పర్చూరు వైసీపీ అభ్యర్థిగా పురందేశ్వరి కుమారుడు ఖాయమేనా..?

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వచ్చిన సంక్రాంతి వేడుకలు.. రాజకీయాల్లో కూడా కొంత క్లారిటీ తీసుకు వస్తోంది. బీజేపీలో ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి కుమారుడు… హితేష్ చెంచురామ్… ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి.. వైసీపీ అభ్యర్థిగా మారడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. పర్చూరు నియోజకవర్గంలో ఈ మేరకు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. నిజానికి ఈ ఫ్లెక్సీలే మొదటివి కాదు.. చాలా రోజుల నుంచి ఈ ప్రచారం జరుగుతోంది. దగ్గుబాటి దంపతుల్ని పార్టీలోకి తీసుకు వచ్చేందుకు.. విజయసాయిరెడ్డి చాలా తీవ్రమైన ప్రయత్నాలే చేస్తున్నారు. పదే పదే .. దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో భేటీ అయి… పర్చూరు టిక్కెట్ ఆఫర్ చేస్తున్నారు.

రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పటి వరకూ కాంగ్రెస్ లో కేంద్రమంత్రిగా ఉన్న… పురంధేశ్వరి బీజేపీలో చేరారు. కానీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాత్రం తాను రాజకీయాలను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు సైలెంట్ గా ఉన్నారు. ఇటీవలి కాలంలో.. మళ్లీ ప్రెస్ మీట్లు పెట్టి.. టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. జగన్ కు అనుకూలంగా విశ్లేషణలు చేస్తున్నారు ఇదంతా కుమారుడి రాజకీయ ఆరంగేట్రం కోసమేనని ప్రచారం జరుగుతోంది. ఇటీవలి కాలంలో పర్చూరులోని తన పాత క్యాడర్ ను … సమీకరించుకునేందుకు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అదే పనిగా ప్రయత్నాలు చేస్తున్నారు. కుమారుని కోసమేనని సన్నిహితులకు చెబుతున్నారు. పర్చూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థి లేరు. ఇప్పటికే ముగ్గుర్ని మార్చారు. ఎవరూ ప్రజల్లో సరైన పలుకుబడి సాధించలేకపోయారు. గొట్టిపాటి కుటుంబీకులు కూడా టీడీపీలో చేరడంతో పర్చూరులో టీడీపీ బలం పుంజుకుంది. ఈ కారణంగా..జగన్ కూడా… దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడైతేనే సరైన అభ్యర్థిగా అంచనా వేసుకుని పదే పదే విజయసాయిరెడ్డిని రాయాబారానికి పంపుతున్నట్లు తెలుస్తోంది.

దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా… వైసీపీలో చేరిక ప్రచారాన్ని ఖండించడం లేదు. సమయం వచ్చినప్పుడు అన్నీ చెబుతానని అంటున్నారు. అయితే పార్టీలో చేరితే మాత్రం.. పురంధేశ్వరి దూరంగానే ఉంటారంటున్నారు. ఆమె బీజేపీలోనే కొనసాగే అవకాశం ఉంది. బీజేపీ కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వస్తే ఏదో ఓ పదవి వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. అందుకే బీజేపీని వీడకపోవచ్చంటున్నారు. మొత్తానికి దగ్గుబాటి దంపతులు చేరో పార్టీలో ఉండటం ఖాయమని తాజా పరిణామాలతో స్పష్టమవుతంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘గైడ్‌లైన్స్’ రూపొందించుకున్న టాలీవుడ్

చిత్ర‌సీమ యావ‌త్తూ 'క్లాప్' కొట్టే ముహూర్తం కోసం ఎదురు చూస్తోంది. మ‌ళ్లీ సెట్లు క‌ళ‌క‌ళ‌లాడే రోజు కోసం క‌ల‌లు కంటోంది. జూన్‌లో చిత్రీక‌ర‌ణ‌లు మొద‌ల‌వుతాయి. అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే గైడ్ లైన్స్‌కి...

త్రివిక్ర‌మ్‌కి రీమేకులు వ‌ర్క‌వుట్ అవుతాయా?

స్వ‌త‌హాగా ర‌చ‌యిత‌లైన ద‌ర్శ‌కులు రీమేక్‌ల‌ను అంత‌గా ప్రోత్స‌హించ‌రు. కార‌ణం.. వాళ్ల ద‌గ్గ‌రే బోలెడ‌న్ని క‌థ‌లుంటాయి. త్రివిక్ర‌మ్ ఇప్ప‌టి వ‌ర‌కూ రీమేక్ జోలికి వెళ్ల‌లేదు. హాలీవుడ్ క‌థ‌ల్ని, న‌వ‌ల‌ల్ని, పాత సినిమాల్నీ స్ఫూర్తిగా తీసుకుని...

కరోనా టెస్టుల లెక్కలు తేల్చాల్సిందేనన్న తెలంగాణ హైకోర్టు ..!

కరోనా వైరస్ టెస్టులు పెద్దగా చేయకపోవడం.. తెలంగాణ సర్కార్ ను ఇబ్బందుల్లోకి నెడుతోంది. టెస్టుల విషయంలో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కొద్ది రోజుల కిందట..కరోనా...

రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువ.. ఈ సారి డిప్యూటీ సీఎం..!

నగరి ఎమ్మెల్యే రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువైపోతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై రోజా ఫైరయ్యారు. నారాయణస్వామి పుత్తూరులో పర్యటించారు. కానీ రోజాకు సమాచారం అందలేదు. పుత్తూరు .. ఆమె ఎమ్మెల్యేగా...

HOT NEWS

[X] Close
[X] Close