3 రోజుల్లో పరిహారం చెల్లించాలని ఆదేశించిన హైకోర్ట్

హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 3 రోజుల్లోగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని హైకోర్ట్ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సూచించింది. రైతుల ఆత్మహత్యలపై దాఖలైన వ్యాజ్యాలపై ఇవాళ హైకోర్ట్‌లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఇరు ప్రభుత్వాల తీరుపై కోర్ట్ తీవ్రంగా స్పందించింది. ఆత్మహత్యలను ఆపటానికి ఏమి చేస్తున్నారని ప్రశ్నించింది. ఇరు ప్రభుత్వాల న్యాయవాదులు రైతులకోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయని, కానీ అవి సరిపోవని కోర్ట్ అభిప్రాయపడింది. అధికారుల అవినీతికూడా రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతోందని, అలాంటి అధికారులపై కఠినంగా వ్యవహరించాలని వ్యాఖ్యానించింది. పాస్ పుస్తకం కావాలంటే రు.2 వేలు, ట్రాన్స్‌ఫార్మర్ కావాలంటే రు.4 వేలు చెల్లించాలా అని ప్రశ్నించింది.

మహబూబ్‌నగర్ జిల్లాలో రెవెన్యూ, ట్రాన్స్‌కో, ఖజానా శాఖల్లో అవినీతిపై మీడియాలో వచ్చిన కథనాన్ని హైకోర్ట్ సుమోటోగా విచారణకు తీసుకుంది. రెవన్యూ కార్యాలయాల్లో అవినీతిపై తెలంగాణ ప్రభుత్వాన్ని వివరాలు అడిగింది. ప్రొఫెసర్ కోదండరామ్ సూచనలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని టీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. రైతుల ఆత్మహత్యలు పూర్తిగా ఆగిపోవాలన్నదే తమ ఉద్దేశ్యమని తెలుపుతూ, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి వ్యవహారానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

ఖ‌మ్మం పంచాయితీ మ‌ళ్లీ షురూ… ఈసారి కాంగ్రెస్ లో!

ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాలు అంటేనే ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ న‌డుస్తూనే ఉంటుంది. అధికార పార్టీలో నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య చాలా క‌ష్టం. మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో తుమ్మ‌ల‌,...

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close