“కులాలు మనల్ని విడదీస్తున్నాయి, ధర్మం మనల్ని ఏకం చేస్తుంది. మనం కులాలుగా విడిపోతే రాజకీయం గెలుస్తుంది, మనం హిందువులుగా ఏకమైతేనే ధర్మం నిలబడుతుంది.”
కోట్లాది మంది భక్తుల దేవదేవుడి ప్రసాదాన్ని కల్తీ చేశారు. నెయ్యే కాని నెయ్యిని కెమికల్స్ తో తయారు చేసి ఉపయోగించారు. ఇంత కన్నా అపచారం ఉంటుందా?. అయినా నిందితులు ఏ మాత్రం భయపడకుండా జంతుకొవ్వు కలపలేదు సంతోషపడిండి.. అది మేము హిందూత్వానికి చేసిన గొప్ప మేలు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై “ల”కారాలతో విరుచుకుపడుతున్నారు. ఏమైనా అంటే కుల రాజకీయాలు ప్రారంభిస్తున్నారు. హిందూత్వంపై ఇంత తీవ్రమైన దాడి జరుగుతోంటే.. సమాజంలో చైతన్యం ఎందుకు కనిపించడం లేదు?. పవన్ కల్యాణ్ చెప్పినట్లుగా హిందూత్వం కులాల, ప్రాంతాలు, పార్టీల వారీగా విడిపోయిందా?. అన్ని వర్గాలు ఏకమవుతూంటే.. హిందూత్వం మాత్రమే అభ్యుదయం పేరుతో తన మూలాలను తాను చెరిపేసుకుంటోందా?. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇదే నిజమని అంగీకరించక తప్పదు.
హిందూ విశ్వాసాలపై ఇంత ధైర్యంగా ఎలా దాడి చేయగలుగుతున్నారు?
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో వెలుగులోకి వచ్చిన కల్తీ నెయ్యి ఉదంతం హిందూ సమాజంలో పెను ప్రకంపనలు సృష్టించింది. ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే ఆరోపణలు కేవలం ఒక రాజకీయ విమర్శ కాదు, అది హిందువుల పవిత్రతపై జరిగిన దాడి. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే చేదు నిజాన్ని ప్రయోగశాల నివేదికలు ధృవీకరించడం కోట్లాదిమంది మనోభావాలను దెబ్బతీసింది. ఇది కేవలం నెయ్యి నాణ్యతకు సంబంధించిన సాంకేతిక లోపం కాదు, కొన్ని శతాబ్దాలుగా అచంచలమైన విశ్వాసంతో కొనసాగుతున్న ఒక ఆధ్యాత్మిక సంప్రదాయంపై జరిగిన దాడి.
రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్ర క్షేత్రాలను ప్రయోగశాలలుగా మార్చడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. గత పాలకుల హయాంలో జరిగిన ఈ ఘోరం వెనుక ఉన్న ఉద్దేశపూర్వక హిందూత్వంపై దాడి స్పష్టంగా కనిపిస్తోంది. దేవుడిపై భయం, భక్తి లేని వ్యక్తులు వ్యవస్థల్లోకి చేరినప్పుడు ఇలాంటి విపరీత పరిణామాలు సంభవిస్తాయి. విశ్వాసాల కంటే వ్యాపార లాభాలు, లంచాల మేత పరమావధిగా సాగిన ఈ వ్యవహారం, హిందూ ధర్మ రక్షణ కవచాన్ని ఛిద్రం చేసే ప్రయత్నంగా భక్తులు భావిస్తున్నారు. తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపం చెందాల్సింది పోయి, నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు ఎదురుదాడికి దిగడం వారి నైతిక పతనాన్ని సూచిస్తోంది. భక్తి భావం లేని వారికి ఆధ్యాత్మిక విలువల కంటే రాజకీయ మనుగడే ముఖ్యమవుతుంది. వారి దేవుడు వేరు, వారి మార్గం వేరు అన్నట్టుగా వ్యవహరిస్తూ, మెజారిటీ ప్రజల మనోభావాలను పట్టించుకోకపోవడం సమర్థించే అంశం కాదు. ఈ నిర్భయమైన ధిక్కార ధోరణి పవిత్ర వ్యవస్థల పట్ల వారికున్న చులకన భావానికి అద్దం పడుతోంది.
