దసరా సందడితో టాలీవుడ్ కళకళలాడింది. కొత్త సినిమాలు, రిలీజ్ డేట్లు, పోస్టర్లతో సినిమా పేజ్ కలర్ఫుల్గా మారింది. బాలకృష్ణ అభిమానులకు ‘అఖండ 2’ అప్డేట్ ఇచ్చారు. డిసెంబర్ 5న ‘అఖండ 2: తాండవం’ విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.
నాని–సుజీత్ సినిమా ఈ రోజే వెంకటేష్ క్లాప్‌తో గ్రాండ్‌గా మొదలైంది. వెంకట్ బోయినపల్లి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
శ్రీవిష్ణు ‘సామజవరగమన’ దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వంలో మరో సినిమాకి శ్రీకారం చుట్టారు. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. అలాగే శ్రీవిష్ణు కోన వెంకట్ సమర్పణలో నటిస్తున్న సినిమాకి ‘కామ్రేడ్ కళ్యాణ్’ అని టైటిల్ పెట్టి గ్లింప్స్ రిలీజ్ చేశారు.
‘డిజే టిల్లు’ దర్శకుడు విమల్ కృష్ణ, రాగ్ మయూర్ హీరోగా ‘అనుమాన పక్షి’ అనే సినిమా చేస్తున్నాడు. ఇది కూడా క్యారెక్టర్ బేస్డ్ సినిమానే.
నయనతార ప్రధాన పాత్రలో సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘మూకుతి అమ్మన్ 2’ తెలుగులో ‘మహాశక్తి’ పేరుతో రానున్నట్లు మూవీ టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓంకార్‌తో ‘రాజు గారి గది 4: శ్రీచక్రం’ అనౌన్స్మెంట్ ఇచ్చింది. 2026 దసరాకి సినిమా రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు.
దీంతో పాటు ‘రాజాసాబ్’, ‘జటాధర’, ‘మోగ్లీ’, ‘మారెమ్మ’, ‘సంబరాల ఏటి గట్టు’ చిత్రాల నుంచి దసరా స్పెషల్ పోస్టర్స్ వచ్చాయి. మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ ప్రోమో కూడా దసరా స్పెషల్స్‌లో చేరింది.