ఎస్సీ) టీడీపీ

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close