మీడియా వాచ్‌: ఈ ఇంట‌ర్వ్యూలేంట్రా బాబూ

స‌న్సేష‌న‌లిజ‌మ్ ఇప్పుడు మీడియా మూల సూత్ర‌మైపోయింది. ఏదో ఒక కాంట్ర‌వ‌ర్సీని ప‌ట్టుకుని లాగాల్సిందే. మ‌రీ ముఖ్యంగా ఇంట‌ర్వ్యూల‌లో. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల్ని ఇంట‌ర్వ్యూ చేసేట‌ప్పుడు అందులో ఒక‌టో, రెండో కాంట్ర‌వ‌ర్సీ క్వ‌శ్చ‌న్లు లేక‌పోతే.. ఆ ఇంట‌ర్వ్యూకి గుర్తింపు లేకుండా పోతోంది. కొంత‌మందైతే కేవ‌లం వివాదాల కోస‌మే ముఖాముఖి పోగ్రామ్స్ పెడుతుంటారు.

యూ ట్యూబ్ ఛాన‌ళ్లు వ‌చ్చాక‌… ఈ గోల మ‌రింత ఎక్కువైంది. నలుగురినీ నిర్మొహ‌మాటంగా తిట్టేవాడినే ఇంట‌ర్వ్యూకి పిలుస్తున్నారు. ఆ తిట్లు.. క‌ట్ చేసి ప్రోమోలు వేసుకుంటున్నారు. దుర‌దృష్టం ఏమిటంటే వాటికే వ్యూస్ ఎక్కువ వ‌స్తున్నాయి. ఇది వ‌ర‌కు జ‌నాల దృష్టంతా రాంగోపాల్ వ‌ర్మ‌పై ఉండేది. అంద‌రిపై సెటైర్లు వేయ‌గ‌ల స‌మ‌ర్థుడు కాబ‌ట్టి… ఆర్జీవీ చాలా ఛాన‌ళ్లుకు ఆ విధంగా ఫుడ్డు పెట్టాడు. ఆత‌ర‌వాత‌ శ్రీ‌రెడ్డిపై ఫోక‌స్ ప‌డింది. త‌ను ఇంట‌ర్వ్యూకి వ‌స్తే ఎవ‌రినో ఒక‌రిని ఏకి పాడేసేది. హీరోల బెడ్ రూమ్ విష‌యాల్ని పూస గుచ్చిన‌ట్టు (నిజ‌మో, అబ‌ద్ధ‌మో ప‌క్క‌న పెట్టండి) చెప్పేది. దాంతో వాటికీ బోల్డంత క్రేజ్‌.

ఇప్పుడు రాకేష్ మాస్ట‌ర్ ని ప‌ట్టుకుంది వెబ్ ప్ర‌పంచం. చిన్న చిన్న యూ ట్యూబ్ ఛాన‌ళ్ల‌న్నీ ఆయ‌న‌చుట్టూ తిరుగుతున్నాయి. చిరంజీవి ద‌గ్గ‌ర్నుంచి చిన్న చిన్న ఆర్టిస్టు వ‌ర‌కూ `వాడూ… వీడూ… లుచ్ఛా.. ల‌ఫూట్‌` అంటూ మాట్లాడేంత తెగువ ఆయ‌న‌కుంటే దాన్ని క్యాష్ చేసుకునే తెలివి తేట‌లు ఆయా ఛాన‌ళ్లు ప్ర‌ద‌ర్శించేవి. రాకేష్ మాస్టారితో ఇంట‌ర్వ్యూ అంటే.. తిట్ల దండ‌కాలు, బూతులే… అని ఫిక్స‌యిపోయారు జ‌నాలు.

