3 రాజధానులకు 16నే ముహుర్తం..! ప్రధానికి ఆహ్వానం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్లుగానే మూడు రాజధానుల శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆహ్వానించింది. ప్రభుత్వం తరపున రాజధాని తరలింపు వ్యవహారాలన్నీ పర్యవేక్షిస్తున్న సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఈ మేరకు.. కేంద్ర ప్రభుత్వానికి లేఖ వెళ్లింది. రాజధానుల శంకుస్థాపనకు ప్రధానిని ఆహ్వానించేందుకు జగన్మోహన్ రెడ్డికి అపాయింట్‌మెంట్ కావాలని.. లేఖలో కోరారు. ప్రత్యక్షంగా అయినా.. ఆన్ లైన్ పద్దతిలో అయినా ప్రధాని పాల్గొన్నా… చాలని లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే శాసనపరమైన ప్రక్రియ అంతా పూర్తి చేశామన్న ప్రభుత్వం… గవర్నర్ బిల్లులపై సంతకాలు పెట్టడంతో గెజిట్ కూడా విడుదల చేసింది.

అయితే… ప్రస్తుతం ఆ బిల్లులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని.. హైకోర్టు స్టేటస్ కో విధించింది. దాన్ని తొలగించాలని.. ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. పధ్నాలుగో తేదీన హైకోర్టులో విచారణ జరగనుంది. అప్పటి వరకూ ఆగకుండా… సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్ ఎందుకు వెళ్లిందనేదానిపై.. సాయంత్రానికి క్లారిటీ వచ్చింది. పదహారునే ముహుర్తం పెట్టుకున్నట్లుగా … దానికి ప్రధానిని ఆహ్వానించేందుకు అపాయింట్‌మెంట్ కోరినట్లుగా వెలుగులోకి వచ్చింది. అయితే మూడు రాజధానుల అంశం ప్రస్తుతం కోర్టులో ఉంది. సుప్రీంకోర్టు స్టే ఇవ్వకుండా… శంకుస్థాపన చేయడం సాధ్యం కాదు. అలా చేస్తే కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా అవుతుంది.

సాధారణంగా ప్రధాని స్థాయి వ్యక్తుల్ని ఏదైనా ఈవెంట్‌కు ఆహ్వానించాలంటే… ముందుగా ఆయనను కలిసి.. ఫలానా కార్యక్రమానికి మీరు రావాలని అడిగి.. ఆయనకు అనుకూలమైన సమయం తీసుకుని.. అప్పుడే ముహుర్తం ఖరారు చేస్తారు. కానీ ఏపీ సర్కార్.. ముందుగా ముహుర్తం పెట్టేసుకుని ఆ తర్వాత ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తోంది. దీంతో.. మోదీని చిత్తశుద్ధితో పిలవాలనే ఆలోచన చేయడం లేదని.. కేవలం.. కేంద్రం మద్దతు ఉందని చెప్పడానికే లేఖ రాశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గతంలో అమరావతికి మోడీ శంకుస్థాపన చేశారు. అది ఓ రాజధాని వివాదాల్లో ఉండగా.. మరో రాజధాని శంకుస్థాపనకు వస్తారని ఎవరూ అనుకోవడం లేదు. అలా వస్తే.. ఆయన చెప్పిన మాటలన్నీ… గుర్తుకు వస్తాయి. అందుకే.. ఫార్మాలిటీగా ప్రధానిని పిలువాలని… ఏపీ సర్కార్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై.. రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close