హిందూయేతర ఓటుబ్యాంకు బలంతో హిందూత్వంపై జగన్ దాడి
ఇతర వర్గాల బలం వారి ఐక్యతలో ఉంది, హిందువుల బలహీనత వారి విభజనలో ఉంది. మనం సంఖ్యాపరంగా మెజార్టీ కావచ్చు, కానీ ఐక్యత లేనప్పుడు మనం సొంత గడ్డపైనే మైనారిటీల కంటే బలహీనం. తిరుమల పవిత్రతపై జరిగిన ఈ దాడి కేవలం నెయ్యి కొనుగోలులో జరిగిన రెండు వందల యాభై కోట్ల రూపాయల అవినీతికి పరిమితమైన అంశం కాదు. ఇది అంతకు మించి హిందూ సమాజం నైతిక స్థైర్యాన్ని, ఆధ్యాత్మిక పునాదులను బలహీనపరిచే ఒక వ్యవస్థీకృత కుట్రగా కనిపిస్తోంది. హిందూ ధర్మానికి అత్యంత కీలకమైన కేంద్రంపై జరిగిన ఈ దాడి, భక్తుల విశ్వాసాలను దెబ్బతీసి తద్వారా హిందూత్వాన్ని అణగదొక్కే లోతైన వ్యూహంలో భాగం. తప్పును ప్రశ్నించిన వారిపై కుల ముద్రలు వేయడం, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం వంటివి కేవలం ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు మాత్రమే. ఈ ధిక్కార ధోరణి వెనుక ఉన్న అసలు ధైర్యం ఎక్కడి నుండి వస్తోందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హిందూ సమాజం గొంతుకను అణచివేయగలమనే అతివిశ్వాసం వారి రాజకీయ సమీకరణాల్లోనే దాగి ఉంది. వైసీపీకి ఉన్న ఈ తెగింపు వెనుక బలమైన హిందూయేతర ఓటు బ్యాంక్ ఉందన్నది కాదనలేని వాస్తవం. ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కాపులు లేదా ఇతర హిందూ సామాజిక వర్గాలు వైసీపీకి శాశ్వత ఓటు బ్యాంక్ కాదని, కేవలం క్రైస్తవ, ముస్లిం మైనారిటీలే తమ అసలు బలమని ఆయన చేసిన ప్రకటనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంటే, మెజారిటీ హిందువుల భావోద్వేగాలతో తమకు సంబంధం లేదని వారి ఐక్యతను దెబ్బతీస్తేనే తమకు మనుగడ అన్న వ్యూహంతోనే ముందుకు సాగుతున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అది అవినీతి కాదు.. అంతకు మించిన మహా కుట్ర
జగన్ రెడ్డి వ్యక్తిగత విశ్వాసాలు , తిరుమల పట్ల ఆయన ప్రదర్శించిన విముఖత ఈ వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. శ్రీవేంకటేశ్వరుని దర్శించుకునే సమయంలో ఇతర మతస్థులు ఇచ్చే డిక్లరేషన్ సమర్పించడానికి ఆయన నిరాకరించడం, హిందూ ఆచారాలను పాటించడంలో చూపే ఉదాసీనత ఆయన అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్నాయి. హిందూయేతరుల మద్దతుతో అధికారాన్ని నిలబెట్టుకోవాలనే క్రమంలో, హిందూ ధార్మిక సంస్థల పవిత్రతను కాపాడటం ఆయనకు ప్రాధాన్యత లేని అంశంగా మారిపోయింది. జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో మత మార్పిళ్లు ఉధృతంగా జరిగాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకుని, వ్యవస్థలను అదుపులోకి తీసుకుని మత మార్పిళ్లను ప్రోత్సహించడం ద్వారా తన సొంత ఓటు బ్యాంక్ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలని జగన్ కుట్ర పన్నారన్న ఆరోపణలు ఇప్పుడు నిజమనిపిస్తున్నాయి. తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో కల్తీ నెయ్యి వ్యవహారం ఈ భారీ కుట్రలో ఒక భాగం మాత్రమేనని, హిందూ సమాజాన్ని అన్ని వైపుల నుండి చుట్టుముట్టే ప్రయత్నంలో ఇదొక వ్యూహమని అనుమానించక తప్పదు.
