ఓణీ ఫంక్షన్‌కు అతిరథ మహారథులందరూ హాజరయ్యారు!

హైదరాబాద్: పీవీపీ సంస్థ అధినేత పొట్లూరి వరప్రసాద్ కుమార్తె ఓణి ఫంక్షన్ కార్యక్రమం నిన్న రాత్రి హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని హెచ్ఐసీసీ కన్వెన్షన్ సెంటర్‌లో అట్టహాసంగా జరిగింది. విలేజ్ థీమ్‌తో సెట్టింగ్ వేయటంతో పాటు సంప్రదాయ ధోవతి, చీరలను డ్రస్ కోడ్‌గా పెట్టారు. హాజరైన ప్రముఖులలో అత్యధిక శాతం డ్రస్ కోడ్ అనుసరించే వచ్చారు కూడా. మరోవైపు ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ తప్పితే దాదాపుగా ప్రముఖులందరూ హాజరయ్యారు. మహేష్ కుటుంబ సమేతంగా హాజరైతే, ఎన్‌టీఆర్ సోదరుడు కళ్యాణరామ్‌తో కలిసి వచ్చారు. ఇక నాగార్జున ఎలాగూ తన తాజా సినిమాలో పంచెకట్టుతో కనిపిస్తారు కాబట్టి ప్రమోషన్ కూడా చేసినట్లవుతుందని అదే గెటప్‌లో భార్యాసమేతంగా హాజరయ్యారు. రాణా, తమిళ నటుడులు, కార్తి, ఆర్య ధోవతితో వచ్చారు. మహేష్ సోదరీమణులు మంజుల, ప్రియదర్శిని కూడా కుటుంబసమేతంగా హాజరయ్యారు. రాజమౌళి ప్యాంట్, షర్ట్ తోనే భార్యా సమేతంగా వచ్చారు. మురళీమోహన్, కీరవాణి, విజయసాయిరెడ్డి, పురందేశ్వరి, టీ సుబ్బరామిరెడ్డి కుమార్తె పింకీరెడ్డి, కాంగ్రెస్ నేతలు కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, వెంకటేష్, సురేష్, అలీ, గోపీచంద్, మంచు విష్ణు, నిమ్మగడ్డ ప్రసాద్, రాఘవేంద్రరావు, రాజశేఖర్, అనుష్క, శ్రీకాంత్ హాజరయ్యారు. మరోవైపు విజయవాడ నగరంలో రెండు వర్గాలకు నాయకులైన దేవినేని నెహ్రూ, వంగవీటి రాధా హాజరవటం విశేషం. పీవీపీ సంస్థ ప్రస్తుతం నాగార్జున, కార్తి, తమన్నాలతో ఊపిరి అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Click here for Photos : PVP Function

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘గైడ్‌లైన్స్’ రూపొందించుకున్న టాలీవుడ్

చిత్ర‌సీమ యావ‌త్తూ 'క్లాప్' కొట్టే ముహూర్తం కోసం ఎదురు చూస్తోంది. మ‌ళ్లీ సెట్లు క‌ళ‌క‌ళ‌లాడే రోజు కోసం క‌ల‌లు కంటోంది. జూన్‌లో చిత్రీక‌ర‌ణ‌లు మొద‌ల‌వుతాయి. అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే గైడ్ లైన్స్‌కి...

త్రివిక్ర‌మ్‌కి రీమేకులు వ‌ర్క‌వుట్ అవుతాయా?

స్వ‌త‌హాగా ర‌చ‌యిత‌లైన ద‌ర్శ‌కులు రీమేక్‌ల‌ను అంత‌గా ప్రోత్స‌హించ‌రు. కార‌ణం.. వాళ్ల ద‌గ్గ‌రే బోలెడ‌న్ని క‌థ‌లుంటాయి. త్రివిక్ర‌మ్ ఇప్ప‌టి వ‌ర‌కూ రీమేక్ జోలికి వెళ్ల‌లేదు. హాలీవుడ్ క‌థ‌ల్ని, న‌వ‌ల‌ల్ని, పాత సినిమాల్నీ స్ఫూర్తిగా తీసుకుని...

కరోనా టెస్టుల లెక్కలు తేల్చాల్సిందేనన్న తెలంగాణ హైకోర్టు ..!

కరోనా వైరస్ టెస్టులు పెద్దగా చేయకపోవడం.. తెలంగాణ సర్కార్ ను ఇబ్బందుల్లోకి నెడుతోంది. టెస్టుల విషయంలో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కొద్ది రోజుల కిందట..కరోనా...

రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువ.. ఈ సారి డిప్యూటీ సీఎం..!

నగరి ఎమ్మెల్యే రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువైపోతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై రోజా ఫైరయ్యారు. నారాయణస్వామి పుత్తూరులో పర్యటించారు. కానీ రోజాకు సమాచారం అందలేదు. పుత్తూరు .. ఆమె ఎమ్మెల్యేగా...

HOT NEWS

[X] Close
[X] Close