బీజేపీ – వైసీపీ మరింత దగ్గర చేస్తున్న కోడికత్తి..!

వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలు.. కోడికత్తి కేసులో సేమ్ టు సేమ్ వాదన వినిపించడం ప్రారంభించాయి. కేసు ఎన్ఐఏ చేతికి వెళ్లడంతో.. ఆ రెండు పార్టీల నేతలు… టీడీపీ టార్గెట్ గా ఢిల్లీ నుంచి గల్లీ వరకూ ఒకే వాదన వినిపించడం ప్రారంభించారు. నేరుగా కోడికత్తి కేసుతో చంద్రబాబుకు ప్రమేయం ఉందని… అందుకే… ఎన్ఐఏ కేసు విచారణను వ్యతిరేకిస్తున్నారంటూ… చెప్పుకొస్తున్నారు. ఢిల్లీలో ఈ అంశంపైనే ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టిన .. బీజేపీ ఏపీ అగ్రనేతలు అనదగ్గ.. కన్నా, జీవీఎల్ సహా ఇతర నేతలు… ఇదే అంశాన్ని చెప్పుకొచ్చారు. అదేదో కోడికత్తిని చంద్రబాబు… నిందితుడికి ఇచ్చినట్లుగా… వారు తీర్మానించేశారు. కచ్చితంగా ఇది వైసీపీ చేస్తున్న వాదనకు వంద కు వంద శాతం సూటవుతుంది.

ఇక.. ఏపీలో వైసీపీ నేతలు.. ఈ విషయంలో చాలా రోజుల నుంచి అదే వాదన వినిపిస్తున్నారు. తమదైన కథ ను.. సాక్షి పత్రిక వేదికగా… ప్రచారం చేస్తున్నారు. ఏపి పోలీసుల తీరుపై నమ్మకం లేదని చెబుతూ.. కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ కావాలనే డిమాండ్ వినిపించారు. కోర్టు ఆదేశిస్తుందో లేదో తెలియని పరిస్థితుల్లో ముందుగానే… కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. ఎన్ ఐ ఏ తో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. వైసీపీ కోరికను కేంద్రహోంమంత్రిత్వ శాఖ అలా తీర్చింది. వైసీపీకి కావాల్సింది ఇదే కాబట్టి… ఆ పార్టీ తన మీడియా ద్వారా వీలైనంతగా… ఈ కేసులో టీడీపీకి కలిపేయడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. పదే పదే కథనాలు ప్రచురిస్తోంది. ఎన్ ఐ ఏ ఎలా విచారణ చేయాలో కూడా పత్రికా ముఖంగా సూచనలు చేసింది.

మొత్తానికి ఇంత కాలం.. రెండు పార్టీల మధ్య అంతర్గతంగా ఉన్న సంబంధాలు.. కోడికత్తి కేసుతో… బహిరంగం అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేయగలికిన స్థాయిలో ఉన్న బీజేపీ… అదే కోరుకుంటున్న వైసీపీ పట్టు బట్టి కూడబలుక్కుని ఒకే తరహా ఆరోపణలు చేస్తున్నాయి. ఇది రాజకీయంగా వారిని మరింత దగ్గర చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ దగ్గరి తనం ఎక్కడి వరకూ వెళ్తుందో… అది లోపాయికారీగానో ఉంటుందో… మరో నెలలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బాల‌కృష్ణ‌తో నాకు శ‌త్రుత్వం లేదు: నాగ‌బాబు

టాలీవుడ్ Vs నంద‌మూరి బాల‌కృష్ణ కాస్తా.. నాగ‌బాబు Vs బాల‌కృష్ణ‌గా మారింది. బాల‌య్య బాబు నోరు జార‌డం ఏమో గానీ.. వెంట‌నే వాటిపై ఘాటు వ్యాఖ్య‌లు చేస్తూ.. కామెంట్లు...

టాలీవుడ్‌లో బాలకృష్ణ మాటల మంటలు..!

షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభించాలన్నదానిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో చిరంజీవి నేతృత్వంలో బృందం సమావేశం కావడంపై.. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభించాలా టాలీవుడ్ పెద్దలు..తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు...

కేంద్రం ఏపీపై ఆధారపడినప్పుడు ప్రత్యేక హోదా : జగన్

అప్పు రేపు.. తరహాలో ప్రత్యేకహోదా రేపు అంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా గతంలో ఆయన "హోదా యోధ"గా స్వయం ప్రకటితంగా చేసుకున్న పోరాటం ఏమయిందని.. ప్రజలు...

శ్రీవారి ఆస్తులు అమ్మేదిలేదని టీటీడీ బోర్డు తీర్మానం..!

శ్రీవారికి భక్తులు కానుకగా ఇచ్చిన వాటిని అమ్మే ప్రసక్తే లేదని... తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు పాలకమండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి ఆస్తుల అమ్మకాన్ని పూర్తిగా...

HOT NEWS

[X] Close
[X] Close