హైకోర్టుకు చేరిన “బిగ్‌ బాస్” బాగోతం ..!

ఐదు రోజుల్లో ప్రారంభం కావాల్సిన రియాల్టీ షో బిగ్ బాస్‌కు.. హైకోర్టు గండం పొంచి ఉంది. ఒకే రోజు.. బిగ్ బాస్ షోపై … మూడు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. అందులో ఒకటి.. అసలు షో టైమింగ్స్‌ను అర్థరాత్రి తర్వాతే ఉండాలని ఆదేశించాలనే పిటిషన్ ఉంది. మరొకటి… కొద్ది రోజులుగా.. బిగ్ బాస్ షో పైనే కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తున్న గాయత్రీగుప్తా, శ్వేతారెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్. అదే సమయంలో… అరెస్ట్ భయం పట్టుకుందేమో కానీ.. బిగ్ బాస్ షో నిర్వాహకులు… హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకున్నారు. “కమిట్‌మెంట్” ఇవ్వలేదన్న కారణంగానే తమకు బిగ్ బాస్ షోలో అవకాశం కల్పించలేదని ఆరోపిస్తూ.. కొద్ది రోజులుగా… గాయత్రీ గుప్తా, శ్వేతారెడ్డి ఆరోపణలు చేస్తూ టీవీ చానళ్లలో లైవ్ షోలు నిర్వహించారు.

ఇద్దరూ విడివిడిగా రెండు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్రమంలో వారు హైకోర్టులో కూడా ఓ పిటిషన్ వేశారు. తమ ఫిర్యాదుల మేరకు… ఎఫ్ఐఆర్‌లో నమోదైన రవికాంత్‌, రఘు, అభిషేక్‌, శ్యాంకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయొద్దని పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో.. మా టీవీ బిగ్ బాస్ కోఆర్డినేషన్ టీం కూడా..హైకోర్టును ఆశ్రయించింది. వారు… గాయత్రీ గుప్తా, శ్వేతారెడ్డి దాఖలు నమోదు చేసిన కేసులను కొట్టి వేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. బంజారాహిల్స్, రాయదుర్గం పీఎస్‌లలో.. నమోదైన కేసులను కొట్టివేయాలని .. ఆ ఫిర్యాదులన్నీ అవాస్తవమని పేర్కొన్నారు. మరో వైపు… బిగ్‌బాస్‌ రియాల్టీషో అశ్లీలకరమైన షో అని.. అది కుటుంబంతో చూసే కార్యక్రమం కాదని.. హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది.

బిగ్‌బాస్‌ను రాత్రి 11 గంటల తర్వాత ప్రసారం చేయాలని పిల్‌లో పిటిషనర్ కోరారు. సినిమా లాగే ప్రతీ ఎపిసోడ్‌ను సెన్సార్ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌లో నాగార్జునతో పాటు 10 మందిని ప్రతివాదులుగా చేర్చారు. వివాదాల మూలంగా బిగ్ బాస్ షోకి ప్రచారం వస్తున్నా… అసలు షో న్యాయవివాదాల్లో పడి ఇరుక్కుపోతే.. మొదటికో మోసం వస్తుందని… షో నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఖమ్మంలో టీడీపీని పోటీ చేయమంటున్న బీజేపీ !

ఖమ్మం లోక్ సభ నియోజకవర్గంలో టీడీపీని పోటీ చేయాలని బీజేపీ కోరుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఖమ్మంలో ప్రస్తుతం తిరుగులేని ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంది. బీఆర్ఎస్ బలహీనపడటంతో.. నామా నాగేశ్వరరావు నిలబడినా...
video

‘కంగువా’ గ్లింప్స్: ఓ స‌రికొత్త ప్ర‌పంచం

https://www.youtube.com/watch?v=ByCDEmNig7Q విజువ‌ల్ ఎఫెక్ట్స్ విలువెంతో, దాంతో ఏమేం చేయొచ్చో తెలిశాక‌.. వెండి తెర‌పై స‌రికొత్త ప్రపంచాల్ని సృష్టించ‌డానికి ద‌ర్శ‌కులు పోటీ ప‌డడం మొద‌లెట్టారు. ఆ కోవ‌లో శివ కూడా చేరిపోయాడు. యాక్ష‌న్ సినిమాల‌తో కెరీర్...
video

గ్లాసంటే సైజు కాదు… సైన్యం

https://www.youtube.com/watch?v=oZYqzxtg4f8 ఏపీలో ఎన్నిక‌ల వేడి రాజుకొంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు పూర్తి స్థాయి రాజ‌కీయ నాయ‌కుడి అవ‌తారం ఎత్తాడు. ఆయ‌న్నుంచి సినిమాల‌కు సంబంధించిన అప్ డేట్లు మ‌రో రెండు మూడు నెల‌ల వ‌ర‌కూ రావు......

మీడియా వాచ్ : యూటర్న్‌లో కల్ట్ చూపిస్తున్న ఎన్టీవీ

ఎన్టీవీలోని అపరిచితుడు బయటకు వచ్చేశాడు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం కాంగ్రెస్ పై.. రేవంత్ రెడ్డిపై.. బీఆర్ఎస్ కు ఇష్టం లేని నేతలపై.. వాళ్ల టార్గెట్ ను రీచ్ ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close