కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి అరవై ఏళ్ల వరకూ నిరాటంకంగా పరిపాలించింది. ఆ తర్వాత ప్రజలు విరక్తి చెందినా సరైన ప్రత్యామ్నాయం లేక మళ్లీ మళ్లీ ఆ పార్టీని గెలిపిస్తూ వచ్చారు.కానీ ఇప్పుడు ప్రత్యమ్నాయాలు కనిపించడం ప్రారంభించిన తర్వాత ఆ పార్టీకి ఓటు వేసేందుకు.. గెలిపించేందుకు అసలు ఆసక్తి చూపించడం లేదు. గత పది, పదిహేనేళ్లుగా ఆ పార్టీ దురవస్థ, పతనం ఊహించని విధంగా ఉంది. సమర్థవంతమైన నాయకత్వం కూడా లేకపోవడంతో ఎప్పటికప్పుడు ఆ పార్టీ కుంచించుకుపోతోంది. తానే కాదు.. తననే నమ్ముకున్న మిత్రపక్షాలను కూడా అథంపాతాళానికి పడేస్తోంది. అందుకే ఇప్పుడు ఆ పార్టీని గౌరవంగా మూసేస్తే మంచిదన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.
కాంగ్రెస్ ను ఏర్పాటు చేసిన ఉద్దేశం రాజకీయం కాదు!
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ను స్థాపించింది భారతీయులు కాదు. భారతీయుల రాజకీయ హక్కుల కోసం ఒక వేదిక సృష్టించడం కోసం విదేశీయుుడు హ్యూమ్ దీన్ని ఏర్పాటు చేశారు. భారతీయులు తమ సమస్యలను బ్రిటిష్ ప్రభుత్వానికి సాధారణంగా, ఏకీకృతంగా తెలియజేయడానికి ఒక సంస్థ అవసరమని ఏర్పాటు చేశారు. రాజకీయాల కోసం కాదు. బ్రిటన్ పాలనలో బ్రిటిష్ ప్రభుత్వంపై భారతీయులలో పెరుగుతున్న అసంతృప్తిని నియంత్రించేందుకు ఒక “సురక్షిత వాల్వ్”గా కాంగ్రెస్‌ను ఉపయోగించుకోవాలని హ్యూమ్ భావించాడు. 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్‌వారు మరో తిరుగుబాటును నివారించాలని కాంగ్రెస్ ఏర్పాటు ద్వారా ప్రయత్నించారు.
స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్‌ను రద్దు చేయాలని గాంధీ సూచన
“కాంగ్రెస్ తన లక్ష్యాన్ని సాధించింది. ఇప్పుడు ఇది రాజకీయ పార్టీగా కొనసాగడం అనవసరం. దీనిని రద్దు చేసి, దేశ సేవ కోసం ఒక కొత్త సంస్థ ఏర్పాటు చేయాలి.” అని మహాత్మాగాంధీ హత్యకు గురయ్యే ముందు రోజు అన్నారు. కానీ ఆయన హత్యకు గురైన తర్వాత కాంగ్రెస్ పార్టీని రాజకీయాలకు వాడుకున్నారు. స్వాతంత్ర్య పోరాటం అనే కాన్సెప్ట్ తో వారసత్వంగా ఓ కుటుంబం రాజకీయ పదవులు పొందుతూ వచ్చింది. కానీ పార్టీ మాత్రం రద్దు కాలేదు. మధ్యలో ఆ కుటుంబానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు వస్తే అసలు కాంగ్రెస్ ను కాదని.. కాంగ్రెస్ ఐని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆ పార్టీ వారి కుటుంబ వారసత్వంలోనే ఉంది. కానీ రాను రాను కరిగిపోతోంది.
కాంగ్రెస్‌ను పూర్తిగా మర్చిపోతున్న జనం
కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఇప్పుడు ఎలాంటి అభిమానం లేదు. దానికి సాక్ష్యం ఎన్నికల ఫలితాలే. ప్రస్తుతం మూడు అంటే మూడు రాష్ట్రాల్లో మాత్రమే ఆ పార్టీ అధికారంలో ఉంది. మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఆయా రాష్ట్రాల్లో మళ్లీ గెలుస్తుందో లేదో చెప్పడం కూడా కష్టమే. కొత్తగా గెలిచే రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అదీ లేదు. గట్టిగా వంద సీట్లలో ముఖాముఖి పోటీ ఇచ్చే పరిస్థితుల్లో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ముందు ఉన్న పరిష్కారం ఒక్కటే. ఆ పార్టీని క్లోజ్ చేసి.. ప్రత్యామ్నాయంగా మరో పార్టీ ఎదిగేందుకు అవకాశం కల్పించడం. మహాత్మాగాంధీ.. సూచనలను పాటించి.. ఈ పని చేస్తే.. కాంగ్రెస్ గతంలో చేసిన సేవలను అయినా రాబోయే రోజుల్లో ప్రజలు గౌరవిస్తారు. లేకపోతే.. చరిత్రలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి వస్తుంది.


