డార్లింగ్‌గా మారిపోయిన రాజాసాబ్

‘సలార్‌’ విజయం ప్రభాస్ అభిమానులకు నూతనోత్తేజాన్ని అందించింది. అభిమానులు కోరుకునే మాస్ విజయంతో 2023ని పూర్తి చేసుకున్న ఆయన అంతకుమించిన వినోదాల్ని 2024లో పంచబోతున్నారు. ప్రభాస్‌ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేశారు. ఈ చిత్రానికి ముందునుంచి ప్రచారంలో వున్న ‘రాజాసాబ్’ అనే పేరుని పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్ గురించి చెప్పాలంటే సలార్ లో ‘డైనోసార్‌’లా కనిపించిన ఆయన ఇప్పుడు రాజాసాబ్ లో మళ్ళీ వింటేజ్ డార్లింగ్‌ లుక్ లోకి మారిపోయారు. నల్లచొక్కా గళ్ళ లుంగీ కొట్టుకొని నవ్వుతూ నడిచొచూస్తున్న లుక్ నిజంగా పండగ కళని తీసుకొచ్చింది. హారర్ టచ్ వున్న ఈ కథలో ప్రభాస్‌ విభిన్నమైన పాత్రలో కనువిందు చేయనున్నారని ఫస్ట్ లుక్ చూస్తే అర్ధమౌతోంది. ఈ ఏడాదిలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు నాగ్ అశ్విన్ తో చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ కల్కి కూడా ఈ ఏడాది ప్రధమార్ధంలోనే ప్రేక్షకులని పలకరించనుంది. వైజయంతి మూవీస్ కి బాగా కలిసొచ్చిన డేట్ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రఘురామ రాజీనామా – జగన్ అహన్ని నాలుగేళ్లు కసితీరా కొట్టిన ఎంపీ

వైసీపీకి ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా చేశారు. తనపై అనర్హతావేటు వేయించేందుకు జగన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని రాజీనామా లేఖలో వెటకారం చేశారు. మీడియాలో జగన్ రెడ్డిని ఎంత కామెడీ...

పోలీసుల సమస్యలు పరిష్కరించాలని జగన్ రెడ్డికి డీజీపీ లేఖ !

అదేంటో ... ఐదేళ్ల వరకూ తమ పోలీసు సిబ్బందికి సమస్యలు ఉన్నాయని.. వారి టీఏ, డీఏలు కత్తిరించినప్పుడు కూడా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి గుర్తు రాలేదు., ఇప్పుడు ఎన్నికలకు ముందు.. .మరో పది...

నిందితుల కోసం వచ్చిన తెలంగాణ పోలీసులపై కడపలో దాడి

వేరే రాష్ట్రాలకు వెళ్లి దొంగతనాలు చేసి వచ్చి తమ గ్రామంలో సేఫ్ గా ఉండటం బీహార్ లాంటి రాష్ట్రాల్లో దొంగలు చేస్తూంటారు. అన్నీ తెలుసుకుని ఎవరైనా పట్టుకోవడానికి వెళ్తే... వారిపై మూకుమ్మడి దాడి...

రాజోలు జనసేన అభ్యర్థిగా గొల్లపల్లి సూర్యారావు కుమార్తె !?

పొత్తుల్లో భాగంగా రాజోలు నియోజకవర్గం జనసేనకు కేటాయించారని పవన్ కల్యాణ్ గతంలో ప్రకటించారు. దీంతో అక్కడ జనసేన అభ్యర్థిత్వం కోసం పలువురు పోటీ పడుతున్నారు. మొత్తంగా రేసులో నలుగురు ఉన్నారు. నిజానికి సిట్టింగ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close