ఏబీవీకి ఇక ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వక తప్పదా?

ఏబీ వెంకటేశ్వరరావు కేసులో ఏపీ ప్రభుత్వానికి శుక్రవారం గట్టి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నారు. సస్పెన్షన్ విధించి రెండేళ్లు కావడం… ఇంకా పొడిగించాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం కావడం.. ఇప్పటి వరకూ అలాంటి అనుమతి ఏమీ కేంద్రం ఇవ్వకపోవడంతో .. దిక్కుతోచని స్థితిలో ఏపీ ప్రభుత్వం పడిపోయింది. గురువారం ఈ అంశంపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో ఏపీ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. ఏబీ సస్పెన్షన్‌నుఇంకా ఎంత కాలం కొనసాగిస్తారని ప్రశ్నించింది.

రెండేళ్లకు మించి సస్పెన్షన్‌ చేయకూడదన్న నిబంధనలను సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి గుర్తు చేసింది. అయితే ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కొనసాగింపు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన ఆదేశాల కోసం చూస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. రెండేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం ఏమిటని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. శుక్రవారంలోగా అన్ని వివరాలతో రావాలని పేర్కొంది సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ఎస్‌ఎల్‌పీపై జోక్యానికి ఆధారాలు కనిపించట్లేదని అభిప్రాయం పడింది.

శుక్రవారం విచారణ తర్వాత వాయిదా వేయడం కుదరదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం తెప్పించుకోవాల్సిందేనని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరారవుపై అభియోగాలు పూర్తిగా నిరూపణ కాకుండానే… ఆయనను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని కేంద్రానిక ిసిఫారసు చేసింది. ఇది చేసి చాలా కాలం అయింది. అయితే కేంద్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో శుక్రవారం సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకోబోతోందో కీలకమయ్యే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close