హిందువులను కులపరంగా చీల్చి చేస్తున్న రాజకీయం
హిందూ మతం, హిందూత్వం, దేవుళ్లపై ఇంత దాడి ఎలా జరగగలుగుతోంది? హిందువుల్లో ఐక్యత లేకపోవడమే కారణం. మైనార్టీలుగా పిలిచే వర్గాలు తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి అత్యంత వ్యవస్థీకృతంగా, ఏకతాటిపైకి వస్తున్నాయి. మజ్లిస్ వంటి పార్టీలు దేశవ్యాప్తంగా తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటూ, తమ వర్గం ఓట్లు ఎక్కడ కేంద్రీకృతమై ఉంటే అక్కడ విజయకేతనం ఎగురవేస్తున్నాయి. ఈ ఐక్యత వారి బలానికి నిదర్శనమైతే, కోట్లాదిగా ఉన్న హిందువుల మధ్య ఉన్న చీలికలు వారిని సొంత గడ్డపైనే బలహీనులుగా మారుస్తున్నాయి. దళిత వర్గాలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న మత మార్పిళ్ల వెనుక ఒక లోతైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. రిజర్వేషన్ స్థానాల్లో కూడా మత మార్పిడి చెందిన వారే ఆధిపత్యం చెలాయించేలా చేయడం ద్వారా, హిందూ సామాజిక ముఖచిత్రాన్ని మార్చేశారు. ఇది కేవలం మతపరమైన మార్పు మాత్రమే కాదు. హిందూ సమాజం ప్రాతినిధ్యాన్ని క్రమంగా తగ్గించి, ఒకే వర్గానికి చెందిన ఓటు బ్యాంక్ రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకునే ప్రక్రియ. ఈ ఐక్యతను ఇతర వర్గాలు ఆదర్శంగా తీసుకుంటుంటే, హిందువులు మాత్రం కులాలు, ఉప కులాల గొడవల్లో చిక్కుకుపోవడం విషాదకరం. సనాతన ధర్మం గురించి మాట్లాడితే, వెంటనే దానిని అంటరానితనం లేదా కుల వివక్షతో ముడిపెట్టి విషప్రచారం చేయడం హిందువుల్లోనే ఓ వర్గానికి అలవాటు. అభ్యుదయం పేరుతో హిందూ దేవతలను కించపరచడం, సంప్రదాయాలను హేళన చేయడం మేధావి లక్షణంగా చలామణీ అవుతోంది. హిందూత్వానికి ఎక్కడైనా అపచారం జరిగినప్పుడు అందరూ కలిసి గొంతు ఎత్తాల్సింది పోయి, ఆ దేవుళ్లను కూడా కులాలకు ఆపాదించి విడదీయడం ద్వారా హిందూ సమాజపు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. ఈ విభజన తత్వం వల్లనే మెజారిటీగా ఉండాల్సిన హిందువులు తమ గొంతును బలంగా వినిపించలేకపోతున్నారు. పవన్ కల్యాణ్ పేర్కొన్నట్లుగా, సంఖ్యాపరంగా హిందువులు మెజారిటీగా కనిపించినప్పటికీ, ఆచరణలో వారు కులాలు, మత మార్పిళ్లు , ప్రాంతీయ విభేదాల వల్ల మైనారిటీగా మారిపోయారు. ఐక్యత లేని మెజారిటీ కంటే, సంఘటితంగా ఉండే మైనార్టీలే రాజకీయంగా, సామాజికంగా శక్తివంతులవుతారని ప్రస్తుత పరిస్థితులు రుజువు చేస్తున్నాయి. అందుకే తిరుమల శ్రీవారిపై ఐదు సంవత్సరాలపై అత్యంత దారుణమైన అపవిత్రమైన దాడికి పాల్పడినా చాలా మంది నోరు విప్పలేకపోతున్నారు. అంటే దేవుడినే కులాలకు ఆపాదించే స్థితికి మనం పడిపోయాం. శత్రువు నీ మూలాలపై దాడి చేస్తున్నప్పుడు, నువ్వు ఇంకా కులాల లెక్కల్లో ఉంటే..మన వారసత్వాన్ని మనమే సమాధి చేసుకుంటున్నట్టు లెక్క.
