పవన్ దెబ్బకు సెలవులో తూ.గో జిల్లా ఎస్పీ..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తునిలోని దివీస్ పరిశ్రమను తరలించాలనే ఆందోళనలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. అయితే పోలీసులు అనుమతి నిరాకరించారు. అది కూడా.. ఆయన బయలుదేరడానికి కొద్ది గంటల ముందు. దీంతో వివాదం ఏర్పడింది. రాజకీయ కారణాలతోనే ఇలా చేశారని.. తాము పర్యటించి తీరుతామని.. ఏం చేసుకుంటారో.. చేసుకోండన్నట్లుగా… జనసేన నేతలు ప్రకటనలు ప్రారంభించారు. పవన్ కల్యాణ్ కూడా.. తాను వస్తున్నానని.. ఒకే ఒక్క వాక్యంతో తేల్చేశారు.దీంతో పోలీసుల్లో టెన్షన్ ప్రారంభమయింది. ఇప్పటికే..విపక్ష నేతల మీద పోలీసుల ప్రయోగం అధికంగా ఉందని.. హక్కుల్ని హరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇలాంటి సమయంలో.. పవన్ కల్యాణ్ పర్యటనను అడ్డుకుంటే అది మరింత వివాదానికి దారి తీసే పరిస్థితి ఉంది. జనసైనికులు పెద్ద ఎత్తున తరలి వచ్చి… పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోయినా… భారీ సభను విజయవంతం చేస్తారు. అప్పుడు కేసులు పెట్టాల్సి వస్తుంది. అదే జరిగితే.., మరింత రాజకీయ రచ్చ అవుతుంది. ఈ పరిణామాలన్నింటితో… పర్మిషన్ ఇవ్వడమే మంచిదని పోలీసులు నిర్ణయానికి వచ్చారు. మొదట అనుమతి నిరాకరించమని పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు… ఆ పని చేసిన ఉన్నతాధికారులు.. తర్వాత మళ్లీ… పర్మిషన్ ఇవ్వాలని సంకేతాలు రావడంతో హతాశులయ్యారు. ఈ వ్యవహారంతో… కంగారు పడ్డారో… ఏమో కానీ… పవన్ కల్యాణ్ పర్యటన పూర్తయ్యే వరకూ… రెండు రోజుల పాటు.. తాను సెలవులో వెళ్తున్నట్లుగా ఎస్పీ ప్రకటించారు.

పవన్ పర్యటనకు.. తన సెలవుకు సంబంధం లేదని… వ్యక్తిగత సెలవుపై వెళ్తున్నానని ఆయన చెబుతున్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులకు …రాజకీయ వ్యూహాలు అమలు చేయడమే పెద్ద టాస్క్‌గా మారిందన్న విమర్శలు పెరిగిపోతున్న సమయంలో పవన్ కల్యాణ్ టూర్ విషయంలో వ్యవహరించిన వైఖరి.. మరింత వివాదాస్పదమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిదే దేశద్రోహం కాదు..! మరి రక్షణ దేశంలో ఉందా..!?

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన దేశ ద్రోహం కిందకు రాదని సుప్రీం కోర్టు తేల్చేసింది. జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై దాఖలైన కేసులో కోర్టు ఈ మేరకు కీలక తీర్పు చెప్పింది....

ఏపీలో పోర్టులన్నీ ఆదాని పరం..!

ఆంధ్రప్రదేశ్ ప్లస్ పాయింట్ సుదీర్ఘ తీరమని.. పోర్టులతో తట్టుకోలేనంత అభివృద్ధి చేస్తామని గత ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం కూడా.. చాలా చాలా మాటలు చెబుతూ ఉంటాయి. కానీ.. వాస్తవానికి కొత్త...

“అన్యాయ మాటలు”.. సీజేఐ వైదొలగాలనే డిమాండ్లు..!

చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే భారత రాజ్యాంగం, చట్టాల పట్ల సంపూర్ణమైన అవగాహనతో ఉంటారని అనుకుంటారు. నిన్నామొన్నటి వరకూ సీజేఐ బోబ్డేపై అలాంటి అభిప్రాయమే ఉండేది. అయితే.. మహారాష్ట్రకు చెందిన...

శశికళ రిటైర్డ్ హర్ట్ మాత్రమే..రిటైర్మెంట్ కాదు..!

శశికళ అమ్మ జయలలిత సమాధి మీద శపథం చేశారు. జైల్లో ఓపిగ్గా శిక్ష అనుభవించారు. రిలీజై వచ్చిన తర్వాత రాజకీయాల్లో తేల్చుకుంటానన్నారు. అయితే హఠాత్తుగా రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించుకుంటున్నానని ప్రకటించారు. ఇది...

HOT NEWS

[X] Close
[X] Close