ప‌లాస ద‌ర్శ‌కుడి ‘బ్రాకెట్‌’

‘ప‌లాస‌’ సినిమాతో ఆక‌ట్టుకున్నాడు క‌రుణ కుమార్‌. ఆ సినిమానే త‌న‌కు గంపెడు అవ‌కాశాల్ని తీసుకొచ్చింది. `శ్రీ‌దేవి సోడా సెంట‌ర్‌` నిరాశ ప‌రిచినా అవ‌కాశాలు వ‌స్తూనే ఉన్నాయి. గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా చేస్తున్నాడు క‌రుణ‌. మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యం సాధించిన `నాయ‌ట్టు`కి ఇది రీమేక్‌. రావు ర‌మేష్‌, అంజ‌లి కీల‌క పాత్ర‌లు పోషి్తున్నారు. ఇప్పుడు మ‌రో క‌థ కూడా రెడీ చేసేసుకున్నాడ‌ట‌. ఈ క‌థ‌కి `బ్రాకెట్` అనే పేరు పెట్టుకున్నాడు. చాలా కాలం క్రితం బ్రాకెట్ అనే ఓ ఆట ఉండేది. లాట‌రీ టైపు. ఈ జూదంలో ల‌క్ష‌లు ల‌క్ష‌లు పోగొట్టుకున్న‌వాళ్లెంతోమంది. దాన్ని ప్ర‌భుత్వం బ్యాన్ చేసింది. ఈ ఆట నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. ఈ సినిమాని పూర్తిగా కొత్త‌వాళ్ల‌తో తెర‌కెక్కించాల‌న్న‌ది క‌రుణ‌కుమార్ ప్ర‌య‌త్నం. గీతా ఆర్ట్స్ లో చేస్తున్న సినిమా అయిపోగానే `బ్రాకెట్‌`ని సెట్స్‌పై తీసుకెళ్తాడ‌ట‌. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డబ్బులివ్వలేదని ధర్నాలు చేస్తున్న హుజురాబాద్ ఓటర్లు !

భారత ప్రజాస్వామ్య పతనం అత్యంత కీలక దశకు చేరుకున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఓటర్లు తమకు రాజకీయ పార్టీలు డబ్బులివ్వలేదని ధర్నాకు దిగుతున్నారు. హుజురాబాద్‌లో అడుగడుగునా ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఏదో ఒక...

త్రివిక్రమ్ రాసిన సీన్ లో నేను నటించడం మర్చిపోలేను: నాగశౌర్యతో ఇంటర్వ్యూ

నాగశౌర్యకి యూత్ లో మంచి ఫాలోయింగ్ వుంది. యూత్ ఫుల్ కథలు ఎంచుకుంటూ తనకంటూ ఒక మార్క్ సంపాదించుకున్నాడు శౌర్య. ఇప్పుడు శౌర్య నుంచి మరో యూత్ ఫుల్ ఫ్యామిలీ డ్రామా వస్తుంది....
video

‘పుష్ప’లో రంగమ్మ మంగమ్మ మ్యాజిక్

https://www.youtube.com/watch?v=C70GJYVoZ4Y ''రంగస్థలం' లాంటి క్లాసిక్ తర్వాత సుకుమార్ చాలా గ్యాప్ తీసుకున్నారు. అల్లు అర్జున్ డేట్స్ దొరికేవరకూ వేరే ప్రాజెక్ట్ ముట్టుకోలేదు. చాలా హార్డ్ అండ్ గ్రౌండ్ వర్క్ చేసి ‘పుష్ప' ని సెట్స్...

బీ టౌన్ టాక్ : అల్లు అర్జున్ రాక్ స్టార్

అల్లు అర్జున్ పేరు బాలీవుడ్ న్యూస్ లో హాట్ టాపిక్ అయ్యింది. నిర్మాత కరణ్ జోహార్ అల్లు అర్జున్ ని రాక్ స్టార్ గా పిలిచారు. బుధవారం జరిగిన 'వరుడు కావలెను' ప్రీ...

HOT NEWS

[X] Close
[X] Close