ఆకలి తీర్చుకోవాలనుకున్నా డబుల్ జీఎస్టీ !

కేంద్ర ప్రభుత్వం స్విగ్గి, జొమాటోలపైనా జీఎస్టీ వడ్డించింది. అవి కేవలం ఫుడ్ అగ్రిగ్రేటర్ యాప్‌లు. అయితే వాటిని కూడా రెస్టారెంట్లుగా పరిగణించి, వాటి ద్వారా చేసిన సరఫరాలపై 5 శాతం జీఎస్‌టీ పన్ను విధించింది. అంటే ఇక నుంచి స్విగ్గి, జొమాటాల్లో ఏమైనా కొంటే రెస్టారెంట్ ఓ జీఎస్టీ వేస్తుంది. స్విగ్గి, జొమాటోలు మరో జీఎస్టీ వేస్తారు. అంటే ఒక్క ఫుడ్ కోసం రెండు సార్లు కస్టమర్ జీఎస్టీ కట్టాలన్నమాట. అంటే పన్ను మీద పన్ను వేసి ఆన్ లైన్‌లో ఫుడ్ కొనుక్కోవాలనుకునేవారి దగ్గర్నుంచి పన్నులు పిండుకునే ప్లాన్ అన్నమాట.

జొమాటోకు అయినా స్విగ్గికి అయినా భౌతికంగా ఒక్కటంటే ఒక్క రెస్టారెంట్ లేదు. వారు ఎప్పుడూ సొంతంగా పుడ్ తయారు చేయరు. రెస్టారెంట్ల తరపున ఆర్డర్లు తీసుకుని తమ సొంత డెలివరీ బాయ్‌లతో డెలివరీ చేస్తారు. ఫలానా రెస్టారెంట్ ఫుడ్ కావాలని బుక్ చేసుకుంటే ఆ బిల్లులో ఆ రెస్టారెంట్ కూడా జీఎస్టీ వేసి బిల్లు వసూలు చేస్తుంది. ఇప్పుడు ఆ బిల్లుపై ఐదు శాతం జొమాటో లేదా స్విగ్గు టాక్స్ వసూలు చేసి కేంద్రానికి చెల్లిస్తుంది. ఇప్పుడు ఆ టాక్స్ శాతం పదకొండు దాటిపోతుంది.

సాధారణంగా ప్రజలు ఏదైనా ఓ వస్తువు కొంటే దాని మీద ఎన్ని రకాల పన్నులు చెల్లిస్తారో వారికి అవగాహన ఉండదు. ఒక్క జీఎస్టీ మాత్రమే కడతారు అని అనుకుంటారు. కానీ ఆ వస్తువు ఉత్పత్తికి అవసరమైన ప్రతి ముడి సరుకుపై పన్నుఉంటుంది.తయారీ దారు పన్ను కట్టాలి. ప్రాసెసింగ్ వస్తువులపైనా పన్ను ఉంటుంది. చివరికి అమ్మకానికి జీఎస్టీ వేస్తారు. ఇప్పుడు ఆన్ లైన్ యాప్‌లను కూడా రెస్టారెంట్లుగా మార్చడం వల్ల మరింతగా పన్ను వసూలు చేస్తారు. పన్ను స్వామ్యం అంటే ఇదేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close