నేడు ఏపీ బంద్: బస్సులు పగలగొట్టాలన్న వైసీపీ ఎమ్మెల్యే

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపై వైసీపీ శనివారంనాడు నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్‌లో ఆర్టీసీ బస్సులను పగలగొట్టాలని ఆ పార్టీకి చెందిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తద్వారా జగన్మోహనరెడ్డి ఏంటో తెలుగుదేశానికి తెలియజెప్పాలని అన్నారు. బస్సలు తిరగకుండా చేయాలని చెప్పారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యేవంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడగూడదని విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. ఎవరికీ ఇబ్బందిలేకుండా శాంతియుతంగా బంద్ నిర్వహించుకోవచ్చని అన్నారు.

మరోవైపు విజయవాడలో వైసీపీ – టీడీపీ నేతలమధ్య మాటలయుద్ధం జరుగుతోంది. దమ్ము, ధైర్యం ఉంటే ఒక్క బస్సుమీద చేయి వేయండని టీడీపీ నేత బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. భూసేకరణపై ముందుకు వెళితే తాము, జనసేన, వాముపక్షాలు కలిసి చంద్రబాబును ఫుట్‌బాల్ ఆడుకుంటామని వైసీపీ నేత కొడాలి నాని అన్నారు. దీనిపై బుద్దా వెంకన్న స్పందిస్తూ, రు.30 కోట్లకు జగన్‌కు అమ్ముడుపోయిన నాని చంద్రబాబు పేరెత్తటానికి అనర్హుడని అన్నారు. ప్రజలు గుర్తుపట్టకుండా ఉండటానికి ఒకసారి గడ్డంతో, మరోసారి గుండుతో దొంగలాగా మారువేషాలలో కనిపిస్తున్నాడని ఎద్దేవా చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే ప్లేస్ చెప్పాలని ఎవరి బలం ఎంతో తేల్చుకుందామని, గుడివాడ రావటానికైనా తాను సిద్ధమని అన్నారు. గుడివాడలో భీమేశ్వరస్వామి ఆలయానికి చెందిన 250 ఎకరాలు కబ్జా చేశాడని ఆరోపించారు. చంద్రబాబును ఏమైనా అంటే నాలుక కోస్తానని హెచ్చరించారు. దేవినేని ఉమాకూడా జగన్‌పై నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతగా మాట్లాడమని అన్నారు. నీలాంటి 420గాడు, ఛీటర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకుంటే ప్రజలు ఊరుకోరంటూ హెచ్చరించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం.. కేసీఆర్ డిసైడ్ అయ్యారా?

బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ అసలు విషయాన్ని గ్రహించినట్టు ఉన్నారు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నా కనీసం నిలువరించే ప్రయత్నం చేయడం లేదు. మొదట్లో ఈ ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అవ్వలేదనుకున్నారో ఏమో, మరికొంతమంది...

వాళ్ల కాళ్ల‌కు నేను కూడా మొక్కుతా… సీఎం చంద్ర‌బాబు

సీఎం చంద్ర‌బాబు త‌న‌ను తాను మార్చుకోవ‌టంలో ముందుంటారు అనేది ద‌గ్గ‌ర‌గా చూసిన వారి మాట‌. తాజాగా సీఎం తీసుకున్న నిర్ణ‌యం నిజ‌మే అనిపిస్తోంది. సీఎంగా ఎవ‌రున్నా ఆయా పార్టీల నేత‌లు, ప్ర‌జ‌లు కొంద‌రు...

రేవంత్ ప‌ర్ఫెక్ట్ స్కెచ్… గ్రేట‌ర్ ఎమ్మెల్యేల చేరిక అస‌లు వ్యూహాం ఇదా?!

సీఎం రేవంత్ రెడ్డి ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక‌... త‌న దూకుడు మ‌రింత పెంచారు. కేసీఆర్ ఎమ్మెల్యేల‌ను పిలిపించుకొని మాట్లాడుతున్నా, ప్ర‌తి రోజు క‌లుస్తున్నా... వ‌ల‌స‌ల‌ను ఆప‌లేక‌పోతున్నారు. రేవంత్ రెడ్డి ప‌క్కా వ్యూహాంతో, సీక్రెట్...

ఎక్స్‌క్లూజీవ్‌: ప్ర‌భాస్ టైటిల్ ‘ఫౌజీ’

ప్ర‌భాస్ - హ‌ను రాఘ‌వ‌పూడి కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'ఫౌజీ' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం. ఈ సినిమాలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close