వైసీపీతో బీజేపీ నేతల సంప్రదింపులు..! మరి కేసీఆర్..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి… జాతీయ రాజకీయాల్లో ఇప్పటి వరకూ నిమిత్తమాత్రుడు. ఆయనకు సీట్లు వస్తాయని ఎవరూ అనుకోలేదేమో కనీ.. ఆయనతో టచ్‌లోకి రావాలని .. ఎవరూ అనుకోలేదు. ఒక్క టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రమే… ఆయనతో టచ్‌లోకి వెళ్లారు. జగన్ అడిగిన సాయమల్లా చేశారు, కేసీఆర్ చేసిన సాయానికి కృతజ్ఞతగా.. కేసీఆర్‌తో కలిస్తే తప్పేమిటని.. జగన్ కూడా బహిరంగంగానే వ్యాఖ్యానించారు. దాంతో… బాండింగ్ కుదిరినట్లయింది.

విజయసాయి దగ్గర మాట తీసుకున్న బీజేపీ..!

అయితే.. ఇప్పుడు పోలింగ్ మారింది. కౌంటింగ్ దగ్గర పడింది. అలాగే రాజకీయాలు కూడా మారిపోయాయి. భారతీయ జనతా పార్టీ… .. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చలు ప్రారంభించింది. ఈ మేరకు.. కొంత మంది బీజేపీ అగ్రనేతలు విజయసాయిరెడ్డితో మాట్లాడారని చెబుతున్నారు. నిజానికి విజయసాయిరెడ్డి.. బీజేపీకి చాలా… అంటే చాలా దగ్గరగా ఉంటున్నారు. ఎంతగా ్ంటే.. ఆయన ఫలానా వారిపై విచారణ చేయాలని లేఖ రాస్తే.. పీఎంవో.. గంటల్లోనే స్పందిస్తుంది. అంత పలుకుబడి విజయసాయిరెడ్డికి.. పీఎంవో ఇచ్చింది. మరి అలాంటప్పుడు.. తమతో రాకుండా ఎలా ఉంటారని బీజేపీ అనుకుంటోంది. వైసీపీ ఆలోచన కూడా మొదటి నుంచి అదే. కానీ కొన్ని రిజర్వేషన్లు వైసీపీకి ఉన్నాయి.

టీఆర్ఎస్‌కు వైసీపీ దూరం అవుతున్నట్లే..!

కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌లో… నమ్మకంగా ఇప్పటికి ఉంటారని భావిస్తున్న ఒకే ఒక్క నేత.. పార్టీ వైసీపీనే. అలాంటిది.. ఒక్క సారిగా.. బీజేపీ నేరుగా.. జగన్ తో టచ్‌లోకి వెళ్లడం.. కేసీఆర్ శిబిరాన్ని కలవర పరుస్తోంది. ఆ ఒక్క నేత కూడా దూరం అయితే.. టీఆర్ఎస్‌కు రాజకీయంగా విలువ లేకుండా పోతుంది. ఎందుకంటే.. ఇప్పటి వరకూ కేసీఆర్ ఎక్కడకు వెళ్లినా.. టీఆర్ఎస్‌కు… వైసీపీ కలిసి వచ్చే సీట్ల గురించే చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 42 సీట్లలో కనీసం 30 తమ ఖాతాలో ఉంటాయని చెప్పుకొస్తున్నారు. ఇలాంటి సమయంలో… వైసీపీ విడి అయిపోయే.. తన ప్రాబల్యం మరింత తగ్గిపోతుందని.. కేసీఆర్ ఆందోళన కావొచ్చు. కానీ.. జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ కన్నా బీజేపీనే ముఖ్యం మరి..!

ఎవరు కేంద్రంలో అధికారంలో ఉంటే వారికి మద్దతివ్వక తప్పని పరిస్థితి వైసీపీది..!

జాతీయ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఒకే ఒక్క ఆసక్తి ప్రత్యేకహోదా. అది ఏపీకి ప్రత్యేకహోదా కాదు. తనకు కేసుల్లేని హోదా. అందుకు ఆయన తప్పని సరిగా.. కేంద్రంలో అధికారంలోకి వ్చచే పార్టీకి మద్దతు ప్రకటించాలి. లేదంటే.. ఆయన జైలుకెళ్లిపోతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. రేపు కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమో… కాంగ్రెస్ మద్దతుతో.. ప్రాంతీయ పార్టీల కూటమో అధికారంలోకి వస్తే… జగన్ ఆ పార్టీ లేదా కూటమి వైపు వెళ్లక తప్పదు. అందులో టీడీపీ కీలకంగా ఉన్నా సరే తప్పదు. ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ.. ఆ పార్టీకి నేరుగా మద్దతు ప్రకటించినట్లుగానే.. రాజకీయం చేయక తప్పదు. ఇది కూడా.. కేసీఆర్ కు ఇబ్బంది కలిగించేదే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close