కొత్త జిల్లాల రాజకీయం వర్కవుట్ అవుతుందా !?

ముఖ్యమంత్రి జగన్ కావాలని చెబుతారో.. లేక ఎప్పుడు ఏది గుర్తొస్తే అది చెబుతారో కానీ పార్లమెంట్‌లో ఎంపీలు ఏం మాట్లాడాలో నిర్దేశించే సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటు గురించి మాట్లాడారు. అసలు ఎంపీలకు.. కొత్త జిల్లాలకు సంబంధం ఏమిటో ఎవరికీ తెలియదు. కానీ ఆయన అలా మాట్లాడారని మీడియాకూ లీకులు ఇచ్చారు. అంతే ఇక కొత్త జిల్లాల రాజకీయాన్ని జగన్ ప్రారంభించారని అందరూ చెప్పుకోవడం ప్రారంభించారు. నిజానికి ఏడాదిన్నర కిందటే రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ.. జిల్లాల వారీగా కమిటీల్ని ఏర్పాటు చేశారు.

అప్పట్లో నివేదికను మూడు నెలల్లో ఇవ్వాలని గడువు విధించారు. ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత చప్పుడు లేదు . ఇప్పుడు మూడు రాజధానుల నిర్ణయమూ వెనక్కి తీసుకున్నారు. నిజానికి కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పుడల్లా సాధ్యమయ్యే పని కాదు. కొత్తగా జనాభా లెక్కలను కేంద్రం తీసుకోవాల్సి ఉంది. దానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రకారం.. జనగణన పూర్తయ్యే వరకు ప్రస్తుతం ఉన్న గ్రామం, మండలం, రెవెన్యూ డివిజన్‌, జిల్లాల సరిహద్దులను కదిలించడానికి వీల్లేదు.

ఈ మేరకు భౌగోళిక సరిహద్దులు మార్చడానికి వీల్లేదంటూ రిజిస్ట్రార్‌ జనరల్‌, సెన్సస్‌ కమిషనర్‌ జారీ చేసిన ఫ్రీజ్‌ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా అమల్లో ఉన్నాయి. లెక్క ప్రకారం.. జనాభా లెక్కలు పూర్తయి.. వాటి ఫలితాల నోటిఫికేషన్‌ విడుదల చేసే వరకు ఫ్రీజ్‌ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. పదేళ్లకోసారి ఈ జన గణన జరుగుతుంది కాబట్టి.. లైట్ తీసుకోవడానికి లేదు. జనగణన పూర్తయిన తరవాతే జిల్లాల గురించి ఆలోచించాలి. కరోనా కారణంగా ఎప్పటికప్పుడు జనగణన వాయిదా పడుతోంది. అయినా జిల్లాల విభజన పేరుతో కాస్త చర్చను సమస్యల నుంచి పక్కదారి పట్టించవచ్చన్న ఆలోచన మాత్రం పెద్దలకు ఉందని ఎక్కువ మంది భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close