అల్లు వారి అబ్బాయికి.. టెస్టింగ్ టైమ్‌

శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు మిన‌హాయిస్తే… అల్లు శిరీష్‌కి ఒక్క విజ‌య‌మూ లేదు. ఆ హిట్టు కూడా.. ప‌ర‌శురామ్ ఖాతాలో ప‌డిపోయింది. సోలో హీరోగా త‌న స్టామినా చూపించుకోవాల‌ని తెగ త‌హ‌త‌హ‌లాడుతున్నాడు శిరీష్‌. క‌థ‌ల ఎంపిక‌లో ఎంత జాగ్ర‌త్త‌లు తీసుకున్నా – ఎక్క‌డో ఓ చోట చేసిన త‌ప్పుకి సినిమా అంతా బ‌లైపోతోంది. అందుకే ఈసారి రిస్క్ త‌క్కువ ఉండేలా చూసుకుని `ఏ బీ సీ డీ` అనే రీమేక్ క‌థ ఎంచుకున్నాడు. తీసింది చూసుకుంటూ, మార్పులు చేసుకుంటూ వెళ్లాడు. ముందు అనుకున్న బ‌డ్జెట్ దారి త‌ప్పినా – అస్స‌లు వెనుకంజ వేయ‌డం లేదు. మంచి డేట్ కోసం.. విడుద‌ల తేదీలు వాయిదా వేసుకుంటూ కాల‌క్షేపం చేశాడు. మొత్తానికి ఈనెల 17కి ఈ సినిమా ఫిక్స‌య్యింది. థియేట‌ర్లో మ‌హ‌ర్షి జోరు ఇంకా కొన‌సాగుతూనే ఉంది. వీకెండ్ అయిన త‌ర‌వాత కూడా.. వ‌సూళ్లు బాగానే ఉన్నాయి. ఇవ‌న్నీ శిరీష్‌ని కాస్త భ‌య‌పెట్టేవే. మంచో, చెడో.. పాజిటీవ్‌గానో, నెగిటీవ్‌గానో సినీ ప‌రిశ్ర‌మ అంతా మ‌హ‌ర్షి గురించే మాట్లాడుకుంటోంది. ఈ ద‌శ‌లో అల్లు శిరీష్ సినిమా రావ‌డం రిస్కే అనుకోవాలి. కాక‌పోతే ఈ 17 దాటితే మళ్లీ బాక్సాఫీసు బిజీ అయిపోతుంది. చావో, రేవో ఇప్పుడే తేల్చేసుకోవాలి. కామెడీ సీన్లు వ‌ర్క‌వుట్ అవ్వ‌డం, ల‌వ్ ట్రాక్‌లు బాగా రావ‌డం, ఒక‌ట్రెండు పాట‌లు విడుద‌ల‌కు ముందే పాపుల‌ర్ అవ్వ‌డం.. `ఏ బీ సీ డీ`కి క‌ల‌సిరావొచ్చు. మొత్తానికి అల్లు శిరీష్‌కి ఇది టెస్టింగ్ టైమ్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close