మంటల్లో బెజవాడ కోవిడ్ ఆస్పత్రి..! రోగుల ప్రాణాలు పణం..!

మొన్న గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో కోవిడ్ ఆస్పత్రిలో మంటలు చెలరేగి. రోగులు మరణించిన విషయం కలకలం రేపింది. ఇప్పుడు అలాంటి ఘటనే ఏపీలో జరిగింది. విజయవాడలో.. కోవిడ్ చికిత్స ఆస్పత్రిగా వినియోగిస్తున్న స్వర్ణా ప్యాలెస్ హోటల్లో ఈ ఘటన జరిగింది. మంటలు ఎలా చెలరేగాయో కానీ ఒక్క సారిగా పొగ చుట్టుముట్టడంతో.. అందులో ఉన్న వారు వణికిపోయారు. శ్వాస సమస్యలతోనే అక్కడ చికిత్స పొందుతున్నరోగులు.. ఇబ్బంది పడ్డారు. నలుగురు వరకూ చనిపోయారని.. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు.

విజయవాడలో స్వర్ణా ప్యాలెస్ హోటల్ అంటే తెలియని వారుండరు. లాక్ డౌన్ కారణంగా పూర్తిగా మూసివేశారు. అయితే.. ఇటీవల కరోనా చికిత్స కోసం.. రమేష్ ఆస్పత్రి దాన్ని లీజుకు తీసుకుంది. అనుమతులు తీసుకుని కోవిడ్ ఆస్పత్రిగా మార్చింది. అందులో… నలభై నుంచి 50 మంది వరకూ చికిత్స పొందుతున్నట్లుగా చెబుతున్నారు. ఆస్పత్రిలో ఓ ఇరవై మంది వరకూ.. సిబ్బంది ఉంటారని అంచనా వేస్తున్నారు. అందరూ.. నిద్రపోతున్న సమయంలో మంటలు చెలరేగడంతో… పూర్తిగా పొగ చుట్టుముట్టిన తర్వాతే అగ్నిప్రమాదం గురించి తెలిసింది.

పొగ వల్ల శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ… గదుల కిటికీల్లోంచి రోగులు.. హాహాకారాలు చేశారు. కాసేపటికి.. అంబులెన్స్‌లు వచ్చాయి. ఉన్న వారందర్నీ… ఇతర ఆస్పత్రులకు తరలించే ప్రయత్నం చేశారు. అయితే.. మామూలుగా.. కాస్త సీరియస్‌గా ఉన్న వారినే అక్కడ చేర్చి వైద్యం అందిస్తున్నారు. ఇప్పుడు పొగబారిన పడటంతో.. వారిని కాపాడటానికి మరింత చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. అసలు స్వర్ణా ప్యాలెస్‌లో ఎంత మంది కరోనా రోగులు ఉన్నారు..? ఎంత మంది సిబ్బంది ఉన్నారు.. ఆరోగ్య పరిస్థితి ఏమిటి అన్నదానిపై పూర్తి వివరాలను అధికారులు చెప్పడం లేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వెంకయ్యనాయుడికి కరోనా ..!

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా సోకింది. అతి స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన కరోనా పరీక్ష చేయించుకున్నారు. దాంతో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతానికి హోమ్ ఐసోలేషన్‌లోనే వెంకయ్యనాయుడు ఉన్నారు. లక్షణాలు పెరిగితే...

‘ఆదిపురుష్`’పై అనుష్క క్లారిటీ

ప్ర‌భాస్ న‌టిస్తున్న మ‌రో బ‌హుళ భాషా చిత్రం `ఆది పురుష్‌`. రావ‌ణుడి పాత్ర‌కు సైఫ్ అలీఖాన్‌ని ఎంచుకున్నారు. సీత పాత్ర కోసం చాలామంది క‌థానాయిక‌ల పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. అందులో అనుష్క పేరు...

గ్యాప్ రాలేదు.. తీసుకున్నా: అనుష్క

బాహుబ‌లి త‌ర‌వాత‌.. అనుష్క మ‌రీ న‌ల్ల‌పూస అయిపోయింది. `భాగ‌మ‌తి` త‌ప్ప మ‌రే సినిమా ఒప్పుకోలేదు. నిశ్శ‌బ్దం.. సినిమాకి దాదాపుగా రెండేళ్లు కేటాయించాల్సివ‌చ్చింది. అనుష్క‌కి సినిమా అవ‌కాశాలు లేవా? వ‌చ్చినా చేయ‌డం లేదా?...

సోనూసూద్‌కి ఐరాస పుర‌స్కారం

నటుడు సోనూసూద్ కు అరుదైన పురస్కారం ప్ర‌క‌టించింది ఐక్య‌రాజ్య స‌మితి. ఐరాస అనుబంధ సంస్థ‌ యునైటెడ్‌ నేషన్స్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌డిపి) స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్ అవార్డుని ఈ యేట...

HOT NEWS

[X] Close
[X] Close