చైతన్య : ప్రకాష్ రాజ్ నాన్ లోకలే..!

టాలీవుడ్ నటుల సంఘం ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉండగానే.. ప్రకాష్ రాజ్ ప్యానల్ ప్రకటించి రచ్చ ప్రారంభించారు. ఆయనకు చిరంజీవి మద్దతు ఉందని.. అందరికీ అర్థమైపోయింది. స్వయంగా నాగబాబు రంగంలోకి వచ్చి ఆ ప్యానల్‌ను ప్రమోట్ చేస్తున్నందున… చిరంజీవి ప్రకాష్ రాజ్ వైపు ఉన్నారని తేలిపోయింది. అయితే.. ఇక్కడ అనూహ్యంగా లోకల్.. నాన్ లోకల్ అనే చర్చ ప్రారంభయింది. కళాకారుడు విశ్వమానవుడని.. తాను నాన్ లోకల్ ఏంటీ అని రెచ్చిపోయారు. ఆయన టీమ్‌లోని వాళ్లు అదే చెప్పారు. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది యాక్టింగ్ గురించి కాదు.. పాలన గురించి. ఆ సంఘం సినిమా కాదు… తెలుగు నటీనటుల సంక్షేమం కోసం పెట్టుకున్న సంఘం. తెలుగు నటులే లోకల్ అవుతారు. పరాయిభాష నటులు కాదు.

కళ వరకూ కళాకారులకు లోకల్..నాన్ లోకల్ ఉండదు..! కానీ..

ప్రకాష్‌రాజ్ బహుభాషా నటుడు. ఆయనకు తెలంగాణలో ఫామ్ హౌస్ ఉన్నందున… రెండు గ్రామాలను దత్తత తీసుకుని ఏవో కొన్ని పనులు చేసినందున ఆయన తెలుగువాడైపోరు. అంతకు మించి తెలుగు నటుడైపోరు. ఆయన కన్నడిగుడు. గత ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నప్పుడు ఆయన బెంగళూరునే ఎంచుకున్నారు కానీ.. తెలుగు రాష్ట్రాలను కాదు. రాజకీయాల సంగతి పక్కన పెట్టినా… మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అనేది.. అచ్చమైన తెలుగు నటుల సంఘం. ఇక్కడి నటుల సంక్షేమం కోసం పాటుపడే సంఘం. కానీ అన్ని భాషల్లో నటిస్తూ.. చాన్సులున్నప్పుడు మాత్రమే.. టాలీవుడ్‌ గురంచి ఆలోచించే.. ప్రకాష్ రాజ్.. ఏ విధంగానూ.. లోకల్ కానే కాదు.

తెలుగు నటులు వెళ్లి కన్నడ, తమిళ సంఘాల్లో పోటీ చేయగలరా..?

ఇదే ప్రకాష్ రాజ్.. నడిగరం సంఘం ఎన్నికల్లో పోటీ చేయగలరా.. అంత ఎందుకు.. కన్నడ నటీనటుల సంఘంలో పోటీ చేసి మద్దతు పొందగలరా.?. ఒప్పుకోనే ఒప్పుకోరు. కానీ.. కళాకారులకు లోకల్ ఏంటీ అనే వాదన తీసుకు వస్తున్నారు. నిజమే కళాకారులకు లోకల్ .. నాన్ లోకల్ ఉండదు. అది కళను ప్రదర్శిస్తున్నంత వరకే. కానీ.. రాజకీయంగానో..మరో రకంగానో అస్థిత్వాన్ని ప్రదర్శించాలనుకుంటే ఖచ్చితంగా లోకలే అయి ఉండాలి. ఇతర రాష్ట్రాల ప్రజలకు.. సినీ నటులకు లేని విశాలమైన భావన తెలుగు రాష్ట్రాల వారికే ఉండాలన్నట్లుగా కొంత మంది మాట్లాడుతున్నారు. కానీ బయటకు వెళ్తే.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలాంటి ప్రివిలేజ్ ఉండదనే సంగతి వారికీ తెలుసు.

తెలుగు నటులకు మాత్రమే విశాల భావాలు ఉండాలా..?

ప్రకాష్ రాజ్ వ్యవహారశైలిపై ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఆయన భావజాలం ఎలాంటిదైనా కావొచ్చు కానీ వ్యక్తిగా ఆయన చిన్న బుద్దితో ఉంటారని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఆయనకు ఎవరినీ గౌరవించిన దాఖలాలు లేవు. చిరంజీవిని గతంలో ఇబ్బంది పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. కానీ.. ఎందుకో ప్రకాష్ రాజ్‌కు టీఆర్ఎస్‌ అధినేతతో సన్నిహిత సంబంధాలున్నాయనో…ఏపీ సర్కార్ పెద్దల మద్దతు ఉందనో కానీ… ఆయనకు మద్దతు ఇస్తున్నారు. కానీ నిఖార్సుగా అచ్చ తెలుగు నటుల్లోనే .. “మా “కోసం టాలీవుడ్ నటుల కోసం పని చేసేవారు చాలా మంది ఉన్నారు. వారిని ప్రోత్సహిస్తే కాస్తయినా మంచి జరుగుతుంది. లేకపోతే ప్రకాష్ రాజ్ లాంటి వారు.. తెలుగు నటీనటుల మీద స్వారీ చేస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లూసీఫ‌ర్‌’కి మ‌ళ్లీ రిపేర్లు

మ‌ల‌యాళ `లూసీఫ‌ర్‌`ని తెలుగులో `గాడ్ ఫాద‌ర్‌`గా రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి క‌థానాయ‌కుడు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. ఈ సినిమా షూటింగ్ అధికారికంగానూ మొద‌లైంది. అయితే.. మ‌ళ్లీ బ్రేక్ వ‌చ్చి ప‌డింది....

శేఖ‌ర్ క‌మ్ముల జోన‌ర్ మార్చాల‌ని అనుకుంటున్నాడా?

శేఖ‌ర్ క‌మ్ముల అన‌గానే ఓ ర‌క‌మైన సినిమాలు గుర్తొస్తాయి. ఆనంద్‌, గోదావ‌రి, హ్యాపీడేస్‌, ఫిదా.. ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాలే క‌ళ్ల‌ముందు మెదులుతాయి. త‌న‌పై కూడా అలాంటి ముద్రే ఉంది. ఫీల్ గుడ్...

మ‌హేష్ వ‌ద్ద‌న్న క‌థ‌తోనే..!

విజ‌య్‌తో వంశీ పైడిప‌ల్లి ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత‌. ఈ సినిమా కోసం విజ‌య్ ఏకంగా వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్న‌ట్టు టాక్‌. క‌థ కూడా ఓకే...

శంక‌ర్ సినిమా: ట్రైన్ ఎపిసోడ్ అదిరిపోద్దంతే!

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ట్రైన్ ఎపిసోడ్ అంటే.. `న‌ర‌సింహ‌నాయుడు` చ‌టుక్కున గుర్తొస్తుంది. బాల‌కృష్ణ పౌరుషానికి మ‌ణిశర్మ బీజియం, బి.గోపాల్ టేకింగ్ ఇవ‌న్నీ ఆ సీన్‌ని, ఎమోష‌న్‌నీ ప‌తాక స్థాయిలో నిల‌బెట్టాయి. ఆ...

HOT NEWS

[X] Close
[X] Close