అంటే .. సినిమా టిక్కెట్ల జీవో చెల్లదా!?

సినిమా టిక్కెట్ల ధరలను ప్రభుత్వం నిర్ణయించేందుకు వీల్లేదని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు ప్రభుత్వంలోనూ రకరకాల పరిణామాలకు కారణం అయ్యే అవకాశం కనిపిస్తోంది. టిక్కెట్ల రేట్లను, సర్వీస్‌ ఛార్జీలను నిర్ణయించే అధికారం లైసెన్సింగ్‌ అథార్టీ అయిన జాయింట్‌ కలెక్టరుకు మాత్రమే ఉంటుందని చెప్పింది. పాత విధానంలో ఆన్‌లైన్‌ టిక్కెట్లు అమ్ముకోవచ్చునని స్పష్టం చేసింది.

ఆన్‌లైన్‌ ద్వారా టిక్కెట్లను కొనేవారిపై సర్వీస్‌ ఛార్జీల భారం వేయవచ్చునని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ డివిఎస్‌ఎస్‌ సోమయాజులు బుధవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. టిక్కెట్ల రేట్ల జిఓను, టిక్కెట్లలో సర్వీస్‌ ఛార్జీలను కలిపి ఆన్‌లైన్‌ టిక్కెట్లను నిర్ణయించడాన్ని సవాల్‌ చేసిన కేసులో హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది. జిఓ 69 ప్రకారం లైసెన్సింగ్‌ అథార్టీనే టిక్కెట్ల ధరల్ని నిర్ణయించాలని చెప్పింది.

ప్రస్తుతం ప్రభుత్వం కొత్త జీవో ఇచ్చింది. అందులో రకరకాల ఆంక్షలు పెట్టింది. పెద్ద సినిమాలకు ఓ రేట్.. చిన్న సినిమాలకు ఓ రేట్… ఏపీలో షూటింగ్ జరుపుకునే సినిమాలకు ఓ రేట్ ఇలా అనేక అంశాలతో జీవో ఇచ్చారు. ఈ జీవో ప్రకారమే టిక్కెట్ రేట్లను ఖరారు చేస్తున్నారు. అయితే ఇప్పుడు హైకోర్టు అవేమీ పని చేయమని.. జేసీ నేతృత్వంలో ఉండే లైసెన్సింగ్ అధారిటీనే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు పాత విధానంలోనే టిక్కెట్ ధరలు నిర్ణయించనున్నారు. అయితే జేసీ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం చెప్పినట్లే చేస్తారు కాబట్టి… ఈ తీర్పును అమలు చేస్తున్నామని చెప్పి సరిపుచ్చడానికే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

అదే జరిగితే సజ్జల పరిస్థితి ఏంటి..?

వైసీపీలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుండటంతో జగన్ రెడ్డి ఆత్మగా చెప్పుకునే సజ్జల రామకృష్ణ పరిస్థితి ఏంటనేది బిగ్ డిబేట్ గా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నాన్నాళ్ళు తనే సీఎం అనే తరహాలో...

థియేట‌ర్లు క్లోజ్.. హీరోల షేర్ ఎంత‌?

తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ మూత‌ప‌డ‌డంతో టాలీవుడ్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. నిజానికి ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడో ఒక‌ప్పుడు వ‌స్తుంద‌న్న భ‌యం, ఆందోళ‌న అంద‌రిలోనూ ఉంది. అది ఒక్క‌సారిగా నిజ‌మ‌య్యేస‌రికి అవాక్క‌య్యారు. నిజానికి నెల రోజుల...

ఐ ప్యాక్ బృందానికి జగన్ రెడ్డి వీడ్కోలు..?

ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీకి సేవలందించిన ఐ ప్యాక్ కార్యాలయానికి జగన్ రెడ్డి ఎన్నికలు ముగిసిన రెండు రోజుల తర్వాత వెళ్తుండటం చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి పోలింగ్ ముగిసిన తర్వాత ఐ ప్యాక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close