వార్నీ తలసాని ..! మంత్రి పదవి కోసమా ఈ ఫీట్లు..!

తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహారం.. టీఆర్ఎస్ లో కలకలం రేపుతోంది. మంత్రి పదవి పొందడానికి.. ఆయన చేస్తున్న విన్యాసాలు… ఆ పార్టీ సీనియర్ నేతల్లోనే ఆశ్చర్యం కలిగిస్తున్నారు. కేసీఆర్ ఏ ఉద్దేశంతో మంత్రి వర్గ విస్తరణ నిలిపివేశారో కానీ.. ఈ కాలంలో.. తన బెర్త్ ను ఖరారు చేసుకోవడం కోసం తలసాని.. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలేవీ లేవు కాబట్టి.. కేసీఆర్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టి.. ఏదో చేయాలనుకుంటున్నారు కాబట్టి.. ఆ ప్రకారం… తన వంతు సాయం చేసి.. కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేయాలని తెగ తాపత్రయ పడుతున్నారు. అందులో భాగంగానే… ప్లాన్డ్ గా లీక్డ్ వీడియోలు విడుదల చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుకు వ్యతిరేకంగా… తాను.. యాదవ సామాజికవర్గాన్ని ఏకం చేయబోతున్నట్లు చెప్పుకుంటున్న వీడియోలు.. చాటు నుంచి తీసినట్లుగా తీసి విడుదల చేయించుకుంటున్నారు. వాటిని మీడియాలో ప్రసారం చేసుకుని.. కేసీఆర్ దృష్టిలో పడేలా చేసుకుంటున్నారు. నిజానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు.. ఏపీకి… వచ్చి యాదవ సామాజికవర్గాన్ని ఏకం చేసేంత సీన్ ఉందా..? ఉమ్మడి రాష్ట్రంలోనే.. ఆయన కంటే.. పెద్ద పెద్ద యాదవ నేతలు.. తెలుగుదేశంలో చక్రం తిప్పారు. అంత ఎందకు.. టీడీపీ ఇప్పుడు నెంబర్ టూ.. యనమల రామకృష్ణుడు కన్నా.. ఎక్కువగా.. ఏపీ తలసాని నాయకత్వాన్ని వారు కోరుకుంటారా..?. అసలు తలసాని పండుగ సంబరాలకు వస్తే… రానిస్తారు కానీ… వచ్చి రాజకీయం చేస్తానంటే.. ఎవరైనా పోలొమని వస్తారా..? పోనీ.. వైసీపీ నేతలు … లోపాయికారీ సహకారం అందించారనే అనుకుందాం.. అది వారి ప్లస్ అవుతుందా..? మైనస్ అవుతుందా..? రేపు ఏపీలో.. తలసానితో పాటు తిరిగి.. సమస్యలు వస్తే… ఆయన పరిష్కరిస్తారా..? ఏపీలో నేతలా..?

కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అని చెప్పారు కాబట్టి.. తన ద్వారా.. ఆ రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు కు అందబోతోందని చెప్పుకోవడానికి.. తద్వారా మంత్రి పదవి రేసులో ఉండటానికి.. తనకు మంత్రి పదవి ఇస్తే.. మరింత చురుగ్గా.. ఏపీలో యాదవులను.. ఐక్యం చేస్తానని చెప్పుకోవడానికి.. తలసాని.. చాలా ఫీట్లు చేస్తున్నారు. ఆయన ఇంతగా కష్టపడటానికి కారణం.. ఈ సారి కేసీఆర్ మంత్రి పదవులు చాలా పరిమితంగా ఇస్తున్నారు. ఆయన తనకు అత్యంత నమ్మకస్తులైన వారికే ఇస్తున్నారు. ఆ నమ్మకస్తుల జాబితాలో.. .. తలసాని లేరు. అదే ఆయన టెన్షన్. ఏలాగోలా విస్తరణ జరిపేలోపు… ఆ నమ్మకస్తుల జాబితాలో పేరు జమ చేసుకోవాలని ఆయన తాపత్రయం. అందుకే.. వీడియోలు లీకులు చేసుకుంటూ.. ఏపీ యాదవుల్ని తెలంగాణలో తన పదవి కోసం పక్కాగా వాడుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘గైడ్‌లైన్స్’ రూపొందించుకున్న టాలీవుడ్

చిత్ర‌సీమ యావ‌త్తూ 'క్లాప్' కొట్టే ముహూర్తం కోసం ఎదురు చూస్తోంది. మ‌ళ్లీ సెట్లు క‌ళ‌క‌ళ‌లాడే రోజు కోసం క‌ల‌లు కంటోంది. జూన్‌లో చిత్రీక‌ర‌ణ‌లు మొద‌ల‌వుతాయి. అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే గైడ్ లైన్స్‌కి...

త్రివిక్ర‌మ్‌కి రీమేకులు వ‌ర్క‌వుట్ అవుతాయా?

స్వ‌త‌హాగా ర‌చ‌యిత‌లైన ద‌ర్శ‌కులు రీమేక్‌ల‌ను అంత‌గా ప్రోత్స‌హించ‌రు. కార‌ణం.. వాళ్ల ద‌గ్గ‌రే బోలెడ‌న్ని క‌థ‌లుంటాయి. త్రివిక్ర‌మ్ ఇప్ప‌టి వ‌ర‌కూ రీమేక్ జోలికి వెళ్ల‌లేదు. హాలీవుడ్ క‌థ‌ల్ని, న‌వ‌ల‌ల్ని, పాత సినిమాల్నీ స్ఫూర్తిగా తీసుకుని...

కరోనా టెస్టుల లెక్కలు తేల్చాల్సిందేనన్న తెలంగాణ హైకోర్టు ..!

కరోనా వైరస్ టెస్టులు పెద్దగా చేయకపోవడం.. తెలంగాణ సర్కార్ ను ఇబ్బందుల్లోకి నెడుతోంది. టెస్టుల విషయంలో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కొద్ది రోజుల కిందట..కరోనా...

రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువ.. ఈ సారి డిప్యూటీ సీఎం..!

నగరి ఎమ్మెల్యే రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువైపోతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై రోజా ఫైరయ్యారు. నారాయణస్వామి పుత్తూరులో పర్యటించారు. కానీ రోజాకు సమాచారం అందలేదు. పుత్తూరు .. ఆమె ఎమ్మెల్యేగా...

HOT NEWS

[X] Close
[X] Close