టీడీపీ విజ‌యం.. టాలీవుడ్ సంబ‌రం!

ఐదేళ్లు.. స‌రిగ్గా ఐదేళ్లు. జ‌గ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం వ‌ల్ల‌, ఆ నాయ‌కుల అరాచ‌కాల వ‌ల్ల ఏపీ ప్ర‌జ‌లు ఎంత ఇబ్బంది ప‌డ్డారో, టాలీవుడ్ కూడా అంతే స‌త‌మ‌త‌మైంది. ఈ ఐదేళ్లూ టాలీవుడ్ ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం అస్స‌లు ప‌ట్టించుకోలేదు. కేవ‌లం జ‌గ‌న్ గెల‌వ‌గానే. ఎవ‌రూ బొకేల‌తో వెళ్ల‌లేద‌న్న‌ది ఆయ‌న కోపం. ఆ కోపాన్నంతా చూపించేసుకొన్నారు. టికెట్ రేట్లు త‌గ్గించేసి ఇష్టానుసారం ప్ర‌వ‌ర్తించారు. టాలీవుడ్ మొత్తాన్ని త‌న కాళ్ల ద‌గ్గ‌ర‌కు రప్పించుకొన్నారు. దండాలు పెట్టించుకొన్నారు. ఐనా క‌నిక‌రం చూపించ‌లేదు. బెనిఫిట్ షోల‌కు అనుమ‌తుల్లేవు. అవార్డుల్లేవు. షూటింగులు చేసుకొంటే రాయితీలు లేవు. ఉన్న ఒకే ఒక్క రామానాయుడు స్టూడియోపైనా క‌త్తి క‌ట్టారు. ఇలా అన్ని వైపుల నుంచీ దాడులే.

మ‌రోసారి వైకాపా ప్ర‌భుత్వం వ‌స్తే ఏమైపోతామో అనే బెంగ‌, భ‌యం టాలీవుడ్ లోని నిర్మాత‌ల్లో క‌నిపించింది. `ఈసారి వైకాపా వ‌స్తే.. చిత్ర‌సీమ ఏపీ గురించి మ‌ర్చిపోవాల్సిందే` అనుకొన్నారంతా. ఇలాంటి ద‌శ‌లో వైకాపాని అధఃపాతాళానికి తొక్కేసింది కూట‌మి. మ‌ళ్లీ ప‌చ్చ జెండా రెప‌రెప‌లాడింది. దాంతో టాలీవుడ్లో సంబ‌రాలు మొద‌ల‌య్యాయి. టీడీపీకీ చిత్ర‌సీమ‌కూ అవినాభావ సంబంధం ఉంది. చాలామంది నిర్మాత‌లు, దర్శ‌కులు, న‌టీన‌టులు టీడీపీ ప‌క్షం. ఈ ఎన్నిక‌ల్లో వాళ్లంతా ప‌రోక్షంగా టీడీపీపి స‌పోర్ట్ చేశారు. వాళ్ల క‌ళ్ల‌ల్లో ఆనందం, ఉత్సాహం, సంబ‌రం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

ఏపీలో కొత్త స్టూడియోల‌కూ, రాయితీల‌కూ, అవార్డుల‌కూ ఇప్పుడు మార్గం సుగ‌మం అయ్యింది. కాక‌పోతే కొత్త ప్ర‌భుత్వం కుదుట ప‌డ‌డానికి కాస్త టైమ్ కావాలంతే! ఆ త‌ర‌వాత నిజ‌మైన పండ‌గ మొద‌ల‌వుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

తిరుమ‌ల‌లో ప్ర‌క్షాళ‌న మొద‌లు… మంచి రోజులొచ్చిన‌ట్లే!

తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నం అంటే దేశ‌, విదేశాల నుండి వ‌స్తుంటారు. ఉత్త‌రాధి నుండి తిరుమ‌ల‌కు ఒక్క‌సారి వెళ్లి రావాల‌న్న వారు అధికంగా ఉంటారు. వెంక‌టేశ్వేర స్వామి వారి ద‌ర్శ‌నం కోసం ఎంత క‌ష్ట‌మైన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close