”థ్యాంక్ యూ” టీజర్.. చైతు ప్రయాణం

నాగచైతన్య- విక్రమ్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం థ్యాంక్ యూ. ఈ సినిమా టీజర్ బయటికి వచ్చింది. ‘నా విజయానికి నేనొక్కడినే కారణం’ అనే హీరో డైలాగ్ తో ఓపెన్ అయన టీజర్ ఆ వెంటనే ‘నీకు తప్పా నీ లైఫ్ లో మరొకరి చోటు లేదు” అనే హీరోయిన్ డైలాగ్ తో కథ ఒక్కసారిగా వివిధ దశల్లోకి వెళ్ళింది. టీజర్ లో నాగచైతన్య చాలా లుక్స్ లో కనిపించడం ఆకట్టుకుంది.

హీరో జీవితంలో దాదాపు నలుగురు అమ్మాయిలు వున్నారు. వారందరితో హీరోగా కి వున్న అనుబంధం ఏమిటి ? హీరో ప్రయాణం ఎలా సాగింది ? అనేది ఈ సినిమాలో కీలకం అవుతుందని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. విక్రమ్ కుమార్ సినిమా అంటేనే స్క్రీన్ ప్లేయ్ మ్యాజిక్. థ్యాంక్ యూ లో కూడా ఆ మ్యాజిక్ కనిపించింది. చైతుని ఒక సక్సెస్ ఫుల్ పర్శన్ గా చూపించి వెంటనే వివిధ దశల్లో అతని జీవితాన్ని చిత్రీకరించడం ఆసక్తికరంగా వుంది. టీజర్ లో రాశి ఖన్నా ,మాళవిక నాయర్, అవిక గొర్ ని చూపించారు. ‘నన్ను నేను సరి చేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయాణమే’ అనే డైలాగ్ తో టీజర్ ని ముగించడం కూడా బావుంది. జులైలో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.