ఒక్క హిట్టుకే ‘కోటి’ ప‌లుకుతోంది

టాలీవుడ్‌లోనే కాదు.. ఏ వుడ్‌లో అయినా.. క‌థానాయకుల‌దే రాజ్యం. స్టార్ హీరోల చేతుల్లోనే ప‌రిశ్ర‌మ ప‌రిభ్ర‌మిస్తుంటుంది. అయితే హీరోయిన్లేం త‌క్కువ తిన‌లేదు. చ‌క్రం తిప్పే అవ‌కాశం వ‌స్తే.. ఎప్పుడూ వ‌దులుకోలేదు. ఇప్పటి స్టార్ క‌థానాయిక‌లు ఒక్కో సినిమాకీ రెండు మూడు కోట్ల‌కు తక్కువ కాకుండా తీసుకుంటున్నారు. అంతెందుకు.. చేతిలో ఒక్క హిట్టుంటే చాలు. వాళ్ల పారితోషికానికి రెక్క‌లొచ్చేస్తున్నాయి. `ఉప్పెన‌`తో కృతి శెట్టినే చూడండి. ఒక్క హిట్టు చూపించి, త‌న‌కు కావ‌ల్సినంత పారితోషికం ముక్కు పిండి మ‌రీ వ‌సూలు చేస్తోంది. ఇప్పుడు ఈ జాబితాలో శ్రీ‌లీల చేరిపోయింది.

రాఘ‌వేంద్ర‌రావు – పెళ్లి సంద‌డితో శ్రీ‌లీల టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైంది. ఆ సినిమా ఏకంగా రూ.10 కోట్లు వ‌సూలు చేసింది. తొలి రోజు, తొలి షోకే ఫ్లాప్ టాక్ వ‌చ్చినా స‌రే ఈ స్థాయిలో వ‌సూళ్లు అందుకోవడం విడ్డూరంగా అనిపించింది. శ్రీ‌లీల స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోవ‌డం, ఆమె నట‌న హుషారుగా సాగ‌డంతో.. కుర్ర‌కారు ఈ సినిమాకి ఓటేశారు. దాంతో ఊహించ‌ని వ‌సూళ్లు వ‌చ్చాయి. ఈ హిట్టు… శ్రీ‌లీల‌కి బాగా హెల్ప్ అయ్యింది. ఇప్పుడు ఆమె చేతిలో మూడు పెద్ద సినిమాలున్నాయి. ర‌వితేజ‌, న‌వీన్ పొలిశెట్టి చిత్రాల్లో త‌నే క‌థానాయిక‌. తొలి సినిమాకి రూ.5 ల‌క్ష‌ల పారితోషికం అందుకున్న శ్రీ‌లీల‌.. రెండో సినిమాకి రూ.40 ల‌క్షలకు పాకింది. ఇటీవ‌ల శ్రీ‌లీల ఓ కొత్త సినిమాకి రూ.75 ల‌క్ష‌లు తీసుకుని సంత‌కం పెట్టింద‌ని స‌మాచారం. ఇప్పుడు శ్రీలీల కాల్షీట్లు కావాలంటే కోటి ఇవ్వాల్సిందే. కొత్త‌గా ఎవ‌రైనా క‌థ చెప్ప‌డానికి వెళ్తే.. `కోటి.. ఇస్తారా` అని అడిగేస్తోంద‌ట‌. అదీ.. శ్రీ‌లీల రేంజ్‌. త‌న చేతిలో ఎలాగూ క్రేజీ సినిమాలే ఉన్నాయి. వాటిలో ఒక్క‌టి హిట్ట‌యినా.. శ్రీ‌లీల మ‌రో స్టార్ హీరోయిన్ అయిపోవ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రెండు నియోజకవర్గాల సమీక్షతోనే అలసిపోయారా !?

సీఎం జగన్ ఏదీ ప్రారంభించినా ఆర్భాటంగానే ఉంటుంది. కానీ తర్వాతే దాని గురించి అసలు పట్టించుకోరు. ప్రభుత్వ కార్యక్రమం అయినా.. పార్టీ కార్యక్రమం అయినా అంతే. నియోజకవర్గాల సమీక్షలను యాభై మంది కార్యకర్తలతో...

ఆ తిప్పలు టీచర్లకే కాదు.. త్వరలో ఉద్యోగులందరికీ !

ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. టీచర్లకు కొత్తగా సెల్ఫీ అటెండెన్స్‌ను తీసుకు వచ్చారు. తమ సొంత ఫోన్‌లో ప్రభుత్వం చెప్పిన యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని.. ఆ యాప్‌లో...

మ‌హేష్ – త్రివిక్ర‌మ్‌… ఇంత ఫాస్ట్ గానా?

అగ్ర హీరో సినిమా అంటే క‌నీసం ప్రొడ‌క్ష‌న్ కోసం యేడాది కేటాయించాల్సిందే. త్రివిక్ర‌మ్ లాంటి డైరెక్ట‌ర్ అంటే.... ఇంకా ఎక్కువ టైమే ప‌డుతుంది. ఎందుకంటే త్రివిక్ర‌మ్‌కి ఏదీ ఓ ప‌ట్టాన న‌చ్చ‌దు. మేకింగ్...

ఇక మోడీ టార్గెట్ రాజ్‌నాథ్ !

నరేంద్రమోదీ , అమిత్ షా గుజరాత్ రాజకీయాల్లో కిందా మీదా పడుతున్నప్పుడు వారంతా బీజేపీని నడిపించారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే ఎప్పుడైనా మోదీ ప్రధాని అభ్యర్థి అవడానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close