విదేశీ ఆటగాళ్లను ఇళ్లకు చేర్చడమే బీసీసీఐకి అసలు టాస్క్..!

ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేసిన బీసీసీఐ ఇప్పుడు విదేశీ ఆటగాళ్లందర్నీ ఎలా దేశం దాటించాలా అని కిందా మీదా పడుతోంది. ఆటగాళ్లందర్నీ స్వస్థలాలకు క్షేమంగాచేర్చిన తర్వాతనే ఐపీఎల్ టోర్నీ పూర్తయినట్లు అని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. ఆటగాళ్లకు భరోసా ఇచ్చేందుకు ఈ ప్రకటన చేసింది. అంతలోనే ఐపీఎల్ వాయిదా వేయక తప్పలేదు. ఇప్పుడు ఆటగాళ్లను.. స్వదేశాలకు చేర్చే అంశంపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇప్పుడు తమ దేశానికి ఎలా వెళ్లాలా అని చూస్తున్నారు.

ఆటగాళ్లు.. సపోర్టింగ్ స్టాప్ ఇలా మొత్తం నలభై మందికిపైగా ఆస్ట్రేలియాన్లు ఐపీఎల్‌లో ఉన్నారు. వీరంతా స్వదేశానికి వెళ్లాల్సి ఉంది. ఆస్ట్రేలియా దేశం.. ఇండియా నుంచి వచ్చే వారు .. తమ పౌరులైనా సరే. .అనుమతించేది లేదని స్పష్టం చేసింది. కాదని వస్తే జైలు శిక్ష విధిస్తామని ప్రకటించింది. అలాగే ఇండియా నుంచి రాకపోకల్ని పలు దేశాలు నిషేధించాయి. ఈ క్రమంలో విదేశీ ఆటగాళ్లు తమ స్వస్థలాలకు వెళ్లడం ఇబ్బందికరంగా మారనుంది. ఈ పరిణామాలతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ముందుగా మాల్దీవ్స్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నిజానికి ఆ దేశం కూడా ఇండియన్స్ రాకపోకల్ని నిషేధించింది. కానీ బీసీసీఐ తన పలుకుబడి అంతటిని ఉపయోగించి..వారిని దేశం దాటించేందుకు ప్రయత్నిస్తోంది.

వైరస్ భయం పూర్తిగా తొలగిపోయే వరకూ టోర్నీ నిర్వహించడం సాధ్యం కాదు. ఈ సీజన్‌లో ఇక ఇండియాలో నిర్వహించడం అసాధ్యమని నిపుణులు అంచనా వేస్తున్నారు. మిగిలిన సీజన్‌ను విదేశాల్లో నిర్వహించడం కూడా సాధ్యం కాదు. ఇండియా నుంచి వచ్చే వారిని ఆహ్వానించడానికి ఈ సారి దుబాయ్ కూడా సిద్ధంగా లేదు. ఐపీఎల్ వాయిదా పడింది. ఇప్పటికే టీమ్‌లలోని ఆటగాళ్లతో పాటు …సపోర్టింగ్ స్టాఫ్‌లో పెద్ద ఎత్తున కరోనా కేసులు వెలుగు చూశాయి. అలాగే… మ్యాచ్‌లు జరుగుతున్న గ్రౌండ్స్‌లోని సిబ్బందికీ పాజిటివ్ సోకింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close