పవన్ కల్యాణ్ ‘ఓజీ’ ప్రమోషన్స్ మొదలయ్యాయి. అభిమానుల్లో జోష్ నింపుతూ ఓ పవర్ఫుల్ సాంగ్‌ను విడుదల చేశారు. టైటిల్ కు తగ్గట్టు తమన్ మ్యూజిక్ పవర్ ఫుల్ గా వుంది. ముఖ్యంగా విశ్వ, శ్రీనివాస మౌళి రాసిన లిరిక్స్ హీరో క్యారెక్టర్ పై అంచనాలు పెంచాయి.
అలలిక కదలక భయపడేలే
క్షణక్షణమొక తల తెగిపడిలే
ప్రళయము ఎదురుగా నిలబడే
మేటి ధాటికి లోకం హడలే
రణమున యముడికి కనపడలే
దురుసుగా నివ్వు చరచకు తొడలే
పదునుగా తెగ విరిగిన మెడలే
రక్కసి దారుల రుధిరం పొరలే
ఫైర్.. ఇట్స్ కమింగ్.. ఇట్స్ బర్నింగ్
కెన్ యు టేక్ ఇట్ హయ్యర్ హయ్యర్.. స్ట్రోమ్ ఈజ్ కమింగ్.. ఓజెస్ గంభీర..
సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఎంత తీవ్రంగా వుండబోతోందో ఈ లిరిక్స్ సూచిస్తున్నాయి. సాంగ్ ని ప్రజెంట్ చేసిన తీరు బావుంది. పవన్ కళ్యాణ్ కి సంబధించి కొన్ని కొత్త షాట్లు చూపించారు. ముఖ్యంగా ఆయన వాక్ చేస్తున్న సీక్వెన్స్ అదిరిపోయింది. ఈ పాట అంచనాలని ఇంకా పెంచింది. సెప్టెంబర్ 25న ఓజీ తుపాన్ దూసుకొస్తుంది.