వివేకా మర్డర్ చంద్రబాబు సర్కార్ కుట్రేనంటున్న వైసీపీ..!

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మళ్లీ రాజకీయ రంగు పులుముకుంటోంది. శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య తర్వాత పరిస్థితి ఒక్క సారిగా మారిపోవడంతో.. వైసీపీ నేతలు… టీడీపీపై ఎదురుదాడి ప్రారంభించారు. టీడీపీ ప్రభుత్వమే వైఎస్‌ వివేకాను చంపించిందని… చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి నేరుగా విమర్శలు గుప్పించారు. వైఎస్ వివేకా హత్యపై సమర్థత ఉన్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారని త్వరలో అన్ని వివరాలు బయటకు వస్తాయని చెప్పుకొచ్చారు. నేరుగా అధికారపక్షంలో ఉండి.. టీడీపీపై శ్రీకాంత్ రెడ్డి ఆరోపణలు చేయడం కొత్త చర్చకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని.. హైకోర్టులో గతంలో జగన్ తో పాటు… వైఎస్ వివేకా కుమార్తె కూడా పిటిషన్ వేశారు.

ఇప్పుడు… వైసీపీ ప్రభుత్వమే ఉంది కాబట్టి.. సీబీఐకి ఇచ్చే దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదననే ప్రశ్నల్ని ఏపీ సర్కార్ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎన్నికలకు ముందు జరిగిన హత్య కేసు ఇంత వరకూ ఓ కొలిక్కి రాలేదు. సిట్ టీముల్ని పదే పదే మార్చినా… అనుమానితులకు నార్కో పరీక్షలు నిర్వహించినా… పోలీసులు అసలు నేరాన్ని కనిపెట్టలేకపోయారు. అయితే.. రాజకీయ దుమారం మాత్రం తగ్గడం లేదు. తనకేమీ సంబంధం లేకపోయినా.. తనపై నిందలేస్తున్నారని… శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం అనుమానాస్పదంగా ఉన్న రెండు లేఖల్ని .. పోలీసులకు ఇవ్వడంతో.. మరోసారి ఈ వ్యవహారంపై కలకలం రేగింది.

ఇది అనేక అనుమానాలకు తావిచ్చేదిలా ఉండటంతో.. డీజీపీ గౌతం సవాంగ్ కూడా… ప్రత్యేకంగా పులివెందుల కు వెళ్లి కేసు విషయాన్ని సమీక్షించారు. అయితే మిస్టరీగా మారిన కేసులనే పోలీసులు చాలా సులువుగా చేధించారు. కానీ… పక్కాగా.. సాక్ష్యాలు లభించే వైఎస్ వివేకా కేసులో.. పోలీసుల దర్యాప్తు.. ఓ లక్ష్యం ప్రకారం… సాగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు.. వైసీపీ నేతలు.. టీడీపీ పైనే ఆరోపణలు చేస్తూండటంతో.. ఇది సీబీఐ దర్యాప్తు కోసం డిమాండ్లు వినిపించే దిశగా సాగుతోందని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close