ప్ర‌భాస్ ద‌ర్శ‌న‌మిస్తున్నాడ‌హో..

ప్ర‌భాస్ – రాధాకృష్ణ కాంబినేష‌న్‌లో ఓ సినిమా ప‌ట్టాలెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఎప్పుడో కొబ్బ‌రికాయ కొట్టుకున్న సినిమా ఇది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఫ‌స్ట్ లుక్‌, టైటిల్ ఏదీ బ‌య‌ట‌కు రాలేదు. అదిగో – ఇదిగో అంటున్నారు త‌ప్ప‌, అస‌లు ఆ హ‌డావుడే లేదు. ప్ర‌భాస్ పుట్టిన రోజులు వ‌చ్చి, వెళ్లిపోయినా.. చిత్ర‌బృందం కామ్ గా ఉంది. నిర్మాణ సంస్థ యూవీ క్రియేష‌న్స్ పై ప్ర‌భాస్ అభిమానులు అలిగారు కూడా. అయినా వాళ్లేం ప‌ట్టించుకోలేదు.

ఇంత కాలానికి ప్ర‌భాస్ సినిమా నుంచి ఓ అప్ డేట్ వ‌చ్చింది. ప్ర‌భాస్ సినిమాకి సంబంధించిన టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ ఈనెల 10న ఉద‌యం 10 గంట‌ల‌కు ప్ర‌క‌టిస్తామ‌ని యూవీ క్రియేష‌న్స్ చెప్పేసింది. ఈ సినిమా కోసం రాధే శ్యామ పేరు గ‌ట్టిగా వినిపిస్తోంది. దాదాపుగా అదే ఖాయం కావొచ్చు. ఫ‌స్ట్ లుక్ కూడా గ్రాండ్ గా ఉండొచ్చు. ఇదో ల‌వ్ స్టోరీ. కాబ‌ట్టి.. దానికి త‌గ్గ‌ట్టే ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసే అవ‌కాశాలున్నాయి. ఈ సినిమా కోసం హైద‌రాబాద్ లో ఓ భారీ సెట్ నిర్మిస్తున్నారు. అందులోనే కొత్త షెడ్యూల్ మొద‌లు కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం అవసరం  : రామ్మాధవ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని..  దాన్ని భర్తీ చేయాలని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి రామ్‌మాధవ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోము వీర్రాజు.. ఏపీ  బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు...

చిరు మాస్టర్ ప్లాన్

ఆచార్య త‌ర‌వాత‌.. భారీ లైన‌ప్ అట్టి పెట్టుకున్నాడు చిరంజీవి. ఓ వైపు బాబీకి ఓకే చెప్పిన చిరు, మ‌రోవైపు మెహ‌ర్ ర‌మేష్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఇంకోవైపు వినాయ‌క్ తో సినిమా చేయ‌డానికి...

అఖిల్ – సురేంద‌ర్ రెడ్డి ఫిక్స్

`సైరా` త‌ర‌వాత సురేంద‌ర్ రెడ్డి ప్రాజెక్టు ఎవ‌రితో అన్న విష‌యంలో గంద‌ర‌గోళం నెల‌కొంది. అగ్ర హీరోలంతా బిజీ బిజీగా ఉండ‌డంతో.. సురేంద‌ర్ రెడ్డికి అనుకోని విరామం తీసుకోవాల్సివ‌చ్చింది. కొంత‌మంది కోసం క‌థ‌లు సిద్ధం...

సచివాలయం గాయబ్..!

దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్ర పాలనా కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌ హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న భవనాలు నేలమట్టం అయ్యాయి. మొత్తం పదకొండు భవనాలను నామరూపాల్లేకుండా తొలగించేశారు. శరవేగంగా ఇరవై ఐదు...

HOT NEWS

[X] Close
[X] Close