ఈవారం బాక్సాఫీస్: ముక్కోణ‌పు పోటీ

ద‌స‌రా క‌ళ బాక్సాఫీసు ద‌గ్గ‌ర కూడా క‌న‌ప‌డుతోంది. వ‌రుస‌గా మూడు సినిమాలు, ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి సిద్ధ‌మ‌య్యాయి. మ‌హా స‌ముద్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌, పెళ్లి సంద‌D… ఈ ద‌స‌రాకి టాలీవుడ్ ఇస్తున్న కానుక‌లు.

మూడూ ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాలే. ఆర్‌.ఎక్స్ 100 త‌ర‌వాత అజ‌య్ భూప‌తి చేసిన సినిమా మ‌హా స‌ముద్రం. శ‌ర్వా, సిద్దార్థ్ క‌లిసి న‌టించారు. టీజ‌ర్‌, ట్రైల‌ర్ రెండూ ఆకట్టుకున్నాయి. ప్రేమ‌కీ, స్నేహానికీ, ప‌గ‌కీ,పంతానికీ జ‌రిగిన పోరాటం – ప్రచార చిత్రాల్లో క‌నిపిస్తోంది. ఇంటెన్సిటీ అర్థ‌మ‌వుతోంది. క‌చ్చితంగా చూడ‌ద‌గిన సినిమా అనిపిస్తోంది. ఈ ద‌స‌రాకి వ‌స్తున్న సినిమాల్లో మ‌హా స‌ముద్రంకి మంచి ఓపెనింగ్స్ వ‌చ్చే అవ‌కాశాలు పుష్క‌లంగాఉన్నాయి.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ రాక కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అనేక‌మార్లు వాయిదా ప‌డి ఎట్ట‌కేల‌కు విడుద‌ల అవుతోంది. అఖిల్ కి ఓ హిట్టు అత్య‌వ‌స‌రం. త‌ను ఈ సినిమాపైనే ఆశ‌లు పెట్టుకున్నాడు. పూజా హెగ్డే.. ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. త‌న కోస‌మైనా థియేట‌ర్లు నిండుతాయ‌ని అక్కినేని ఫ్యాన్స్ ఆశ ప‌డుతున్నారు. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కంటూ ఓ ప్ర‌త్యేక అభిమాన గ‌ణం ఉంది. త‌న నుంచి మ‌రో బొమ్మ‌రిల్లు ఆశిస్తున్నారు ఫ్యాన్స్‌. పాట‌లు ఇప్పటికే హిట్టు. కాబ‌ట్టి – ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబ‌ట్టుకోవొచ్చు.

పాతికేళ్ల క్రితం పెళ్లి సంద‌డితో మ్యాజిక్ చేశాడు రాఘ‌వేంద్ర‌రావు. అప్పుడు శ్రీ‌కాంత్ ని స్టార్ గా మారిస్తే.. ఇప్పుడు శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ ని హీరోగా చేశాడు. పెళ్లి సంద‌D తో. గౌరి ద‌ర్శ‌కురాలు. అయితేనేం.. ప్ర‌చార చిత్రాల్లో రాఘవేంద్రుడి మార్క్ అచ్చంగా క‌నిపిస్తోంది. కీర‌వాణి పాట‌లు ఇప్ప‌టికే హిట్టు. కొత్త‌వాళ్ల‌తో ఇది వ‌ర‌కు కొన్ని అద్భుతాలు సృష్టించారు రాఘ‌వేంద్ర‌రావు. ఈసినిమాకీ త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి వీల్లేదు. పైగా పండ‌గ సీజ‌న్‌లో వ‌స్తోంది.

ఇలా.. ఈవారం బాక్సాఫీసు సంద‌డిగానే క‌నిపించ‌బోతోంది. సినిమా బాగున్నా – థియేట‌ర్ల‌కు రావ‌డానికి భ‌య‌ప‌డుతున్నారు ప్రేక్ష‌కులు. ఈ ద‌స‌రాతో… ఆ భ‌యాలు తొల‌గిపోవాల‌ని చిత్ర‌సీమ ఆశిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close