తిరుపతి ఉప ఎన్నిక, బీజేపీ కి అనేక పరీక్షలు

తిరుపతి ఎంపీ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక జరుగనుంది. సిట్టింగ్ వై ఎస్ ఆర్ సి పి ఎంపీ మరణంతో ఎన్నిక అనివార్యమైంది. రిజర్వుడు క్యాటగిరి ఎంపీ స్థానం అయిన ఈ నియోజకవర్గానికి టిడిపి ఇదివరకే పనబాక లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించింది. అధికార పార్టీ సిట్టింగ్ సీట్ కావడం తో పాటు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి బలమైన నేతలు ఉండడంతో వైఎస్సార్సీపీకి ఇక్కడ కాస్త అనుకూలత ఉంది. ఇక బిజెపి జనసేన కూటమి తరపున బిజెపి అభ్యర్థిని నిలబెడుతున్నట్లు అటు బిజెపి ఇటు జనసేన అధికారికంగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నిక బిజెపికి అనేక రకాలుగా పరీక్ష పెడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

బలమైన ప్రత్యామ్నాయం తామే అన్న బిజెపి వ్యాఖ్యలకు అసలైన పరీక్ష:

చాలా కాలంగా సోము వీర్రాజు సహా అనేకమంది బిజెపి నేతలు తాము జనసేన తో కలిసి ఆంధ్రప్రదేశ్ లో బలమైన ప్రత్యామ్నాయం గా ఎదుగుతామని సవాల్ విసురుతున్నారు. అయితే నిజంగా తెలంగాణలో దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికలలో జీరో నుండి హీరో స్థాయికి ఎదిగిన తీరు లో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎదుగుతారా లేక చరిత్రను పునరావృతం చేస్తూ నోటా తో పోటీ పడతారా అన్నది తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలతో తేలిపోనుంది. అయితే ఇటీవలి కాలంలో సోషల్ ఇంజనీరింగ్ లో రాటుతేలిన సునీల్ దియోధర్ వంటి బిజెపి నేతలు గత కొద్ది నెలలుగా తిరుపతి లో మకాం వేసి బూత్ లెవెల్ రిపోర్టులను తెప్పించుకుని మరీ కష్టపడుతున్నారు అన్న వార్తల నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నిక ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి భవితవ్యాన్ని నిర్దేశిస్తుండే పరీక్షలా మారింది అని చెప్పడంలో సందేహం లేదు.

బిజెపి రాష్ట్ర నాయకత్వం వైసీపీతో కుమ్మక్కు అయ్యారనే ఆరోపణలను తిప్పికొట్టే అవకాశం:

రాష్ట్ర బిజెపి నాయకత్వం అధికార వైఎస్ఆర్సిపి తో కుమ్మక్కు అయిందని ఒక విమర్శ ప్రధానంగా ఒక వర్గం మీడియాలో వినిపిస్తూ ఉంటుంది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు వంటి వారు సైతం టిడిపి వ్యాఖ్యలను తిప్పికొట్టడానికి చూపించినంత చొరవ అధికార వైఎస్ఆర్సిపి వ్యాఖ్యలను తిప్పి కొట్టడానికి చూపించరు అన్న వాదనా ఉంది. అయితే తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా బిజెపి, అధికార వైఎస్ఆర్సిపి ని ఢీ కొనడానికి ప్రయత్నిస్తుందా లేక ప్రతిపక్షంగా ఉన్న టిడిపిని టార్గెట్ చేసి, టిడిపిని నిర్వీర్యం చేసే దిశలో ఎక్కువ ఫోకస్ చేసి ,అధికార వైఎస్ఆర్సిపి కి ఊపిరి పోస్తుందా అన్నది చూడాలి.

పైగా స్టీల్ ప్లాంట్ సహా కొన్ని విషయాల్లో అధికార వైఎస్సార్సీపీకి బిజెపికి వెనకాల ఒప్పందాలు ఉన్నాయని టిడిపి నేతలు, టిడిపి అభిమానులు చేసే విమర్శల్లో ఏ మేరకు నిజం ఉందన్నది కూడా తేలిపోయే అవకాశం ఉంది. అదీ కాక సామాజిక సమీకరణాల పరంగా బిజెపి తో పోలిస్తే ఇక్కడ జనసేన కు కొంత అడ్వాంటేజ్ ఉందనే విశ్లేషణల నేపథ్యంలో జనసేన కి టికెట్ ఇవ్వకుండా బిజెపి టికెట్ తీసుకోవడం వెనకాల- గెలవాలనే పట్టుదల ఉందా లేక వై ఎస్ ఆర్ సి పి కి లోపాయికారిగా మేలు చేకూర్చే ఉద్దేశం ఉందా అన్నది కూడా తిరుపతి ఉప ఎన్నిక తేల్చి వేయనుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, వైఎస్ఆర్సీపీకి బిజెపికి మధ్య నిజంగా తెరవెనుక ఏ రకమైన సంబంధమైనా ఉందా ,లేదా అన్నది తిరుపతి ఉప ఎన్నిక తేల్చి వేయనుంది.

