టీటీడీ చైర్మన్‌కు అమరావతిలో క్యాంప్ ఆఫీస్‌ ఎందుకో..?

తిరుమల తిరుపతి దేవస్థానాలకు చైర్మన్‌గా నియమితులైన.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయి.. వై.వి.సుబ్బారెడ్డి వ్యవహారశైలి రాను రాను వివాదాస్పదంగా మారుతోంది. ఇంత వరకూ.. చైర్మన్ ఒక్కరే పాలకమండలికి ఉన్నారు. సభ్యుల నియామకం పూర్తి కాలేదు. ఈ కారణంగా.. ఆయనకు ఎలాంటి అధికారాలు ఇంకా దఖలు పడినట్లుకాదు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. పాలక మండలి అనుమతితోనే తీసుకోవాలి. కానీ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహిత బంధువు కావడం… ప్రభుత్వంలో చక్రం తిప్పే వ్యక్తుల్లో ఒకరు కావడంతో.. ఆయన మాటలకు ఎదురు చెప్పే పరిస్థితి లేకపోయింది. ఈ క్రమంలో ఆయన కోసం.. ఆయన చేయమని ఆదేశించిన పనులు ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం అమరావతిలో క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేసుకోవడం.

టీటీడీ చైర్మన్‌గా ఎంత పెద్ద వ్యక్తి ఉన్నప్పటికీ… వారి కార్యకలాపాలు… కేవలం తిరుమలకే పరిమితమవుతాయి. రాజధాని అమరావతిలో ఉండి నీ.. టీటీడీ చైర్మన్ చేసేదేమీ ఉండదు. అందుకే.. ఇంత వరకూ ఏ టీటీడీ చైర్మన్ కూడా రాజధానిలో క్యాంపాఫీస్ అనే ఆలోచన చేయలేదు. కానీ సుబ్బారెడ్డి మాత్రం.. రాగానే తిరుమలో తన క్యాంపాఫీస్‌గా.. తను తన భార్య పేరు మీద నిర్మించిన కాటేజ్‌నే… ఎంచుకున్నారు. అక్కడ్నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కొత్తగా.. అమరావతిలోనూ.. టీటీడీ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు కూడా.. ఆరుగురు ఉద్యోగులతో… చైర్మన్ క్యాంప్ ఆఫీసు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. ఇది..ఇతర రాజకీయ నాయకులనే కాదు భక్తులను కూడా విస్మయానికి గురి చేస్తోంది.

టీటీడీ చైర్మన్ కు అమరావతిలో క్యాంప్ ఆఫీస్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. శ్రీవారి సొమ్మును ఇలా దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ చైర్మన్ అయినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి బాబాయిగా.. వైవీ సుబ్బారెడ్డి… ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కువ కాలం అమరావతిలోనే ఉంటారు కాబట్టి.. ఈ ఏర్పాటని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పుడే ఇన్ని వివాదాలు వస్తున్నాయి.. మరి పాలక మండలి ఏర్పాటైతే సభ్యులు కూడా.. తమ తమ రాష్ట్రాల్లో క్యాంప్ ఆఫీసులు కావాలని కోరుకుటారేమో..? కొసమెరుపేమిటంటే… భక్తుల సౌకర్యం కోసమే అమరావతిలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నానని వైవీసుబ్బారెడ్డి చెబుతున్నారు. అంటే.. అ క్యాంప్ ఆఫీస్.. చైర్మన్ కోసం కాదు.. భక్తుల కోసమేనన్నమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిందూపురం జిల్లా కోసం బాలకృష్ణ..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా జిల్లాల విభజన చేయబోతోందన్న ప్రచారం ఉద్ధృతంగా సాగుతున్న సమయంలో... ఏపీలో రాజకీయ నేతలు ఎవరి డిమాండ్లు వారు వినిపించడం ప్రారంభించారు. వీరి జాబితాలోకి టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ...

ఏపీ సర్కార్ రూ. 65వేల కోట్ల “ప్రైవేటు” అప్పు…!?

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గత వారం హడావుడిగా ఢిల్లీ వెళ్లారు. ఏపీ ప్రభుత్వానికి ఆర్థిక సాయం చేయాలని కోరారు. ఈ విషయాన్ని ప్రెస్‌నోట్ ద్వారా మీడియాకు చెప్పారు. కానీ.....

విశాఖలో మరో “ఫార్మా ఫైర్”..! ఎందుకిలా..?

విశాఖలో అర్థరాత్రి మరో భారీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. ప్రత్యేకంగా కెమికల్స్ తయారు చేసి.. ఇతర ఫార్మా కంపెనీలకు విక్రయించే... విశాఖ సాల్వెంట్స్ సంస్థలో ప్రమాదం జరింది. ఫ్యాక్టరీ మొత్తం కెమికల్స్‌తో...

కండ‌లు పెంచుతున్న‌ నాగ‌శౌర్య

ల‌వర్ బోయ్ పాత్ర‌ల‌కు అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతాడు నాగశౌర్య‌. త‌న కెరీర్‌లో అలాంటి క‌థ‌లే ఎక్కువ విజ‌యాల్ని అందించాయి. అయితే... మాస్ హీరోగా నిరూపించుకోవాల‌న్న‌ది నాగ‌శౌర్య తాప‌త్ర‌యం. అలాంటి క‌థ‌లు ఎంచుకుంటున్నా - స‌రైన...

HOT NEWS

[X] Close
[X] Close