‘గ‌ని’కీ రెండు రిలీజ్ డేట్లు

టాలీవుడ్ లో కొత్త సినిమాలు, రిలీజ్ డేట్ల హ‌డావుడి క‌నిపిస్తోంది. దాదాపుగా పెద్ద సినిమాల‌న్నీ రిలీజ్ డేట్లు ప్ర‌క‌టించేశాయి. చిన్న‌పాటి క‌న్‌ఫ్యూజ‌న్ ఉన్నా… ఎప్పుడు, ఏ సినిమా రాబోతోంద‌న్న విష‌యంలో స్ప‌ష్ట‌త క‌నిపిస్తోంది. ఇప్పుడు ‘గ‌ని’కి సైతం దారి దొరికేసింద‌ని స‌మాచారం. వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ‘గ‌ని’. బాక్సింగ్ నేప‌థ్యంలో తీర్చిదిద్దిన క‌థ ఇది. కిర‌ణ్ కొర‌పాటి ద‌ర్శ‌కుడు. ఈ సినిమా ఎప్పుడో రెడీ అయిపోయింది. ఇప్పుడు రిలీజ్‌డేట్ కోసం ఎదురు చూస్తోంది. ఫిబ్ర‌వ‌రి 25 లేదంటే మార్చి 4న ఈ సినిమా రాబోతోంద‌ని స‌మాచారం.

ఫిబ్ర‌వ‌రి 25న‌… `భీమ్లా నాయ‌క్‌` రావాల్సివుంది. అయితే… భీమ్లానాయ‌క్ కి ఆప్ష‌న‌గా మ‌రో డేట్ ఉంది. ఫిబ్ర‌వ‌రి 25న రానిప‌క్షంలో, ఏప్రిల్ 1న భీమ్లానాయ‌క్ వ‌స్తాడు. ఫిబ్ర‌వ‌రి 25న భీమ్లా వ‌చ్చేస్తే… గ‌ని మార్చి 4న వ‌స్తుంది. భీమ్లా ఏప్రిల్ 1న వ‌స్తే గ‌నుక‌… ఫిబ్ర‌వ‌రి 24న గ‌ని వ‌చ్చేస్తాడు. అంటే… గ‌ని జాత‌కం మొత్తం ‘భీమ్లా..’పై ఆధార‌ప‌డి ఉంద‌న్న‌మాట‌. ఫిబ్ర‌వ‌రి 25న భీమ్లా రాకూడ‌ద‌నే గ‌ని టీమ్ కోరుకుంటుంది. ఎందుకంటే… ఆ డేట్ లో వ‌స్తే సేఫ్ గేమ్ ఆడొచ్చు. మార్చి 4న అంటే… ఒక వారం వ్య‌వ‌ధిలో `రాధేశ్యామ్‌` వ‌చ్చేస్తుంది. బాక్సాఫీసు ద‌గ్గ‌ర‌… పెద్ద‌గా టైమ్ దొర‌క‌దు. అందుకే.. ఫిబ్ర‌వ‌రి 25పైనే గ‌ని గురి పెట్టాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ పేరూ పెట్టేశారు !

దిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుని నిందితులకు నోటీసులు జారీ చేసింది. ఈడీ దాఖలు చేసిన రెండో...

ట్యాపింగ్ ఇష్యూలో పవన్ ఎంట్రీ – కేంద్ర హోంశాఖకు …

ఆనం రామనారాయణ రెడ్డి లాంటి సీనియర్ నేత తన ప్రాణానికి హాని ఉందని ఆందోళన చెందుతున్నా, డీజీపీ ఆయన భద్రతపై బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని జనసేన అధినేత పవన్...

నెల్లూరు రూరల్ – అదాల ప్రభాకర్ – వైసీపీకి పీడకలే !

నెల్లూరు ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజవకర్గానికి ఇంచార్జ్ గా నియమించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీపై ట్యాపింగ్ ఆరోపణలు చేయడంతో ఆయనను పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు....

సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనా టీడీపీ ముద్ర – వైసీపీకి ఏం దుస్థితి ?

సొంత పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ప్రభుత్వాన్ని చుట్టుముడితే అది టీడీపీ సమస్య అన్నట్లుగా తప్పించుకోవాలని చూస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ ట్యాపింగ్ సమస్య విపక్ష నేతలు చేస్తే... అది రాజకీయం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close