సోము వీర్రాజు కు సిసలైన పరీక్ష:

తెలంగాణలో బండి సంజయ్ దూకుడుగా వెళుతూ విజయాలు సాధిస్తూ ఉన్న నేపథ్యంలో సోము వీర్రాజు పై కూడా ఒత్తిడి పెరిగింది. దుబ్బాక, జిహెచ్ఎంసి లలో బిజెపి ఆ స్థాయిలో ఫలితాలు రావడానికి బిజెపి జాతీయ నాయకత్వ వ్యూహాలతో పాటు బండి సంజయ్ నాయకత్వ పటిమ కూడా ప్రధాన కారణం. మరి సోము వీర్రాజు బండి సంజయ్ కి సమానంగా తూగుతాడా అన్నది తిరుపతి ఉప ఎన్నిక తేల్చి వేయనుంది.

బిజెపి జనసేన బంధానికి పరీక్ష:

గతంలో తిరుపతి నియోజకవర్గం నుండి చిరంజీవి ఎమ్మెల్యేగా గెలవడానికి పని చేసిన సామాజిక కారణాలు ఈ నియోజకవర్గం పరిధిలో జనసేన కు కూడా అనుకూలంగా పనిచేస్తాయని, అందుకే తిరుపతిలో జనసేన అభ్యర్థిని నిలబెట్టడానికి తాము ఆశ పడుతున్నామని కొంతకాలం క్రితం జనసేన నాయకులు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఒక సామాజిక వర్గానికి చెందిన కొన్ని సంఘాలు తిరుపతి ఎంపీ టికెట్ జనసేనకు ఇస్తే తామంతా అండగా నిలబడి గెలిపించుకుంటామని ,ఇవ్వకపోతే తాము బిజెపికి మద్దతుగా నిలబడము అని బహిరంగంగా వ్యాఖ్యానించారు. జనసేన పార్టీకి చెందిన కొందరు ప్రతినిధులు కూడా టీవీ చానల్స్ డిబేట్ లో ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించారు. అయితే ఇప్పుడు ఆ సీటు బిజెపి తీసుకుంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య సమన్వయం ఏ స్థాయిలో ఉంటుంది, ఒకవేళ ఆ సమన్వయం కొరవడితే ఈ రెండు పార్టీల మధ్య బంధం నిలుస్తుందా లేదా అన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మొన్నటి జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఇప్పుడు తిరుపతి లో కూడా బిజెపికి సీట్లు వదులుకున్న కారణంగా కచ్చితంగా జనసేన అభిమానుల్లో కాస్త అసహనం ఉంది. మరి వారిని తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చేలా బిజెపి ఏ విధంగా మలుచుకుంటుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

ఏది ఏమైనా తిరుపతి ఉప ఎన్నిక జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి అనేక విధాలుగా బలమైన పరీక్షగా మారింది. 2019 ఎన్నికల్లో ఇక్కడ డిపాజిట్లు కోల్పోయిన బిజెపి, ఈ ఉప ఎన్నికల్లో ఏమేరకు ఆంధ్రప్రదేశ్లో పుంజుకుంటుంది, లేక అసలు పుంజుకుంటుందా లేదా అన్నది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాజకీయాలకు “వాటర్ షెడ్ మొమెంట్” గా మారే అవకాశం ఉంది.

– ZURAN

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోహ‌న్‌బాబు కోసం చిరు.. మ‌రోసారి!

చిరంజీవి - మోహ‌న్ బాబు మ‌ధ్య ఓ విచిత్ర‌మైన బంధం ఉంటుంది. ఇద్ద‌రూ బ‌య‌టి ప్ర‌పంచానికి ఎడ‌మొహం - పెడ‌మొహంలా క‌నిపిస్తారు. కానీ.. నిజ జీవితంలో ఇద్ద‌రూ బెస్ట్ ఫ్రెండ్స్ లా మెలుగుతుంటారు....

త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో యూఎస్‌లో బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షోను ఏర్పాటు చేసిన హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో యూఎస్‌లో  'అలా అమెరికాపురములో..` పేరుతో బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షోను ఏర్పాటు చేసిన  హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. సెన్సేష‌న‌ల్ కాన్స‌ర్ట్స్ ఏర్పాటుచేయ‌డంలో అగ్రగామిగా ఉన్న హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ఈ సంవత్సరం టాలీవుడ్ మ్యూజిక్...

శ్రీ‌నువైట్ల మ‌ల్టీస్టార‌ర్… ‘డ‌బుల్స్‌’

వ‌రుస హిట్లు ఇచ్చిన శ్రీ‌నువైట్ల‌.. ఇప్పుడు వ‌రుస ఫ్లాపుల‌ను మోస్తున్నాడు. అయినా స‌రే, మళ్లీ త‌న‌దైన ముద్ర వేయ‌డానికి త‌ప‌న ప‌డుతున్నాడు. అందులో భాగంగా `ఢీ అండ్ ఢీ` తీస్తున్నాడు. `డ‌బుల్ డోస్‌`...

జనసేనను మరోసారి కించ పర్చిన ఏపీ బీజేపీ..!

పవన్ కల్యాణ్‌కు కేంద్రంలో మంత్రి పదవి అని ఢిల్లీ నుంచి బీజేపీ లీకులు ఇస్తూ గిలిగింతలు పెడుతోంది కానీ.. అసలు విషయం మాత్రం అసలు జనసేనను లెక్కలోకి తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఏపీ...

HOT NEWS

[X] Close
[X] Close