‘అల వైకుంఠపురంలో’.. ఏముంది ?

అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా తయారౌతుంది. టైటిల్ కూడా పెట్టేశారు. ‘అల వైకుంఠపురంలో’. అల్లు అర్జున్ లాంటి మాస్ హీరో సినిమాకి ఇలాంటి టైటిల్ పెట్టడానికి దమ్ము కావాలి. అది త్రివిక్రమ్ కి కావాల్సినంతవుంది. ఎందుకంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకే ‘అత్తారింటికి దారేది’ అనే ఓవర్ సాఫ్ట్ టైటిల్ పెట్టిన ట్రాక్ రికార్డ్ ఆయనది.

అయితే ‘అల వైకుంఠపురంలో’ అనేది ఇంకా డిఫరెంట్. పోతన భాగవతంలోనిది. ఇప్పుడు జనరేషన్ భాగవతం చదవడం లేదు కానీ ఒకప్పుడు భాగవత పద్యాలు చదివే వాళ్ళకి ఈ వాక్యం బాగా సుపరిచితం. భాగవతంలో గజేంద్ర మోక్ష ఘట్టంలోనిది. ‘అల వైకుంఠపురంబులో నగరిలో’ అనే ఈ పద్యం సాక్షాత్ శ్రీ మహావిష్ణువే రాశారని పోనత స్వయంగా చెప్పారు.

ఏమిటీ అల వైకుంఠపురం ?

గజేంద్ర మోక్ష ఘట్టంలో ఏనుగు పాహీ! పాహీ! అని శ్రీమన్నారాయణుడిని శరణు వేడాలి. అది వైకుంఠపురంలో వుండే శ్రీ మహావిష్ణు వినాలి. ఇక్కడే.. పోతనకి చిక్కొచ్చి పడింది. వైకుంఠపురం గురించి రాయాలంటే అది ఎలా వుంటుందో ఎవరికీ తెలీదు. ఎవరు చూసింది లేదు. పోతన కలం కదలడం లేదు. ఇంక లాభం లేదనుకొని అలా రామాలయంలోకి వెళ్తానని కూతురుకి చెప్పి బయటకి వెళ్లారు పోతన. కాసేపటి వచ్చి ”అల వైకుంఠపురంబులో నగరిలో” అనే పద్యం పూర్తి చేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంటికి వచ్చిన పోతనకు కూతురు చెంబులో నీరు ఇస్తుంది. కాళ్ళు కడుక్కొని మళ్ళీ రాయడానికి కూర్చున్నారు పోతన. ఒక్కసారిగా ఆయన కళ్ళల్లో ఆశ్చర్యం కనిపించింది. ”అల వైకుంఠపురంబులో నగరిలో” పద్యం చదివి… వెంటనే కూతురిని పిలిచి..’ ఈ పద్యం రాసింది ఎవరమ్మా ? అని అడిగారు. ”నీవే కద నాన్నా రాసి వెళ్ళింది” అని చెప్పింది కూతురు. అప్పుడు తెలిసింది. వచ్చి రాసింది స్వయంగా శ్రీ శ్రీమన్నారాయణుడేనని.

ఆ పద్యం ఇలా సాగుతుంది. అక్కడెక్కడో వైకుంఠపురం. ఆ పురంలో ఓ అద్భుతమైన సౌధం(మేడ). ఆ మేడ పరిసరాల్లో మందార వనం. అందులో అమృత సరస్సు. అక్కడ పర్యంకము (మంచం). దానిపై లక్ష్మిదేవితో వినోదించు శ్రీమన్నారాయణు. ఇలా వుంటుంది వైకుంఠపురం వర్ణన.

ఇదంతా ఎందుకు చెపాల్సివచ్చిందటే.. ‘అల వైకుంఠపురంలో’ సినిమాకి దీనితో చాలా లింక్ వుందనిపిస్తుంది. ఈ సినిమా టైటిల్ టీజర్ వదిలినప్పుడు.. మొదట ఓ మేడ కనిపిస్తుంది. ఆ మేడ నుండి అల వైకుంఠపురంలో టైటిల్ రివిల్ చేశాడు త్రివిక్రమ్. అంతేకాదు.. మొన్న వదిలిన కొత్త పోస్టర్ లో కూడా ఓ పెద్ద అంతస్తుల టవర్ లాంటి మేడని బ్యాగ్రౌండ్ లో చూపించాడు. ఈ లెక్కన మేడ లేదా ఓ ఇల్లు అనేది సినిమాలో చాలా కీలకం. మరి ఆ మేడలో ఏం జరిగింది? మేడలో ఎవరున్నారు ? వాళ్ళ కధ ఏమిటన్నది ‘అల వైకుంఠపురంలో’ ధీం కావచ్చు.

