మ‌రీ అంత మోసేయాలా??

ఈ వారం విడుద‌లైన చిత్రాల్లో.. ఈడోర‌కం – ఆడోర‌కం డీసెంట్ మూవీ అనిపించుకొంది. అడ‌ల్ట్ కంటెంట్ ఉన్నా… కామెడీ వ‌ర్క‌వుట్ కావ‌డంతో వ‌న్ టైమ్ వాచ్ మూవీగా నిల‌బ‌డిపోయింది. దాంతో ఈ సినిమాకి ప్ర‌మోషన్ పెంచే ప‌నిలో ఉంది చిత్ర‌బృందం. ప‌నిలో ప‌నిగా మోహ‌న్ బాబు కూడా రంగంలోకి దిగారు. తన మాట‌ల‌తో… డైలాగుల‌తో త‌న‌యుడి సినిమా ప్ర‌మోష‌న్ పెంచే బాధ్య‌త‌న త‌న భుజాల‌పై వేసుకొన్నారు. “సినిమా బాగుంది.. సూప‌ర్ హిట్‌.. వ‌సూళ్లు కుమ్మేస్తున్నాయి..“ అంటూ సినిమాని ప్ర‌మోట్ చేయ‌డం ఓ ప‌ద్ధ‌తి. అది అంద‌రూ చేసేదే. మోహ‌న్‌బాబు మాత్రం ఓ అడుగు ముందుకు వేశాడు.

”ఈ సినిమా చూద్దామ‌నుకొంటే టికెట్లు నాకే దొర‌క‌లేదు. ఆఖ‌రికి నిర్మాత‌ని అడ‌గాల్సివ‌చ్చింది. ఆయ‌నా చాలా ఇబ్బంది ప‌డి టికెట్లు సంపాదించారు” అని సెల‌విచ్చారు. దాంతో ఆశ్చ‌ర్య‌పోవ‌డం సినీ జ‌నాల వంతైంది. సినిమా ఎంత బాగా ఆడుతున్న‌ప్ప‌టికీ… మోహ‌న్‌బాబుకీ, ఆ సినిమా నిర్మాత‌ల‌కూ టికెట్లు దొర‌క్కుండా ఉంటాయావిడ్డూరం కాక‌పోతే…! మోహ‌న్ బాబుకే దొర‌క్క‌పోతే ఇక మ‌న‌కెక్క‌డ దొరుకుతాయిలే అని థియేట‌ర్‌కి వెళ్ల‌కుండానే జ‌నం లైట్ తీసుకొంటే మొద‌టికే మోసం వ‌చ్చే ప్ర‌మాదం ఉంది. ఏమంటారు మోహ‌న్ బాబూ..!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close