టైగర్ మెమన్ అరెస్ట్..ఇది వార్తేనా ?

బొంబాయి వరుసపేలుళ్ల సూత్రధారి టైగర్ మెమన్ పాకిస్తాన్ లో అరెస్టయ్యాడంటూ భారతీయ ఛానెళ్లలో బుధవారంనాడు అదేపనిగా వార్తలొచ్చాయి. సోషల్ మీడియాలో (ట్విట్టర్)లో వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకుని మీడియా తొందరపడిపోయింది. నిజానిజాలు తెలుసుకోకుండా 1993 బొంబాయి వరుసపేలుళ్ల కేసులో నిందితుడైన యాకుబ్ మెమన్ కు సోదరుడైన టైగర్ మెమన్ ని పాకిస్తాన్ లో అరెస్ట్ చేశారంటూ వార్తాకథనాలు దులిపేశాయి. యాకుబ్ మెమన్ ను ఉరితీసినప్పటికీ ఈ కేసులో ప్రధానసూత్రధారి టైగర్ మెమన్ కావడంతో అతణ్ణి రప్పించడానికి భారత్ ప్రయత్నిస్తునేఉంది. అతను పాకిస్తాన్ లో ఉన్నట్టు తేలినా, పాక్ ప్రభుత్వంమాత్రం ఉలుకూపలుకూలేకుండా ఉండిపోయింది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు పాక్ పోలీసులు టైగర్ మెమన్ ను కరాచీలో అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో కబురు రావడంతో చాలామంది హర్షం వెలుబుచ్చారు. 1993నాటి బొంబాయి వరుస పేలుళ్లలో 257మంది ప్రాణాలుకోల్పోయారు. ఏడువందల మందికిపైగానే గాయపడ్డారు. ఈ పేలుళ్లకు సూత్రధారిగా టైగర్ మెమన్ వ్యవహరించినట్టు విచారణలో తేలింది. అలాంటి టైగర్ మెమన్ ను పాక్ పోలీసులు అరెస్ట్ చేశారనగానే భారతీయులకు ఆనందం కలగడం సహజమే. సోషల్ మీడియాలో కామెంట్స్ స్ప్రెడ్ అయ్యాయి. అతనికి కఠినశిక్ష విధించాలని కూడా ట్వీట్ చేశారు. జియో న్యూస్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఉర్దూ భాషలో ట్వీట్ చేస్తూ – టైగర్ మెమన్ కరాచీలో అరెస్ట్ అయ్యాడని పేర్కొంది. అంతే ఈ వార్త కారుచిచ్చులా ప్రపంచమంతటా వ్యాప్తిచెందింది.

పాకిస్తాన్ లోని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్.ఐ.ఏ) బుధవారం మధ్యాహ్నం టైగర్ మెమన్ ను అరెస్ట్ చేసినట్టు తెలియగానే నెట్ జెన్స్ క్షణాల్లో ఈ వార్తను వైరల్ గా స్ప్రెడ్ చేశారు. కరాచీలోని సైబర్ కేఫ్ దగ్గర జరిగిన దాడిలో టైగర్ మెమన్ ను అరెస్ట్ చేశారని ట్వీట్స్ వచ్చేశాయి. టైగర్ మెమన్ ను అరెస్ట్ చేసి పాకిస్తాన్ ప్రభుత్వం మంచిపనిచేసిందని కూడా సోషల్ మీడియాల్లో వ్యాఖ్యానించినవారున్నారు. మోదీ తెచ్చిన ఒత్తిడి పాక్ మీద పడిందని మరికొంతమంది విశ్లేషించారు. కరడుగట్టిన నేరస్థుడు దొరకడంతో అంతా సంబరపడుతుంటే, పాక్ అధికారులు ఈ సంతోషపు పొంగుపై నీళ్లుజల్లారు.

ఇంతకీ పట్టుబడిన ఈ టైగర్ మెమన్, మనమంతా కోరుకుంటున్న టైగర్ మెమన్ ఒకరుకారట. ఫుర్ఖన్ అలియస్ టైగర్ మెమన్ ను అరెస్ట్ చేశామని ఎఫ్.ఐఏ చల్లగా సెలవిచ్చింది. ఈ సదరు నిందితుడు ఫేస్ బుక్ లో ఫేక్ అకౌంట్లు తెరిచి అమ్మాయిల్ని బ్లాక్ మెయిల్ చేస్తుంటాడట. పైగా తాను రియల్ టైగర్ మెమన్ ని అంటూ బెదరిస్తుంటాడట. ఇవన్నీ గమనించకుండానే మనదేశ మీడియా కూడా చెలరేగిపోయింది. ఉగ్రవాద చర్యలకు వ్యూహరచన చేసిన టైగర్ మెమన్ అరెస్టయ్యాడంటూ ఊదరగొట్టేసింది.

సోషల్ మీడియాలో కనిపించే ప్రతిదీ వార్తకాదన్న సత్యం ఇప్పటికైనా గౌరవ మీడియా గుర్తిస్తే మంచిది. లేకపోతే మీడియాపట్ల గౌరవం మంటగలిసిపోవడంఖాయం. టీఆర్పీ రేటింగ్ మత్తులోపడిపోయిన టీవీ ఛానెళ్లు ఏదివార్తో, ఏది కాదో కూడా తెలుసుకోకుండా హడావుడిగా వార్తలను ప్రసారంచేయడంతో ఇలాంటి చిక్కులను కొనితెచ్చుకుంటోంది.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆహా ఒరిజినల్ సిరీస్ ‘పాపం పసివాడు’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన డైరెక్టర్ సందీప్ రాజ్ … సెప్టెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్

పాపులర్ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఆహా నుంచి ‘పాపం పసివాడు’*అనే కామెడీ వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకులను పలకరించుంది. ఈ ఒరిజినల్‌ను *వీకెండ్...

టీడీపీ, జనసేన క్యాడర్ సమన్వయ బాధ్యతలు తీసుకున్న నాగబాబు

టీడీపీ, జనసేన పొత్తు ఖరారు కావడంతో ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లోనైనా కలిసి పోటీ చేసేందుకు ఓట్ల బదిలీ సాఫీగా జరిగేందుకు..క్యాడర్ మధ్య సమన్వయం సాధించే బాధ్యతను మెగా బ్రదర్ నాగబాబు తీసుకున్నారు....

లండన్‌లో జగన్ రెడ్డి ఫ్యామిలీకీ ఏపీ ప్రజల ఖర్చుతోనే సెక్యూరిటీ

ఏపీ ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యుల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త చట్టం తీసుకువస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెట్టింది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన...

లింగుస్వామికి ఓ హీరో కావాలి

‘పందెంకోడి’, ‘ఆవారా’ వంటి చిత్రాలతో తెలుగువారికి సుపరిచితులైన దర్శకుడు లింగుస్వామి. ఇటీవల రామ్‌తో ‘ది వారియర్‌’ తీశాడు. ఈ సినిమా పరాజయం పాలైయింది. ఇప్పుడు మళ్ళీ ఓ తెలుగు హీరోతోనే సినిమా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close