పులివెందులలో జగన్ రెడ్డి కొత్త పాలసీ తీసుకు వచ్చారు. తనను కలవాలంటే టోకెన్ తీసుకోవాలని స్పష్టం చేశారు. వైఎస్ వర్థంతి కారణంగా నివాళులు అర్పించేందుకు బెంగళూరు నుంచి జగన్ పులివెందుల ఒక రోజు ముందే వచ్చారు. క్యాడర్ తో సమావేశం అవుతారని ప్రకటించారు. అందునే కొంత మంది పార్టీ నేతలు, కార్యకర్తలు వచ్చారు. కానీ ప్రయోజనం లేకపోయింది. టోకెన్ సిస్టమ్ ఉందని.. టోకెన్ ఉన్న వారినే జగన్ కలుస్తారని ప్రకటించారు.
బిల్లుల కోసం..బెట్టింగుల్లో నష్టపోయామని ఆదుకోవాలని అడిగుతారు అనుకునేవారికి టోకెన్లు ఇవ్వడం లేదు. ఏదైనా అడుగుతారు అనుకుంటే మాత్రం అసలు చాన్సివ్వడం లేదు. ఫోటో దిగి వెళ్లిపోతారనుకున్న వారికి టోకెన్లు ఇచ్చారు. పులివెందుల , ఒంటిమిట్ట ఎన్నికల ఫలితాలపై జగన్ తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఎంత రిగ్గింగ్ చేసుకున్నా మరీ అన్ని తక్కువ ఓట్లు ఎలా వస్తాయని పార్టీ నేతలపై ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ఊళ్లలో ఉన్నవారందరూ ఓట్లు వేసినట్లుగా దృశ్యాలు ఉన్నాయి. కంచుకోటల్లాంటి చోట్ల ఇలాంటి పరిస్థితి రావడంతో ఆయన పార్టీ నేతల్ని కూడా నమ్మలేకపోతున్నారు.
జగన్ పులివెందుల వచ్చారని ఆయనను కలిసేందుకు పార్టీ ముఖ్యనేతలు వచ్చారు. జగన్ లోపల ఉంటే..బయట కనీసం రెండు, మూడువందల మంది అయినా లేకపోతే .. ఏమైనా అనుకుంటారమో అని…సమీకరించి ఇంటి ముందు నిలబెడుతున్నారు. కానీ జగన్ మాత్రం ముభావంగా ఉంటున్నారు. పులివెందుల రాజకీయాన్ని సంస్కరించాలని.. పార్టీకి కొత్త నాయకత్వం ఇవ్వాలని ఆయన అనుకోవడం లేదు. నిరాశలోనే మునిగి తేలుతున్నారు.