ఇప్పుడు దానికి పీక్స్ చూపించింది ఓ యూ ట్యూబ్ ఛాన‌ల్‌. ఓ యూ ట్యూబ్ ఛాన‌ల్ రాకేష్ మాస్టారిని ఇంట‌ర్య్యూ చేసింది. మామూలుగా చేస్తే కిక్ ఏముంటుంది అనుకుందేమో. ఆయ‌న్ని మందులోకి దించి ఇంట‌ర్వ్యూ చేసింది. ఆయ‌న పెగ్గు వేస్తూ బూతులు మాట్లాడితే… క‌ట్ చేసి ప్రోమో వేసుకుంది. చంపేస్తా, న‌రికేస్తా అంటూ ఇంట‌ర్వ్యూ చేసిన వారిపైనా రాకేష్ మాస్టారు చిందులేయ‌డం ఈ ఇంట‌ర్వ్యూకే హైలెట్‌. సెక్స్ విష‌యాలు నిస్సంకోచంగా మాట్లాడ‌డం, బూతుల డోసు ఎక్కువ అవ్వ‌డం, మ‌రీ ముఖ్యంగా కెమెరా ముందే మందు కొట్ట‌డం – నువ్వెంత అంటే నువ్వెంత అంటూ… ఇంట‌ర్వ్యూ ఇచ్చేవాడూ, చేసేవాడూ పోట్లాడుకోవ‌డం ఇవ‌న్నీ న భూతో. న భ‌విష్య‌త్ అనుకోవాలి. ఇలాంటి ఇంట‌ర్వ్యూల‌తో.. ఈ జ‌నానికి ఏం వినోదం పంచి పెట్టాల‌ని? ఏం మంచి చేయాలని? మీడియా ఉద్దేశ్యం.. కాస్తో కూస్తో మంచి చేయ‌డ‌మే. ఇలా.. త‌ప్పు దోవ ప‌ట్టించ‌డం కాదు. సెల‌బ్రెటీ ముసుగులో ఏం మాట్లాడినా చెల్లిపోతుందిలే అనుకునే వాళ్లు చాలామంది ఉంటారు. వాళ్లంద‌రిపై కెమెరా ఫోక‌స్ చేయ‌డం జ‌ర్న‌లిజం అనిపించుకోదు. ఇలా మందు కొట్టించ‌డం అస్స‌లు కాదు. భ‌విష్య‌త్తులో బెడ్ రూమ్ లో దూరి వాళ్ల శృంగార కార్య‌క‌లాపాల్ని కెమెరాలో బంధిస్తూ ఇంట‌ర్వ్యూలు చేస్తారేమో..? అలాంటి దుస్థితి, దుర్గ‌తి.. మీడియాకు ప‌ట్ట‌కుండా దేవుడే కాపాడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

3 రాజధానులకు 16నే ముహుర్తం..! ప్రధానికి ఆహ్వానం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్లుగానే మూడు రాజధానుల శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆహ్వానించింది. ప్రభుత్వం తరపున రాజధాని తరలింపు వ్యవహారాలన్నీ పర్యవేక్షిస్తున్న సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఈ మేరకు.. కేంద్ర ప్రభుత్వానికి...

మంటల్లో బెజవాడ కోవిడ్ ఆస్పత్రి..! రోగుల ప్రాణాలు పణం..!

మొన్న గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో కోవిడ్ ఆస్పత్రిలో మంటలు చెలరేగి. రోగులు మరణించిన విషయం కలకలం రేపింది. ఇప్పుడు అలాంటి ఘటనే ఏపీలో జరిగింది. విజయవాడలో.. కోవిడ్ చికిత్స ఆస్పత్రిగా వినియోగిస్తున్న స్వర్ణా...

ఆర్కే పలుకు : జగన్‌ మెడకు ఈశ్వరయ్యను చుడుతున్న ఆర్కే..!

న్యాయవ్యవస్థపై జగన్ చేస్తున్న దాడిని తనదైన శైలిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు... ఆంధ్రజ్యోతి ఆర్కే చేస్తున్న ప్రయత్నానికి మాజీ హైకోర్టు న్యాయమూర్తి ఈశ్వరయ్య ఆయుధాన్ని అందించారు. జస్టిస్ నరసింహారెడ్డిపై పోరాటం చేస్తున్న దళిత జడ్జి...

50మంది అతిథులు.. 200 కుటుంబాల‌కు లైవ్‌లో

రానా - మిహిక‌ల పెళ్లి అత్యంత సింపుల్‌గా, ప‌రిమిత‌మైన బంధుమిత్రుల స‌మ‌క్షంలో, క‌రోనా ఆంక్ష‌ల మ‌ధ్య జ‌రిగిపోయింది. కొద్దిసేప‌టి క్రిత‌మే.. జిల‌క‌ర్ర - బెల్లం తంతు ముగిసింది. ఇప్పుడు రానా - మిహిక‌లు...

HOT NEWS

[X] Close
[X] Close