బంద్ షురూ… ఎక్క‌డి షూటింగులు అక్క‌డే!

తెలుగు ఫిలిం ఫెడ‌రేష‌న్ ఇచ్చిన పిలుపు మేర‌కు.. టాలీవుడ్ లో బంద్ మొద‌లైంది. ఎక్క‌డి షూటింగులు అక్క‌డే ఆగిపోయాయి. వేత‌నాల పెంపుకోసం గ‌త కొన్ని నెల‌లుగా.. సినీ కార్మికులు పోరాడుతున్నారు. కానీ… ఈ విష‌య‌మై నిర్మాత‌ల నుంచి స్పంద‌న రాక‌పోయేస‌రికి, ఈరోజు నుంచి బంద్ చేయాల‌ని నిర్ణ‌యించుకొన్నారు. చిత్ర‌సీమ‌లోని 24 విభాగాల‌కు చెందిన కార్మికులు ఈ బంద్ లో పాలు పంచుకొంటున్నారు. వేత‌నాలు పెంచే వ‌ర‌కూ షూటింగుల‌కు రామ‌ని.. సినీ కార్మికులు అల్టిమేట్టం జారీ చేశారు. ఈరోజు ఉద‌య‌మే జూనియ‌ర్ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌కి చేరుకొన్న సినీ కార్మికులు.. అక్క‌డ భైటాయించి త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేశారు. జూనియ‌ర్ ఆర్టిస్టుల‌ను తీసుకెళ్లే వాహ‌నాల‌ను అడ్డుకొన్నారు. ఈ ఉద‌యం 10 గంట‌ల నుంచి ఫిలిం ఫెడ‌రేష‌న్ ముందు ఆందోళ‌న నిర్వ‌హించ‌బోతున్నారు. ఈ మేర‌కు ఈరోజు ఫిలిం ఛాంబ‌ర్‌లో నిర్మాత‌ల మండ‌లి తో ఫిల్మ్ ఛాంబ‌ర్ స‌భ్యులు స‌మావేశం కానున్నారు. సినీ కార్మికుల‌ వేత‌నాల విష‌యంలో చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

గుంటూరు కారం: త్రీడీలో క‌నిపించిన బీడీ

https://www.youtube.com/watch?v=V-n_w4t9eEU&feature=youtu.be ముందు నుంచీ అనుకొంటున్న‌ట్టే.. మ‌హేష్ బాబు - త్రివిక్ర‌మ్ సినిమాకి 'గుంటూరు కారం' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సూప‌ర్ స్టార్ కృష్ణ జ‌యంతి సంద‌ర్భంగా ఈ రోజు ఫ‌స్ట్ గ్లిమ్స్ విడుద‌ల...

కేశినేనికి దారి తెలీడం లేదా ?

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తనను తాను ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నారు. బెజవాడను తిరుగులేని విధంగా అభివృద్ధి చేశానని.. టాటా ట్రస్ట్ అంటే తనదేనన్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఇండిపెండెంట్ గా...

‘గుహ’ క‌డుతున్న ప్ర‌భాస్‌

డ్రీమ్ హౌస్‌.. అంటూ ప్ర‌తీ ఒక్క‌రికీ ఉంటుంది. త‌మ ఇల్లు ఎలా ఉండాలో.. ముందు నుంచీ క‌ల‌లు కంటుంటారు. అలాంటి క‌ల ప్ర‌భాస్‌కీ ఉంది. అత్యాధునిక హంగుల‌తో ఓ ఫామ్ హౌస్ నిర్మించుకోవాల‌ని...

తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు కేంద్రం కూడా రెడీ !

తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఎవరూ ఊహించని విధంగా .. అత్యంత కాస్ట్ లీగా నిర్వహించడానికి తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేసింది. మరోసారి మన తెలంగాణ .. అనే సెంటిమెంట్ అందరిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close