బతిమలాటో.. పోరాటమో..టాలీవుడ్ ఒక్కటిగా చేయదా !?

టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు ఉనికి సమస్యలో పడిందన్నది నిజం. ఏపీలో ఉన్న టిక్కెట్ రేట్లు అంతే ఉంటే ఇక ధియేటర్లు మూసేసుకోవడం మంచిదని ఎగ్జిబిటర్‌గా సురేష్ బాబు వ్యాఖ్యానించారు. మిగిలిన వారిదీ అదే మాట. నిర్మాతగా ఆయన భారీ సినిమాలు తీయరు కాబట్టి నిర్మాతగా స్పందించలేదని అనుకుందాం. భారీ నిర్మాత అయితే..ఇక సినిమాలు ఏపీలో రిలీజ్ చేసుకోవడం దండగని అంటారు. ఏ రకంగా చూసినా ఏపీలో ఖరారు చేసిన విధానం.. టిక్కెట్ రేట్లు… అదనపు షోలు.. ఇలా ఏదైనా సరే ఇండస్ట్రీకి ఏమాత్రం అనుకూలం కాదు. మరి ఇప్పుడేం చేయాలి..?

సినిమా టిక్కెట్ రేట్ల ఖరారు విషయంలో సీఎం జగన్ పునరాలోచించాలి అని చిరంజీవి ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు. సురేష్ బాబు ఇంకాస్త గట్టిగానే ఇలా అయితే వ్యాపారాలు మూసుకోవడమే అన్నారు. అయితే.. ఈ స్పందన ఎవరికి వారు వ్యక్తం చేస్తున్నారు. కానీ టాలీవుడ్ ఏక తాటిపైకి రావడం లేదు. తమ సమస్యలేమిటో అందరూకలిసి చెప్పి ప్రభుత్వం తప్పు చేస్తుంటే అదే విషయం బహిరంగంగా చెప్పి .. ఒత్తిడి చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేయడం లేదు.

ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతోందని టాలీవుడ్ పెద్దలు నమ్ముతున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోని అతి తక్కువ రేట్లను నిర్ణయించడం వెనుక తమ నుంచి ఏపీ ప్రభుత్వం ఏదో ఆశిస్తోందని వారు నమ్ముతున్నారు. ఈ కోణంలో టాలీవుడ్ పెద్దలతోనే వారి అనుమతితో వచ్చిన వారితోనే దఫదఫాలుగా చర్చలు సాగాయి. చివరికి జగన్ ఆత్మీయుడిగా.. వ్యాపార భాగస్వామిగా పేరు పొందిన నాగార్జున కూడా వచ్చి మాట్లాడారు. కానీ సమస్య పరిష్కారం కాలేదు.

ప్రభుత్వం తాము చేయాలనుకున్నది చేస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ బతిమాలుకోవడమో.. పోరాటమో.. ఏదైనా ఐక్యంగా చేయాల్సి ఉంటుంది. ఎవరికి వారు చేస్తే టాలీవుడ్‌లో ఐక్యత లేదని తేలిపోతుంది. బయట బంధుత్వాలు.. రాజకీయాలు అన్నీ వదిలేసి..తమకు బతుకులు ఇచ్చిన పరిశ్రమ కోసం అందరూ కలిసి నడవాల్సిన సమయం ఆసన్నమయింది.కానీ కెరీర్‌లు అవసానదశకు తెచ్చుకున్న స్టార్లు.. ఇక తమదేముందిలో.. పరిశ్రమ ఎలా పోతే తమకెందుకులే అనుకుంటే మాత్రం.. ఎవరూ ఏం చేయలేరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ కానిస్టేబుల్ హత్య ఏపీ పోలీసు వ్యవస్థ బలహీనతకు సాక్ష్యం !

నంద్యాలలో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ను రౌడిషీటర్లు దారుణంగా హత్య చేసిన ఘటన ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమమవుతోంది. విధి నిర్వహణలో కటువుగా ఉండే హెడ్ కానిస్టేబుల్ రోడ్‌పై ఒంటరిగా కనిపిస్తే ఆరుగురు...

ఫ‌స్టాఫ్ లాక్ చేసిన అనిల్ రావిపూడి

ఎఫ్ 3తో.. త‌న విజ‌య యాత్ర‌ని దిగ్విజ‌యంగా కొన‌సాగించాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు త‌న దృష్టంతా బాల‌కృష్ణ సినిమాపైనే ఉంది. అనిల్ రావిపూడితో బాల‌య్య సినిమా ఓకే అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం...

కేసీఆర్ కన్నా మేఘానే టార్గెట్ చేస్తున్న షర్మిల!

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర వాయిదా వేసుకుని మరీ గవర్నర్ తమిళిసైను కలిశారు. ఓ పెద్ద ఫైల్ తీసుకెళ్లారు. అందతా కాళేశ్వరంలో జరిగిన అవినీతి అని.. గవర్నర్‌కు ఆధారాలిచ్చామని చెప్పారు....

మీడియా వాచ్ : కులాల మధ్య చిచ్చుపెట్టి చానళ్లు ఎంత సంపాదించుకుంటాయి ?

రాజకీయ మీడియా వలువలు వదిలేసింది. విలువ కట్టుకుని.. వసూలు చేసుకుని నగ్నంగా ఊరేగుతోంది. కులాల పేర్లు పెట్టి ఆ రెండు కులాలు కొట్లాడుకుంటున్నాయని ప్రచారం చేస్తోంది. చర్చలు నిర్వహిస్తోంది. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close