ఇక్కడ ఇంకొ పాయింట్ కూడా గమనించవచ్చు. మొదటి టీజర్ లో అల్లు అర్జున్ ఓ మిడిల్ క్లాస్ ఇంట్లో కనిపిస్తాడు. రెండో పోస్టర్ లో మాత్రం ఓ రిచ్ టవర్ లాంటి బిల్డింగ్ బయట సిగరెట్ కాల్చుకొని కనిపిస్తాడు. ఈ రెండిటికి లింక్ ఏమిటన్నది కూడా ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్.

మొత్తానికి రామాయణం, మహాభారతాల మీద డైలాగ్స్ కాయిన్ చేసే త్రివిక్రమ్.. ఈసారి భాగవత పద్యంనే టైటిల్ గా సినిమా థీంగా కాయిన్ చేశారనిపిస్తుంది. ప్రేక్షకులకు కావాల్సింది కూడా ఇదే. మంచి తెలుగు సినిమా చూసి చాలా కాలామైయింది. అలాంటి తెలుగు కధ రాసే సత్తా వున్న రచయిత త్రివిక్రమ్. ఆయన నుండి మంచి కధ వచ్చి కూడా చాలా రోజులైయింది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఓ మంచి తెలుగు సినిమా రావాలని కోరుకుంటున్నారు. రెండు కుటుంబాల మధ్య సున్నితమైన ఘర్షణ చూపించే దర్శక, రచయితలే కనిపించడం లేదు. మనిషిని మనసుని కదిలించే సినిమాలే కరువయ్యాయి.

‘అల వైకుంఠపురంలో’ సెటప్ చూస్తుంటే అచ్చమైన తెలుగు సినిమా , ముఖ్యంగా ఫ్యామిలీ సినిమా అనిపిస్తుంది. త్రివిక్రమ్ ఫ్యామిలీ సినిమా తీస్తే చూడాలని మాస్ ఆడియన్స్ కూడా వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. మరి ఆ మ్యాజిక్ ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో వర్క్ అవుట్ కావాలనే కోరుకుందాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హోదా ఇస్తేనే విభజన చట్టం అమలు..! హైకోర్టుకు ఏపీ సర్కార్ అఫిడవిట్..!

అమరావతి మార్పు గురించి ప్రస్తావన లేని పిటిషన్‌పై వేసే అఫిడవిట్లలో అటు కేంద్రం..ఇటు ఏపీ...రాజధాని మార్పు గురించి తమ విధానానని హైకోర్టులో చెప్పడం... ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2018 మార్చి 29న విభజన...

ఆహా ప్లానింగ్ : చిరుతో వెబ్ సిరీస్… 42 షోస్‌

తొట్ట తొలి ఓటీటీ సంస్థ ఆహా.. భారీ ప్లానింగ్ తో రాబోతోంది. వ‌రుస‌గా సినిమాలు కొంటూ, వెబ్ సిరీస్ లు రూపొందిస్తూ.. కంటెంట్ బ్యాంక్ ని పెంచుకుంటోంది ఆహా. రాబోయే రోజుల్లో ఆహా...

170 కోట్ల‌తో ఓటీటీ సినిమానా?

ఓటీటీ.. ప‌రిధి పెరుగుతోంది. చిత్ర‌సీమ‌ని మెల్ల‌మెల్ల‌గా ఓటీటీ ఆక్ర‌మించుకుంటోంది. నిర్మాత‌ల‌కు ఇదో ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా మారింది. థియేట‌ర్ల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఓటీటీ త‌న రూపాన్ని మార్చుకుంటోంది. ఓటీటీ సంస్థ‌లే... భారీ పెట్టుబ‌డితో సినిమాలు...

ఫ్లాప్ హీరోతో.. యూవీ సినిమా

ద‌ర్శ‌కుడు శోభ‌న్ గుర్తున్నాడా? వ‌ర్షం సినిమా ద‌ర్శ‌కుడు. ప్ర‌తిభావంత‌మైన ద‌ర్శ‌కుడు... చాలా త‌క్కువ వ‌య‌సులోనే క‌న్నుమూశాడు. త‌న త‌న‌యుడే సంతోష్. త‌ను నేను, పేప‌ర్ బోయ్ సినిమాల‌లో హీరోగా క‌నిపించాడు. ఆ...

HOT NEWS

[X] Close
[X] Close