ఇన్ సైడ్ టాక్‌:  హీరోయిన్ కోసం.. ద‌ర్శ‌కుడు నిర్మాత గొడ‌వ

న‌టీన‌టుల ఎంపిక‌పై ద‌ర్శ‌కుడు, నిర్మాత త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డ‌డం తెర వెనుక మామూలే. ద‌ర్శ‌కుడికి కొన్ని ఆబ్లికేష‌న్స్ ఉంటాయి. నిర్మాత‌కీ అంతే. అయితే అంతిమంగా ఇద్ద‌రూ కంబైన్డ్‌గా ఓ నిర్ణ‌యానికి రావాల్సిందే. అయితే.. ఈమ‌ధ్య ఓ సినిమా మొద‌లైపోయింది. అందులో ఓ హీరోయిన్‌ని నిర్మాత కావాల‌ని ఓకే చేశాడు. ఆ హీరోయిన్ విష‌యంలో ఇప్పుడు ద‌ర్శ‌కుడు, నిర్మాతా గొడ‌వ ప‌డుతున్న‌ట్టు ఇండ్ర‌స్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

తొలి సినిమా ఇంకా విడుద‌ల కాక మునుపే.. మ‌రో మంచి సినిమాని త‌న ఖాతాలో వేసుకుంది ఓ కుర్ర హీరోయిన్‌. అయితే స‌ద‌రు సినిమాలో ఆమెకు నిర్మాత ఆబ్లికేష‌న్ మీద ఎంట్రీ ల‌భించింది. ద‌ర్శ‌కుడు మాత్రం `నా సినిమాలో క‌థానాయిక పాత్ర‌కు.. త‌ను ఏమాత్రం స‌రిపోదు.. కావాలంటే మ‌రో హీరోయిన్ ని పెట్టుకుందాం` అని నిర్మాత‌ని అభ్య‌ర్థించాడ‌ట‌. కానీ… స‌ద‌రు నిర్మాత మాత్రం.. `అది కుద‌ర‌ని ప‌ని.. కావాలంటే.. క‌థ ఇచ్చేసి నువ్వే ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకో` అనేశాడ‌ట‌. ఓ హీరోయిన్ కోసం ద‌ర్శ‌కుడినే మార్చేద్దామ‌నుకున్నాడో నిర్మాత‌. దాన్ని బ‌ట్టి, ఆ ప్రొడ్యూస‌ర్ ఎంత స్ట్రాంగ్ గా నిర్ణ‌యం తీసుకున్నాడో అర్థం అవుతోంది. గ‌త్యంత‌రం లేక‌.. నిర్మాత ఎంపిక చేసిన హీరోయిన్ తోనే.. షూటింగ్ మొద‌లెడుతున్నారిప్పుడు. మున్ముందు ఈ హీరోయిన్ ఇంకెన్ని గొడ‌వ‌ల‌కు సూత్ర‌ధారి అవుతుందో మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ మంచోడంటున్న నాగబాబు..!

విక్రమార్కుడు సినిమాలో  ఓ సీన్ ఉంటుంది. ఓ పోలీస్ అధికారి భార్యను ఆ ఊరిలో అధికారం చెలాయించే పెద్ద మనిషి కొడుకు ఎత్తుకొచ్చి శారీరక కోరికలు తీర్చుకుంటూ ఉంటాడు.  తన భార్య అక్కడే...

ఇక బీజేపీకి పవన్ ప్రచారం లేనట్టే..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండో విడత ప్రచారానికి వస్తారని ఆశలు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ నేతలకు క్వారంటైన్ షాక్ తగిలింది. తన వ్యక్తిగత, భద్రతా సిబ్బందికి కరోనా సోకినట్లుగా తేలడంతో...

ఆ వీడియో చూపించారని దేవినేని ఉమపై కేసు..!

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతలపై కేసులు పెట్టడం సహజమే. ముఖ్యంగా సీఐడీ పోలీసులు ఆ విషయంలో చాలా ముందు ఉంటారు. ఎవరో చెబుతున్నట్లుగా చిత్ర విచిత్రమైన కేసులు పెడుతూ ఉంటారు. తాజాగా మాజీ మంత్రి...

జగన్ నిర్ణయాలను తానే తీసుకుంటున్న పెద్దిరెడ్డి..!

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో జగన్ తర్వాత తానే పవర్ ఫుల్ అని చెప్పాలనుకుంటున్నారో.. జగన్ కన్నా తానే పవర్ ఫుల్ అని చెప్పాలనుకుంటున్నారో కానీ... అప్పుడప్పుడూ... కాస్త తేడా ప్రకటనలు చేస్తున్నారు....

HOT NEWS

[X] Close
[X] Close