హిందువులు కులాలు, ప్రాంతాలు, వర్గాలుగా విడిపోయిన మైనార్టీలు
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిణామాలు కేవలం రాజకీయ పోరాటాలుగా మాత్రమే మిగిలిపోవు. అవి హిందూ సమాజం ఐక్యతను, అస్తిత్వాన్ని సవాలు చేసే మలుపుగా మారాయి. ఇతర మత వర్గాల మధ్య ఉన్న తిరుగులేని ఐక్యత వారిని రాజకీయంగా తిరుగులేని శక్తిగా మారుస్తుంటే, హిందూ సమాజం మాత్రం కులాలు, ఉపకులాలు , ప్రాంతీయ విభేదాల మధ్య నలిగిపోతోంది. ఈ బలహీనతనే పెట్టుబడిగా మార్చుకున్న శక్తులు, హిందువుల ఓట్లతోనే గెలిచి, వారి మూలాలపైనే దాడి చేయడం ఒక వ్యూహాత్మక కుట్రగా కనిపిస్తోంది. రాజకీయ నాయకులు ఒక వర్గం హిందువులను మరొక వర్గానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడం ద్వారా విభజించి పాలించు సూత్రాన్ని అమలు చేస్తున్నారు. హిందూ ధర్మంపై దాడి జరిగినప్పుడు ఏకతాటిపైకి రావాల్సిన సమాజం, ఆ సమయంలో కూడా కుల సమీకరణాల్లో మునిగిపోవడం అత్యంత విషాదం. ఒకవైపు వ్యవస్థీకృత మత మార్పిళ్లు నిశ్శబ్దంగా హిందూ జనసంఖ్యను హరిస్తుంటే, మరోవైపు దేవాలయాల పవిత్రతపై జరుగుతున్న దాడులు హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి. రాజకీయ అధికారం కోసం అన్యమతస్థుల మద్దతును పొందుతున్న వారు, హిందూ సమాజపు అంతర్గత విభేదాలను ఆయుధంగా వాడుకుని సనాతన ధర్మ పునాదులను కదిలిస్తున్నారు. ఈ విపత్కర స్థితిలో హిందూ సమాజం మేల్కొనడం తప్పనిసరి. ఇతర వర్గాలు తమ ప్రయోజనాల కోసం ఏకమవుతున్న తీరును గమనించి, హిందువులు కూడా తమలోని అంతర్గత వైషమ్యాలను పక్కన పెట్టాలి. కులం కంటే ధర్మం మిన్న అని గుర్తించనంత కాలం, హిందూ సమాజం ఇలాంటి పరాభావాలను ఎదుర్కొంటూనే ఉంటుంది. ఒకే గొడుగు కిందకు రాకపోతే, భావి తరాలకు మనం అందించేది వారసత్వం కాదు, కేవలం వందల ముక్కలుగా చీలిన ఒక బలహీన సమాజాన్ని మాత్రమే.
ఇప్పటికైనా కళ్లు తెరుస్తారా?
ఇది కేవలం ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన విషయం కాదు; ఇది ఒక జాతి సంస్కృతికి , ధర్మానికి సంబంధించిన మనుగడ ప్రశ్న. అన్యమతస్థుల అండతో హిందూ సంప్రదాయాలను కాలరాసే ప్రయత్నాలను అడ్డుకోకపోతే, భవిష్యత్తులో మరిన్ని పవిత్ర క్షేత్రాలు ఇలాంటి దాడులకు గురయ్యే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉండవచ్చు, కానీ అవి కోట్లాది మంది ఆరాధ్య దైవాల పవిత్రతను బలితీసుకునే స్థాయికి చేరడం అత్యంత ప్రమాదకరం. అస్తిత్వ పోరాటం ఇప్పుడు క్లిష్ట దశకు చేరింది. హిందూ సమాజం తన ఆధ్యాత్మిక శక్తిని, సామాజిక ఐక్యతను తిరిగి పునరుద్ధరించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రాజకీయం కంటే ధర్మమే శాశ్వతమని భావించినప్పుడే, దేవాలయాల పవిత్రత , సనాతన సంస్కృతి సురక్షితంగా ఉంటాయి. మౌనం వీడి, విభేదాలు వీడి, ధర్మ రక్షణే ఏకైక లక్ష్యంగా సాగకపోతే సొంత గడ్డపైనే పరాయికరణ చెందే ప్రమాదం పొంచి ఉందని ఈ పరిణామాలు హెచ్చరిస్తున్నాయి.మెజార్టీ హిందువులు నిద్రపోతున్నంత కాలం, అన్యమత రాజకీయం అప్రహతితంగా సాగుతుంది. నీ గుడికి, నీ ప్రసాదానికి రక్షణ లేనప్పుడు, నువ్వు గర్వంగా చెప్పుకునే నీ కులం నిన్ను కాపాడలేదు.


