నేలవిడిచిన సాము లో “కంది” పోయిన దేశం!

ఐదేళ్లలో కందిపప్పు ధరలు నాలుగురెట్లు, బియ్యం ధరలు రెండున్నర రెట్లు పెరగడం ‘ప్రపంచీకరణ’ కు ఒక పర్యావసానం. వర్ధమాన దేశాలు వాటికి తెలియకుండానే ఒక మాయలో పడిపోవడం, లేదా మాయ తెలిసీ తప్పించుకోలేకుండా ఇరుక్కుపోవడం జరుగుతోంది. ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోవడమో, వ్యవసాయ భూమి విస్తీర్ణం కుంచించుకు పోవడమో జరుగుతోంది.

సూడాన్ మొదలైన ఆఫ్రికా దేశాలలో అమెరికా, చైనా సంస్థలు లక్షలాది ఎకరాల్లో ‘ఇంధనం మొక్కలు’ మాత్రమే పెంచుతున్నారు. ఈ గ్రీన్ ఫ్యూయల్ ఫలితంగా ఆఫ్రికా దేశాల్లో స్ధానిక, సహజ, స్వాభావిక పంటలు అంతరించిపోయాయి. దీంతో ఆదేశాలకు నిరంతరం ఆహార ధాన్యాలను ఎప్పుడూ దిగుమతి చేసుకుంటూనే వుండవలసిన పరిస్ధితి దాపురించింది!

అంతెందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో జరగబోయేదికూడా ఇదే! ఆ ప్రాంతంలో వరి, చెరకు కంది, అరటి,మామిడి వంటి వాటివల్ల సహజ హరిత శోభ ఏర్పడుతోంది, ఆహారపదార్ధాలు కూడ ఉత్పత్తి అవుతున్నాయి. కానీ 33 వేల ఎకరాల్లో స్వాభావికమైన పచ్చదనాన్ని ధ్వంసం చేసి ‘పార్కులు’ పేరుతో ‘గార్డెన్స్’ పేరుతో పిచ్చిమొక్కలను పెంచడం వల్ల కృత్రిమ హరిత శోభ నెలకొనవచ్చు.కానీ కందిపప్పు, బియ్యం మాత్రం అక్కడ ఎప్పటికీ పండవు..

బిటి పత్తి వల్ల ఎక్కువ రాబడులు వుంటాయన్న ఆశతో స్వాభావిక సహజ పంటఅయిన కంది సాగును వదిలేసిన మహారాష్ట్ర, తెలంగాణ,కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పదేళ్ళక్రితమే ప్రపంచీకరణ మాయలో మునిగిపోయాయి.

మనిషైనా దేశమైన స్వవలంబనను కోల్పోయాక ఇతరుల చెప్పుచేతల్లో వుండకతప్పదు. కందిపప్పు ధరలు పెరగడానికి ముందుగా మిరియాల ధరలు భయంకరంగా పెరిగిపోయాయి. కందిపప్పు ధరలు పెరిగిన తరువాత మిరపకాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఉల్లి ధరలు పెరగడం తగ్గడం తాత్కాలిక పరిణామం అని అనుకుంటున్నా వంద శాతం పెరుగుదల ఆ తరువాత ముప్పయి శాతం నుండి యాబయి శాతం వరకు మాత్రమే తగ్గడమే అసలు పరిణామం!దీర్ఘకాలంలో అన్ని ఆహార పదార్ధాలు,ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్ల ధరల సగటు పెరుగుదల ఇలాగే వుంటుంది.

కిరాణా దుకాణాలను సూపర్ మార్కెట్లు మింగేశాయి. సూపర్ మార్కెట్లను మోర్, జెయంట్, డిమార్ట్, మెగాస్టోర్ వంటి మెగా స్టోర్లు మింగేశాయి…తక్కువ ధర కే సరుకు అమ్ముతున్న ఈ మెగా స్టోర్లు – ఇతర మార్కెటింగ్ వ్యవస్ధలు ధ్వంసమయ్యాక విశ్వరూపాన్ని చూపిస్తాయి. వాటి ధరల్ని ప్రభావితం చేసే పరోక్ష లేదా ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులే అంతిమంగా మనం ఏసరుకు ఏధరకు కొనాలో నిర్ణయిస్తాయి.

ప్రస్తుత సమస్య అయిన కందిపప్పు విషయాన్నే విశ్లేషిస్తే 2014-15 పంట ఏడాదిలో 17.38 మిలియన్‌ టన్నుల పప్పులు దిగుబడి నమోదయ్యింది. ఇంతక్రితం ఏడాదితో పోల్చితే ఇది 9.5 శాతం తక్కువ ఉత్పత్తి. ఏటా భారతదేశంలో 21 మిలియన్‌ టన్నుల డిమాండ్‌ ఉంది. ప్రధానంగా మహారాష్ట్ర, కర్నాటకలో దిగుబడి పడిపోయింది. ఉత్పత్తిలో స్వల్పంగానే తగ్గుదల చోటు చేసుకున్నప్పటికీ నల్లబజార్‌లో దాచేయడంతో సరఫరాలో తీవ్ర అంతరం నెలకొంది. దీంతో కృత్రిమంగా ధరలు పెరిగాయి.

2007లో కందిపప్పు ధరలు భయంకరంగా పెరిగే వరకు అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆతరువాత ఆస్ట్రేలియా నుండి కందిపప్పును దిగుమతి చేసుకొనడానికి ప్రయత్నించింది. కానీ మన దేశంలో కంది కొరత ఏర్పడిపోయిందని అంతర్జాతీయంగా అప్పటికే ప్రచారమైంది. అందువల్ల ఆస్ట్రేలియా సంస్థలు మాత్రమే కాదు, అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు సైతం కందిపప్పు ధరలను పెంచాయి. ఆ పెరిగిన ధరలకు మనం కంది గింజలను కొనుక్కోవలసి వచ్చింది. భారీ ప్రమాణంలో మన ప్రభుత్వం కందిపప్పును దిగుమతి చేసుకున్నప్పటికీ అందువల్ల కందిపప్పు ధరలు తగ్గలేదు. ఈ కథ ఇప్పుడు పునరావృత్తం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close